koodali

Wednesday, April 21, 2010

ఒకరి సంపద వంద కోట్లు, ఒకరి సంపద వంద నోట్లు.

మొన్న టి.వి లలో ఆ ఇంజనీరింగ్ అబ్బాయి అబిలాష్ ను చూసినప్పుడు చాలా భాధ అనిపించిందండి. కొద్ది కాలం క్రితము అతని ఫ్రెండ్ అదే యాక్సిడెంట్ లో చనిపోయాడు కదా ఎంతో భాధాకరం. ఇలాంటివి ఎందుకు జరుగుతాయో ఆ భగవంతునికే తెలియాలి. ఎన్నో కొత్త ప్రాజెక్ట్స్ తో దేశానికి ఉపయోగపడవలసిన యువ ఇంజనీర్ ట్రీట్‌మెంట్ కొరకు ఇలా మనీ ప్రాబ్లం రావటము అత్యంత దురద్రుష్టము. అసలు ప్రభుత్వము వారు మొత్తము ట్రీట్‌మెంట్ చేయిస్తే ఎంత బాగుంటుంది.


మన దేశములో ఎంతోమంది మేధావులు ఉన్నారు. మన ఖర్మ కొద్దీ వాళ్ళు ఇక్కడ ఆదరించేవాళ్ళు లేక విదేశాలకు వెళ్ళిపోతున్నారు.మనమేమో అభివ్రుద్ది కోసం విదేశముల వారిని help అడుగుతాము. ఇది చాలా చిత్రముగా ఉంది కదండీ.జపాన్ చూడండి ఎవరి సహాయము లేకుండా రెండవ ప్రపంచయుద్దములో అంత దెబ్బ తిని కూడా ఎంత అభివ్రుద్ది చెందిందో.. వాళ్ళు విపరీతముగా పనిచేస్తారు. మనదేశములో విపరీతముగా దోచుకొనే వాళ్ళు ఎక్కువ అయిపోయారు.



అసలు మన దేశము ఇంత దరిద్రములో ఎందుకు ఉందంటే , ఒకరి దగ్గర 100కోట్లు ఉంటే ఒకరి దగ్గర ఓటు తప్ప నోట్లు ,కోట్లు ఉండవు కాబట్టి. కొంత మంది ప్రపంచములో సొమ్మంతా వారి తరతరాలకి దాచి అత్యాశకు పోతున్నారు.

అసలు మనకు కావాల్సిన దానికన్న ఒక లిమిట్ దాటి సంపాదించుకోవటము మహా పాపము. ధనవంతులు చాలా మందికి కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది కాని కడుపు నిండా ఇష్టమయినవి తినలేరు.మనలో చాల మందికి ఏ షుగరు జబ్బో, బి.పి,జబ్బో ఉంటాయి. ఇంకా మనశ్శాంతి లేక ఎన్నో కష్టాలుంటాయి. అప్పుడు డబ్బు ఎక్కువ ఉండి కూడా ఏమి లాభము. అందరి సొమ్ము దోచుకునేవాళ్ళు వచ్చే జన్మలో బిచ్చగాళ్ళుగా పుట్టే చాన్సు ఉంది.

దయచేసి ధనవంతులు మరీ ఎక్కువు డబ్బు పోగు చేసుకోవటం మాని పేద వాళ్ళు కూడా పైకి రావటానికి సహాయపడితే ఎంతో పుణ్యము చేసిన వాళ్ళవుతారు. ఆ పుణ్యము వల్ల ధనవంతులకు కూడా జీవితములో ఎంతో సంతోషముగా ఉంటుంది. అంతే గాని పేదలను దోచుకుని భగవంతుని పూజ చెయ్యటము మహా పాపము.


ఈ ప్రపంచము మన ఒక్కరి కోసము కాదు. ఈ సంపద అందరితో కలసి మనము పంచుకోవాలి. అప్పుడు మాత్రమే పేదరికం ఉండదు........మనము ఇంకొకరికి సహాయము చేసినప్పుడు ఉండే త్రుప్తి ఎన్ని లక్షలున్నా,రాదు. ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు. దయ చేసి ధనవంతులూ కొంచెము ఆలోచించండి. ప్లీజ్...............



మనము ఏదైనా కష్ట సమయములో రక్షించమని భగవంతుని అడిగితే , దానికి మన అర్హత, ఎంత కోట్ల ఆస్తి ఉందని ఆయన ఆలోచించడు. మనము ఎంత మందికి సహాయము చేశామని మాత్రమే ఆయన చూస్తాడు..................................

2 comments:

  1. దేవుడు మీ బ్లాగు చదివితే బావుంటుంద్.

    ReplyDelete
  2. బాగు౦ది..అవును అభిలాష్ చూసి చాలా బాదేసి౦ది..నాకు అన్పి౦చి౦ది ఈ ప్రభుత్వతాలు ఎ౦దుకు అని..వాళ్లని ఎవరైనా ఏమైనా అ౦టే నిమిషాల మీద టి.విలలో మాట్లడుతారు..వాళ్ళు అసలు స్ప౦ది౦చాల్సివస్తే అసలు ఉలకరు,పలకరు..

    ReplyDelete