koodali

Tuesday, April 13, 2010

భగవంతుని బొమ్మని కాలిక్రింద తొక్కాను.

 

నా బ్లాగ్‌ను ఆదరిస్తున్న అందరికి థాంక్స్ అండి.
ఇక ఇప్పుడు నాకు భక్తి ఎక్కువే కానీఅండి, నేను హైస్కూల్లో చదివేటప్పుడు ఒక టీచర్ బాగా నాస్తికవాది దేవుడు లేడు అని చెప్పటానికి చాలా టైం తీసుకునేవారు. పాఠం తక్కువ చేప్పేవారు.ఇక నేను టీనేజ్ కదండి, బాగా బ్రేయిన్ వాష్ అయి దేవుడు లేడని డిక్లేర్ చేశేసుకున్నాను. ఇక ఫ్రేండ్స్ ముందు గొప్పకి దేవుడి బొమ్మలు కాలితో తొక్కి చూపించటము జరిగింది. ఇప్పుడు తలచుకుంటే చాలా భాధగా ఉంటుంది. 

 

ఇక చూడండి, ఆ తరువాత భగవంతుడు ఉన్నాడనటానికి ఆ దేవుడు నాకు బాగా బుద్ది వచ్చేటట్లు చేశాడు. క్లాస్ లో ఫస్ట్ రాంక్ లో ఉండే నేను ఫైయిల్ అవ్వటము కూడా జరిగింది. మనము అహంకారముగా ప్రవర్తించితే మరి పెద్దవాళ్ళు మంచి దారిలోకి తెస్తారు గదా అలాగన్నమాట. భగవంతుని నమ్మటము వల్ల మనకే లాభం. కష్టాలలో ఉన్నప్పుడు మనకి ఎంతో ధైర్యంగా ఉంటుంది. 

 


మనకు,మంచిగా కళ్ళూ, చేతులు,ఇలా మంచి అవయములు, తినటానికి ఆహారం ఇవన్నీ ఇచ్చిన,భగవంతుని మనము మరిచిపోతే మనమే తప్పు చేసిన వాళ్ళము అవుతాము.మనకు ఎన్నో జన్మల నుండి తోడు ఉండే ఆత్మ బందువు ఆ భగవంతుడు. . . .



మనము ఒక కలెక్టర్ ను కలుసుకోవాలంటేనే ఎన్నోరూల్స్ పాటించాలి.మనకి పని ఉంటే పై ఆఫేసర్ ని విపరీతముగా పొగుడుతాము.అలాంటిది ఎన్నో వేల సంవత్సరాలనుంచి మనకు కనపడుతూ మనకు బ్రతుకు ఇస్తున్న ఆ సూర్యునికి గాని,వేల కోట్ల సంవత్సరాలనుంచి స్రుష్టిని నడిపిస్తున్న ఏ శక్తిని అయినా భగవంతునిగా నమస్కరిస్తే తప్పేమిటి...ఇలాగే ఆ భగవంతుని నమ్మి మనము అందరము సుఖముగా ఉండాలి..
 

 

నేను ఏమనుకుంటానంటే ఎవరికయినా ఒకోసారి జీవితములో అత్యంత క్లిష్ట పరిస్తితులు ఎదురవుతాయి.అప్పుడు మన తెలివి తేటలు,ధైర్యము, ఏమీ పని చేయవు. అప్పుడు మనము ఏమి చెయ్యాలంటే మన శక్తి ఉన్నంతవరకు ట్రై చేసి ఇక భగవంతుని మీద భారము వేస్తే మనకు ప్రశాంతముగా ఉంటుంది. నేను ఒకసారి ఇలాగే చేశాను అప్పుడు అత్యంత విచిత్రముగా ఆ ప్రోబ్లం తీరిపోయింది.అంతకు ముందు ఆ సొల్యూషన్ నాకు తట్టలేదు.

అలాఎన్నో సార్లు ఆయన నన్ను ఆదుకున్నాడు. ఆ విధముగా భగవంతుని నమ్మే విధముగా చేసి, ఆయన నన్ను మంచి మార్గము లోకి తెచ్చారు. .... కామెంట్స్,,చూసాక ఇలా రాయాలనిపించింది...........................


జన్మ ఎత్తిన ప్రతి వారికి పూర్వ జన్మలో చేసిన పాపాల వల ఎన్నోకష్టాలూవస్తాయి.మనకు ఏదైనా రోగము ఉందనుకోండి, డాక్టర్ ను నమ్మితే మనకే జబ్బు తొందరగా తగ్గుతుంది.అలాకాకుండా డాక్టర్ ను తిట్టి ఆయన్ను నేను నమ్మనంటే మనకే నష్టము.అల్లాగే జన్మ ఎత్తగానే రోగాల్లాంటి ఎన్నో కష్టాలూ మనకి ఎదురవుతాయి. డాక్టర్ లాంటి భగవంతుని నమ్మితే మనకే లాభము.మనకి స్వశక్తి ఉందని మనము అనుకుంటాము గాని అశక్తి కూడా ఆయన దయే.



ఉదాహరణకి ఒక్కోసారి కొంతమంది ఆరోగ్యముగాఉన్నవాళ్ళు వాళ్ళ పూర్వ ఖర్మ ప్రకారము తెల్లవారేసరికి ఏ యాక్సిడెంట్ లోనో కాలో చెయ్యో పోగొట్టుకుంటారు. అప్పుడు వాళ్ళని చూస్తే మనకు మన చేతిలో ఎమీ లేదు అనిపిస్తుంది.,


అందుకనే నే భగవంతుడు నన్ను శిఖ్షించాడు అనుకోవట్లేదు. మన తల్లితండ్రిని తిడితే ఎంత తప్పో ఎన్నో జన్మల నుంచి మనలను కాపాడుతూ మనసుఖం కోసము తాపత్రయ పడుతున్న ,మనకు ఆహారము ఎర్పాటు చేసిన భగవంతుని తిట్టడమూ అంతే తప్పు.ఆ తప్పు ఇంకా ఎక్కువ చేయకుండా నన్ను చిన్న మందు ఇచ్చి డాక్టర్ లా రక్షించాడనుకుంటున్నాను..... .తప్పు పని చేసిన వాళ్ళని కొంచెము అయినా పనిష్ చెయ్యకపోతే మంచి వాళ్ళు కూడా తప్పులు చేస్తారు.... . 

 

చిన్నప్పుడు మనము డాక్టర్ దగ్గరకు వెళ్ళము,పెద్దవాళ్ళు ఎంత నచ్చచెప్పినా మనము వెళ్ళము అలాటప్పుడు మనల్ని ఒక దెబ్బ కొట్టి అయినా తీసుకెళ్తారు. మనమంచి కోసమే కదండి. మన జబ్బులు కుదరాలంటే డాక్టర్ ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకోవాలి,పథ్యము సరిగ్గాచెయ్యాలి,ఇంకా మన జబ్బు స్టేజ్ నుబట్టి మన రోగాలు తగ్గుతాయి. అలాగే మన కష్టాలు తీరాలంటె దేవుని నమ్ముతూనే మనము సత్ప్రవర్తన కలిగివుండాలి. అప్పుడే మన పూర్వ పాపాలు పోయి కష్టాలు ఉండవు... ......మనము మధ్యలో ఇంజెక్షన్లు, ఆపరేషన్లు ఇలాంటి వాటికి భయపడి పారిపోకపోతే కష్టాలు పూర్తిగా పోతాయి.............



6 comments:

  1. మీ శక్తి మీద మీకు నమ్మకం లేక పోవడం చాలా బాధాకరం.మీరు బాగా చదివి అన్ని సమాధానాలకి సరైన సమ్మధానాలు ఇచ్చి వుంటే ఎందుకు ఫెయిల్ అయ్యి వుంటారండి?కేవలం మీ అపజయాన్ని కప్పుకోవడానికి దేముడి సాకు తీసుకున్నారనిపిస్తుంది.అయినా మన పనులు కావాలని పొగిడితే పొంగిపోయే కాకారాయుడి తో మనకి ఏమి పని చెప్పండి.నా వాఖ్యలు తీవ్రంగా వుంటే మన్నించగలరు.

    ReplyDelete
  2. పసివాడు గుండెలపైతన్నితే తల్లిదండ్రి నవ్వుకుని ఆనందిస్తారే తప్ప కోపపడరు . అలానే చిన్నతనం తప్పులుకూడా పరమాత్మ క్షమిస్తాడు

    ReplyDelete
  3. .....ఫ్రేండ్స్ ముందు గొప్పకి దేవుడి బొమ్మలు కాలితో తొక్కి చూపించటము జరిగింది......ఆ తరువాత భగవంతుడు నాకు బాగా బుద్ది వచ్చేటట్లు చేశాడు......క్లాస్ లో ఫస్ట్ రాంక్ లో ఉండే నేను ఫైయిల్ అవ్వటము కూడా జరిగింది......
    ...అంటే భగవంతుడు ఇలా పగ తీర్చుకుంటాడన్నమాట!! నిజమే......మీరన్నట్టు భగవంతుని నమ్మటము వల్ల మనకే లాభం!

    ReplyDelete
  4. ఇలాగే మనం ఆ భగవంతుడిని నమ్మి మనందరం సుఖంగా ఉండాలని ముగించారు. భగవంతుడిని నమ్మని
    వాళ్లు కూడా చాలా సుఖంగా ఉన్నారండి. దేవుడి మీద నమ్మకం ఉంటేనే అందరం సుఖంగా ఉంటారు అనుకోవడం సరికాదేమో. స్వసక్తిని నమ్ముకుని ఎఁతో మంది సుఖంగా ఉన్నారు. నాకెందుకో మీరు చిన్నప్పుడే
    చాలా వివేకంగా ఆలోచించారని పిస్తుంది. మీ నమ్మకంతో నేను విభేదించవచ్చు. కానీ మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను.

    ReplyDelete
  5. మీలాగ భయపడే వారు దేవుడిని నమ్మడమే కరెక్టు.

    ReplyDelete
  6. మన జీవితం లో ఎన్నో క్లిష్టమయిన పరిస్తుతులని ఎడుర్కో వలసి వస్తుంది. అప్పుడు ఏమీ చెయ్యాలో తోచక మానిసకంగ దిగ జారటమో, మానసిక వ్యాధి కుదిర్చే డాక్టరు దగ్గరకు వెళ్ళటమో లేక దేముడులాంటి పెద్దమనిషి దగ్గరకు వెళ్ళటమో చెయ్య వలసి వస్తుంది. అటువంటి పరిస్తుతులు కలగక పోతే మీరు అదృష్ట వంతులు.
    మానిసకం గ దిగజారిన వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు. దేవుళ్ళ అంటే ఎవరో కాదు మనని కని పెద్దజేసి విద్యాబుద్దులు నేర్పి బతక నేర్పిన వాళ్ళు. వాళ్ళందరూ దేవుళ్లే.
    మనంతట మనము తెలివితేటలు అన్నీ సంపాయించు కున్నామనుకోటము మనము వంచించు కోవటమే. ఎందుకంటే మనము పుట్టినప్పుడు మనము బతికి బట్టకట్టటానికి కావాల్సిన తెలివితేటలూ ఎమీలేవు. మనము ఎవరికీ పుట్టామో కూడా తెలియదు ఎవరో చెబితే తప్ప.

    ReplyDelete