మనకు దేవుని గుడులలో జరిగే ఉత్సవములు ,దేవుని కళ్యాణములు ఇలాంటివి తెలుసుకదా! టి.విలలో కూడా చూస్తుంటాము. మనము అదొక వేడుకగా పాల్గొంటాము. నాకు ఆ మద్య టి.వి.లో అహోబిలం నరసింహస్వామి వారి కళ్యాణము ,మరియు తిరుమల ఇవి చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే,దీని వెనుక సమాజసేవ కూడా ఉందని.
ఎలా అంటే మనలో ఉన్నవాళ్ళు బాగా డబ్బు ఖర్చు పెట్టి ఫంక్షన్స్ ,పెండ్లి,ఇవి చేస్తుంటారు కదా! ఇలాంటివి చూస్తున్నప్పుడు పేదవారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి!వారికీ ఆశలుంటాయి కదా! వారికీ ఇలాగ ఫంక్షన్స్ చేసుకోవాలని ఉంటుంది. కానీ ఎలా....
ఇవన్నీ ఆలోచించి పెద్దవాళ్ళు ఇలా భగవంతుని ఫంఖ్షన్స్,పెండ్లి, తిరునాళ్ళు,జాతర, ఇలా ఏర్పాటూ చేశారేమోనని.... .ఆ దేవుని వేడుకలలో సామాన్యులు కూడా సరదాగా తమ ఇంట్లో ఫంక్షన్ లా, తమ ఇంట్లో జరిగే పెండ్లిలా, హాయిగా ఎంజాయ్ చేయొచ్చుకదండి.. వారి ఆశ తీరుతుంది కదా.పుణ్యము, పురుషార్ధం రెండూ కలిసి వస్తాయి.సామాన్యజనం పిల్లలు అర్ధ రాత్రి అయినా ఈ వేడుకలలో ఎంతో ఉత్సాహముగా పాల్గొనటము ఉండటము నేను చూశాను.ఇలా మన పెద్దలు ఇన్ని ఆలోచించి ఇలాంటి ఆచారములు పెట్టారని అనిపించింది.
ఇక దేవుని ఆరాధించటము అంటారా తప్పేముంది. మనము పీల్చే గాలి,త్రాగే నీరు ఆయన భిక్షయే కదా. ఇవన్నీ స్రుష్టించిన అసలయిన సైంటిస్ట్ ఆయన. అందుకు పూజ పేరుతో థాంక్స్ చెప్పటము తప్పా!మన తల్లి,తండ్రులకు మనము థాంక్స్ చెప్పటము లేదా!మనకు అవసరమయినప్పుడు మన పేరెంట్స్ను, సహాయము అడిగినట్లే ఆ భగవంతుని అడుగుతున్నాము.
ఒక తల్లి, తన పిల్లవాడు ఎక్కువ లడ్లు అడిగితే వానికి జీర్ణశక్తి ఉంటే ఇస్తుంది.లేకపోతే ఇవ్వదు. అలాగే భగవంతుడు మన అర్హతను చూసి మనము కోరినవి ఇస్తాడు.మనము మంచి ప్రవర్తన పెంచుకుంటే అన్నీ ఇస్తాడు.
ఇక ఆ భగవంతుని దగ్గర అందరూ సమానమే కాబట్టి దేవుని గుడి అందరిదీ. పురాణములలో ధర్మవ్యాధుడు, ఆదిశంకరాచార్యుల వారికి ఎదురయిన మహానుభావుల వంటి వారి నుంచి ఇది మనము చెప్పవచ్చు .....
సమాజములో దొంగాస్వాములు,మోసములు,ఇవి పోవటానికి,కృషి చేస్తున్న అందరికి థాంక్స్ చెబుతూ అలాగే దేవుడు అనే మహాశక్తి లేదని అనవద్దని కోరుతూ ........
mamchi post
ReplyDelete