koodali

Wednesday, February 8, 2017

శ్రీ శనిదేవుని మహిమలు ...... రెండవ భాగము .





ఓం

Friday, July 13, 2012

ఓం 

....శ్రీ  శనేశ్వరులు  నికృష్ఠు ,  వికృత  రూపుడు కాడు.  తపోగ్నిచే  దహించబడిన  స్వర్ణ  కాంతి  కాయుడు  సర్వాంతర్యామి,  సర్వ  సాక్షీభూతుడు. పరిపూర్ణ  అహింసామూర్తి...
 

..."  తన  కర్మ  శేష  ఫలితముగా  అయితేనేమి,  కుకర్మల  కారణముగా  నైతేనేమి   మానవుడు  రోగి  లేక  భోగి  అవుతున్నాడు   మానవుల  కుకర్మల  ఫలితమే  రోగము.  రోగము  నుండి  విముక్తి  పొందాలంటే  వైద్యున్ని  ఆశ్రయించాలి.  రోగమూలము  నిర్ధారణ  చేసి  వైద్యము  చేసి  రోగి  నుండి  రోగాన్ని  పారద్రోలడమే  వైద్యుని  కర్తవ్యము.  కాని  రోగితో  గాని  రోగముతో  గాని  వైద్యునికి  ఎలాంటి  సంబంధము  లేదు.  ఈ  విధంగానే  బహుబంధాలు  ,  బహుబాధలు  మానవ  జనిత  కర్మ  ఫలములే.  కాని  శని  కృతము  కాదు. గ్రహదేవుడు  బాధిస్తాడా  ?  వేధిస్తాడా ?  ఎంతటి  అజ్ఞాన  భావన.  వీటినుండి  ముక్తి  పొందాలంటే  గ్రహదేవుని  పాదాల కడ   సమర్పణ  భావముతో  ప్రార్ధించడం  ఉత్తమం...."

.(  ఈ  విషయములు  శ్రీ  శనేశ్వర  దేవతా  మహాత్యము    గ్రంధము  లోనివి.  )

....ఈ  గ్రంధ  కర్త  శ్రీ  మహాజన్ స్వామి రావు  గారు.  ఈ  గ్రంధము   శింగణాపూర్  శ్రీ  శనేశ్వరాలయము  పబ్లిక్  ట్రస్ట్  వారి  సౌజన్యముతో  ముద్రితమైనదట.  ఈ  గ్రంధములో    శనిదేవుని  గురించిన    మహిమలు  ఉన్నాయి. 
 
...............................
 
కొందరు  ఏమనుకుంటారంటే,  శనిదేవుడు  ప్రజలను  శిక్షిస్తారు  అంటారు.  అలా  అనుకోవటం  తప్పు.  నాకు  ఏమనిపిస్తుందంటే,
 

  శనిదేవుడు  న్యాయ  పరిరక్షకుడు.  కాబట్టి  ,  ఎవరైనా  పాపాలు  చేస్తే  వారికి  తగ్గ  శిక్షను  విధించి,   తద్వారా  వారిని  మంచి  మార్గానికి  తీసుకు  వస్తారు.
 లోకంలో    శిక్షలంటూ  లేకపోతే  ప్రజలలో  పాపభీతి  తగ్గిపోతుంది  కదా  ! న్యాయస్థానాలలో  జడ్జీలు  కూడా  శిక్షలను  విధిస్తారు .

.............................
 

శ్రీ  శనిదేవుడు  శ్రీ  క్షేత్ర  శింగణాపూర్  లో   వెలిసారు.

 ఈ ఊరిలోని అంగళ్ళకు తాళములు వేయరట.

ఇక్కడ దొంగతనములు జరగవు.
................

శింగణాపూర్  సందర్శించే  భక్తులకు  కొన్ని  ముఖ్య  సూచనలలో  కొన్ని  .....
భక్తులు  తమ  వెంట  మద్యమాంసాదులు  తీసుకెళ్ళుట  దైవాపరాధము  అని  చెప్పబడింది....

ఇక్కడ  కుల,  మత  , వర్ణ  ,వర్గ  వ్యత్యాసాలు  పాటించతగదని పెద్దలు  తెలియజేసారు.

పవిత్ర  ప్రసాదమును  మూఢభావాలతో  తిరస్కరించడము  దైవాపరాధమని  పెద్దలు  తెలియజేసారు.
............
 
  ఎన్నో  ప్రత్యేకతలున్న  క్షేత్రము  శ్రీ  శని  శింగణాపూర్....
 
ఈ  రోజుల్లో  కూడా  ఇలాంటి  ఊరు  ఉన్నదని  ఎందరో  ఆస్తికులు,  నాస్తికులు  కూడా ఈ  ఊరును  దర్శిస్తుంటారట..
..............
 
వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను...


5 comments:


  1. శని దేముడు ఏమిటండీ!? ఆయన ఒక గ్రహము. పరమేశ్వరుని కింకరుడు ఆయన. "శనైశ్చరుడు" సరి అయిన పదం. చాలా మంది శనీశ్వరుడు అంటారు. అది తప్పు. గ్రహములకు ఈశ్వరుని అంత స్థాయి లేదు. ఈశ్వరుని అనుఙ్ఞ మేరకు గ్రహములు మనని ప్రభావితం చేస్తాయి. రాజు క్రింద పనిచేసే వారందరినీ రాజా అని పిలవడం సరికాదు కదా!
    ReplyDelete


  2. * మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. నేను మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూసాను.. రిప్లై ఇవ్వటం ఆలస్యమైనందుకు దయచేసి క్షమించండి..

    * నాకు తెలిసిన విషయాలు తక్కువ....నాకు తెలిసినంతలో రాసానండి.

    * ఆదిపరాశక్తిపరమాత్మ అయిన ఆది దైవం అన్నింటికీ మూలం.

    * దైవాన్ని ఎలాగైనా పూజించుకోవచ్చునని పెద్దలు చెబుతుంటారు. దైవాన్ని కొందరు ఒక్క నామము, ఒక్క రూపంతో భావించి ఆరాధిస్తారు. మరి కొందరు రకరకాల నామములు, రూపాలతో దైవాన్ని భావించి ఆరాధిస్తారు. ఎవరి ఓపిక , ఆసక్తి వారిది.

    * ఒక్క నామంతో ఒక్క రూపంతో దైవాన్ని ఆరాధించినా లేక విభిన్న నామములతో రూపములతో ఆరాధించినా ఫలితం ఒకటిగానే వస్తుంది. భగవంతుని మెప్పించేది భక్తి మాత్రమే.

    * కొందరు ఆదిపరాశక్తి అయిన పరమాత్మను ఆరాధిస్తారు. కొందరు శివుణ్ణి ఆరాధిస్తారు. కొందరు విష్ణువును ఆరాధిస్తారు. కొందరు సూర్యుణ్ణి ఆరాధిస్తారు. కొందరు హనుమంతుని ఆరాధిస్తారు. కొందరు చాలా దేవతలను ఆరాధిస్తారు.

    * సంధ్యావందనం చేయటం, గాయత్రిని అర్చించటం మాత్రం చాలా మంది చేస్తారు.

    * సీతాదేవిని తీసుకురావటం కోసం లంకకు వెళ్ళేముందు విష్ణుమూర్తి అంశ అయిన రాముడు ఆదిత్యహృదయం ద్వారా సూర్యుని ఉపాసించారట.

    * రాముడంతటి వారే సూర్యదేవుని ఆరాధించినప్పుడు సామాన్య మానవులు సూర్యుని దేవునిగా ఆరాధించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ సూర్యదేవుని పుత్రుడే శనిదేవుడు.

    * శివుడు, విష్ణుమూర్తి శనిదేవునికి గురువులట.......సూర్యుడు హనుమంతునికి గురువట. శనివారం హనుమంతుని పూజించిన వారిని శని బాధించరట.

    * నవగ్రహాల అధిపతులు దేవుళ్ళుగా నవగ్రహ పూజ పెద్దలు ఏర్పరిచిందే కదండి.

    * సత్యనారాయణస్వామి వారి పూజలో కూడా నవగ్రహ పూజ జరుగుతుంది.

    * శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిఃలో ఇలా ఉన్నాయండి.
    ఓం సూర్యమండల మధ్యస్థాయై నమః
    ఓం చంద్రమండల సంస్థితాయై నమః
    ఓం వహ్ని మండల మధ్యస్థాయై నమః
    ఓం వాయు మండల మధ్యస్థాయై నమః

    * ఇవన్నీ గమనిస్తే దైవం సర్వాంతర్యామి అని తెలుస్తోంది. ఎవరి ఓపికను బట్టి వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు.

    * ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ పరమదైవాన్ని ఆరాధించినట్లే. ఎందుకంటే ఆదిదైవం నుంచే అన్ని దైవరూపాలూ వచ్చాయి కాబట్టి....

    * ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. నన్ను పరీక్షించటానికి ఇలా వ్యాఖ్యానించారని నేను భావిస్తున్నాను. తప్పులుంటే దయచేసి క్షమించండి.
    ReplyDelete

    Replies


    1. శివుడు, విష్ణుమూర్తి శనిదేవునికి గురువులట.......సూర్యుడు హనుమంతునికి గురువట. శనివారం హనుమంతుని పూజించిన వారిని శని బాధించరట....

      .(...శనిదేవుడు శ్రీ కృష్ణునికి భక్తులట.)
      Delete





  3. chala baga vivarincharandi........
    ReplyDelete


  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    ReplyDelete


    Monday, February 6, 2017

    శ్రీ శనిదేవుని మహిమలు..


    శ్రీ శనిదేవుని  మహిమలు..


    క్రింద  లింకులు  ఇస్తున్నానండి.
    Mahima Shani Dev ki Part 2 6th june 2009 - YouTube..1

    Mahima Shani Dev ki Part 3 6th june 2009 - YouTube..2

    Mahima Shani Dev ki Part 2 13th june 2009 - YouTube..3

    Mahima Shani Dev ki Part 3 13th june 2009 - YouTube..4

    Mahima Shani Dev ki Part 4 13th june 2009 - YouTube..5

    Mahima Shani Dev ki Part 1 20th june 2009 - YouTube..6

    Mahima Shani Dev ki Part 5 6th june 2009 - YouTube..7

    Mahima Shani Dev ki Part 2 20th june 2009 - YouTube..8

    Mahima Shani Dev ki Part 5 13th june 2009 - YouTube..9
    Mahima Shani Dev ki Part 3 20th june 2009 - YouTube..10
    Mahima Shani Dev ki Part 4 20th june 2009 - YouTube..11 Mahima Shani Dev ki Part 5 20th june 2009 - YouTube..12

    Mahima Shani Dev ki Part 1 27th june 2009 - YouTube..13
    Mahima Shani Dev ki Part 1 27th june 2009 - YouTube..14
    Mahima Shani Dev ki Part 3 27th june 2009 - YouTube..15
    ,,
    Mahima Shani Dev ki Part 5 27th june 2009 - YouTube..




    ఈ విషయాలను అందించిన అందరికీ కృతజ్ఞతలండి.
    .......................
    పై విషయాలను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి.


    ఈ భాగాన్ని గమనించినా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు...........

    Mahima Shani Dev ki Part 5 27th june 2009 - YouTube


    ******************
    లింక్స్  ఇవ్వచ్చో  లేదో  నాకు  తెలియదు.  ఇలా ఇవ్వటం  ఎవరికైనా  అభ్యంతరం  అయితే  దయచేసి  తెలియజేయగలరు.


    Friday, February 3, 2017

    ఓం.. సూర్యుడు ప్రత్యక్ష పరమాత్మ...



    దైవాన్నిచూపించండి .. అని ఎవరైనా అడిగితే సూర్యుణ్ణి చూపించవచ్చు.

    సూర్యుడు ఆరోగ్యప్రదాత అని పెద్దలు చెబుతారు.


    శ్రీ కృష్ణుని కుమారుడైన సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యమును ఈ సూర్యస్తోత్రమును పఠించి పోగొట్టుకోగలిగాడట. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము.


    ఈ  లింక్ వద్ద..  

     ...Dwadasa Arya Surya Stuthi - YouTube


    ఈ విషయాలను అందించిన అందరికీ కృతజ్ఞతలండి.

    **********************
    .వేయికిరణాలు గల ఆ సూర్యుని ఒక కిరణభాగము చంద్రబింబము నందుండి రాత్రివేళ చీకటినంతనూ మటుమాయంచేసి వెలుగు కలిగిస్తుంది. అలాంటి సూర్యుడు నా ఆపదలను బాపుగాక !..అనే విషయాన్ని గమనిస్తే..

    . సూర్యుని కిరణాలు చంద్రునిపై పడటం వల్ల వెన్నెల కలుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.

    **********************
    ఇంకొక విషయం ఏమిటంటేనండి,
     ఇంతకుముందు కూడా  నేను సూర్యస్తుతిని పోస్ట్ చేసాను.

    అయితే, నేను ఇంతకుముందు వేసిన సూర్య స్తుతిలో ఏమైనా అచ్చుతప్పుల వంటివి ఉన్నాయేమోనని అనిపించి, ఇప్పుడు నెట్లో వెతికాను.

     నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన సూర్య స్తుతికి ..నెట్లో ఉన్న వాటికి కొన్ని తేడాలు కనిపించాయి.

     నాకు సంస్కృతం తెలియదు.ఏది కరెక్టో ? ఏది కాదో? తెలియక గందరగోళం కలిగింది.


    దైవం దయ వల్ల శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తెలియజేసిన సూర్యస్తుతి కనిపించింది. ఆ లింక్ ఇచ్చాను.

    డైరక్ట్ లింక్ ఇవ్వవచ్చో లేదో నాకు తెలియదు. అభ్యంతరం ఉన్నచో తెలియజేస్తే డిలీట్ చేస్తానండి....



    Wednesday, February 1, 2017

    ఓం ..సరస్వతీ ద్వాదశనామ స్తోత్రము...



    సరస్వతీ మయం  దృష్ట్వా వీణా  పుస్తకధారిణీమ్
    హంసవాహ సమాయుక్తా  విద్యా  దానకరీ మమ..1


    ప్రధమం  భారతీ నామ  ద్వితీయం  చ  సరస్వతి
    తృతీయం  శారదాదేవి   చతుర్ధం  హంసవాహినీ ..2


    పంచమం  జగతీ  ఖ్యాతా షష్ఠం వాగీశ్వరీ  తధా
     కౌమారీ  సప్తమం  ప్రోక్తా   అష్టమం బ్రహ్మచారిణీ..3


    నవమం  బుద్ధిధాత్రీ చ  దశమం  వరదాయినీ
     ఏకాదశే  క్షుద్రఘంటా  ద్వాదశం  భువనేశ్వరీ..4


    బ్రాహ్మీ  ద్వాదశ నామాని  త్రిసంధ్యం  యఃపఠేన్నరః
    సర్వ సిద్ధికరీ   తస్య  ప్రసన్నా  పరమేశ్వరీ..5


    సా మే వసతు  జిహ్వాగ్రే  బ్రహ్మరూపా  సరస్వతి 
    ఇతి  శ్రీ  సరస్వతి  ద్వాదశనామ స్తోత్రం  సంపూర్ణము  .


    ఫలం: సర్వవిద్యా  ప్రాప్తి -  వాక్శుద్ధి.

     వ్రాసిన  విషయాలలో అచ్చుతప్పుల వంటి పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.
    **************


    ఒక విషయం  ఏమిటంటే ... 

    ఒక దగ్గర  షష్టం వాగీశ్వరీ  తధా..అని ఉంటే.. ఒక దగ్గర ..   షష్ఠం వాగీశ్వరీ  తధా.. అని చదివాను . 

    పండితులు చెప్పిన ప్రకారం.. షష్ఠి తిధిని షష్ఠి అని వ్రాస్తారు .అయితే, సుబ్రహ్మణ్య షష్టిని ..సుబ్రహ్మణ్య షష్టి  అని వ్రాస్తారట .

     అలా చూస్తే, .. షష్టం వాగీశ్వరీ  తధా..అన్నదగ్గర..  షష్ఠం వాగీశ్వరీ  తధా.. అని ఉండాలేమోనని సందేహంగా అనిపిస్తోంది. 
     
    వ్రాసిన  విషయాలలో ఏమైనా అచ్చుతప్పుల వంటి పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.




    Monday, January 30, 2017

    ఓం...శ్రీ శనిదేవుని మహిమలు..


     
    మానవుల లక్ష్యం మోక్షాన్ని పొందటం( పరమాత్ముని పొందటం.) 

    అందుకు చక్కటి పద్ధతులతో కూడిన జీవనవిధానాన్ని పాటించటానికి ప్రయత్నించాలి. 

     శనిదేవుడు ఎంతో కరుణామయుడు.శనిదేవుని కధల ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. 

     శనిదేవుని మహిమలు  చాలా  భాగాలుగా ( హిందీలో ధారావాహికగా ) imagin T.V. లో వచ్చాయి...

       శనిదేవుని మహిమలు చాలా బాగుంటాయి.ఈ మహిమలలో  పురాణేతిహాసాలలోని  కధలు  కూడా  ఉన్నాయి.

     తెలుగులో " మా "  టీవీలో  " శ్రీ  శనిదేవుని మహిమలు " ధారావాహికగా వచ్చాయి... 

    ఆసక్తి ఉన్నవారు  ఈ లింకుల వద్ద  కొన్నింటిని ప్రయత్నించ గలరు.


    Mahima Shani Dev Ki -( Epi 100)- Video Daily motion.........

    పై లింక్ వద్ద  రాకపోతే,

    Mahima ShaniDev Ki Epi 100- YouTube ... వద్ద ప్రయత్నించగలరు.


    Sree Shani Devuni Mahimalu - 17th Nov -1


    Mahima Shani Dev Ki Epi 1


    Mahima Shani Dev Ki - (Epi 2) - Video Dailymotion



    Friday, January 27, 2017

    ఓం ..కొన్ని విషయములు..

     
     భూమిని గురించి శ్రీదేవీ భాగవతము గ్రంధము ద్వారా ఎన్నో విషయములు తెలుసుకోవచ్చు.కొన్ని విషయములు ఏమిటంటే..

    ఈ వసుంధరను వరాహస్వరూపుడైన విష్ణుమూర్తికి భార్యగా మునులూ మనువులూ స్తుతించారు.వీరి కుమారుడు మంగళుడు. ఇతని కుమారుడు కుంభసంభవుడు.
    పంచీకరణమార్గంలో మూలప్రకృతి నుంచి ఆవిర్భవించిన ఈ వసుంధర వరాహావతార కాలంలో వారాహిగా అర్చింపబడింది. 
    ............

    హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి భూగోళాన్ని ప్రళయజలధి నుంచి ఉద్ధరించడం కోసం శ్రీహరి వరాహావతారం ధరించాడు. తన బంగారుకోరతో భూమిని పైకి లేవనెత్తి నీటిమీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు. 

    ఈ వసుంధరను వరాహస్వరూపుడైన విష్ణుమూర్తికి భార్యగా మునులూ మనువులూ స్తుతించారు.
     వరాహస్వరూపుడైన విష్ణుమూర్తి భూదేవికి వరాన్ని ఇవ్వటం జరిగింది  ... 

    సర్వాధారా!శుభస్వరూపిణీ! వసుంధరా!ఈ రోజునుంచీ నువ్వు దేవదానవ మానవకోటులందరి చేతా పూజింపబడతావు.శంకుస్థాపనలు చెయ్యాలన్నా గృహప్రవేశాలు జరగాలన్నా వాపీకూపతటాకాదుల్ని నిర్మించాలన్నా వ్యవసాయం మొదలుపెట్టాలన్నా -మానవులందరూ ముందుగా నిన్ను అర్చిస్తారు. అంబువాచీ త్యాగదినాన తప్పక పూజలు అందుకుంటావు.ఇది నా వరం.అర్చించని మూఢులు నరకానికి పోతారు.ఇది నా శాపం.

    (ప్రతినెలా ఆర్ద్రా నక్షత్రం నుంచి మూడురోజులు భూదేవికి అంబువాచి అనిపేరు. ఆ మూన్నాళ్లు భూమిని దున్నరాదని నియమం.) 

    ఈ వరానికి సంతోషించిన వసుధాదేవి వరాహస్వామిని మరొక్క వరం అడిగింది. 
    నాధా! నీ ఆజ్ఞను శిరసావహించి ఈ చరాచరజగత్తును అంతటినీ నేను భరిస్తాను. కానీ ముత్యము, ఆల్చిప్ప, హరిపూజా ద్రవ్యాలు,శివలింగము, శివామూర్తి, శంఖము, దీపము, యంత్రము, మాణిక్యము, రత్నము, యజ్ఞసూత్రము, పుష్పము, పుస్తకము, తులసీదళము, జపమాల, పుష్పమాల, కర్పూరము, బంగారము, గోరోచనము, చందనము, సాలగ్రామము -వీటిని మాత్రము భరించలేను. కాబట్టి వీటిని ఎవ్వరూ సాక్షాత్తుగా నామీద ఉంచకుండా నాకు సమర్పించకుండా కట్టడి చెయ్యమని అభ్యర్ధించింది. శ్రీహరి సమ్మతించాడు.ఈ ద్రవ్యాలను నీకు సమర్పించిన వారూ నీమీద సాక్షాత్తుగా ఉంచినవారూ నరకానికి పోతారని శాసించాడు. ..అటుపైని వసుంధర గర్భిణియై మంగళుడిని ప్రసవించింది.

    నారదా! అప్పటినుంచి అందరూ శ్రీహరి ఆజ్ఞ మేరకు కాణ్వశాఖోక్త ప్రకారంగా భూమిపూజ చేస్తున్నారు. 
    కాణ్వశాఖోక్తమైన స్తవనం కూడా ఒకటి ఉంది.అది కూడా శ్రీహరి ప్రోక్తమే. 

    నారదా! ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి భూదానఫలం లభిస్తుంది. భూమిదాన హరణ పాపం నశిస్తుంది.అంబువాచీ భూఖనన పాపమూ అంతరిస్తుంది...అంటూ నారాయణమహర్షి ఎన్నో విషయాలను తెలియజేసారు.

    *******************

    ఈ విషయాలను గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి.

    భూదేవి పుత్రుడు మంగళుడు..  అనే విషయాన్ని గమనిస్తే భూమికి మంగళగ్రహానికి పోలికలు ఉంటాయనే విషయం తెలుస్తుంది. 

    ఆధునిక శాస్త్రవేత్తలుకూడా మంగళగ్రహానికి భూమికి పోలికలున్నాయని  అంటున్నారు కదా!
     
    ఇంకా....   
    అంబువాచీ రోజులలో భూమిని త్రవ్వరాదని మరియు ఎన్నో విషయాలు తెలుస్తాయి. 
    ఆధునిక కాలంలో అనేకకారణాలతో రోజూ భూమిని త్రవ్వుతున్నారు. 
    అంబువాచీ దినాలలో భూమిని త్రవ్వరాదని నియమాలను పాటించేవారు ఎందరు? 
    మనుషులు తమ అవసరాలకోసం భూమిని విచ్చలవిడిగా తవ్వటం   ఎప్పుడైనా సరైనది కాదు.


    Wednesday, January 25, 2017

    అనేక అవసరాల కోసం భూమిని ...


    ఈ రోజుల్లో అనేక అవసరాల కోసం భూమిని బాగా తవ్వుతున్నారు. ఖనిజాల కోసం, నీటి కోసం, సహజవాయువు, పెట్రోల్ కోసం..ఇలా భూమిని విపరీతంగా తవ్వుతున్నారు.


    భూమిని అదేపనిగా  తవ్వి సహజవనరులను తీయటం వల్ల  ..

    .  భూమిలోపల బాగా ఖాళీ ప్రదేశం ఏర్పడి ..  సర్దుబాటు జరిగే ప్రక్రియలో  భూకంపాలు రావటం, మంచినీటి స్థానంలో సముద్రపు నీరు చొచ్చుకురావటం..వంటి ప్రమాదాలు ఉన్నాయంటున్నారు.


    ఇప్పటికే చాలాచోట్ల మంచినీటి స్థానంలో ఉప్పు నీరు వచ్చేసింది. నీరు బాగా కలుషితమయ్యింది.


    నదులను దేవతలుగా పూజించే ఈ పుణ్యభూమిలో నదులు ఎంతో కలుషితమైనా అంతగా పట్టించుకోవటం  లేదు.


    ఊళ్ళోని కాలుష్యాలను తీసుకెళ్లి నదులలో కలుపుతున్నారు చాలామంది.


    ఈ రోజుల్లో జబ్బులు మరింత ఎక్కువవుతున్నాయి. అందుకు ప్రధానకారణాలలో ఒకటి మనం పర్యావరణాన్ని కలుహితం చేయటం.


    ఖనిజాలు ఏర్పడాలంటే ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది.

    పొదుపుగా వాడుకోవలసిన భూమిలోని సంపదను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నాం.


    ముందుతరాల గురించి ఆలోచనే లేకుండా, మన అంతులేని కోరికల కోసం పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం.


    సృష్టిలోని సంపదను మనం సృష్టించామా? లేదు కదా!

    మరి తమ ఇష్టారాజ్యంగా అన్నింటినీ నాశనం చేసే హక్కు మానవులకు ఎక్కడిది?


      పర్యావరణాన్ని నాశనం  చేయటమంటే మనిషి  చేజేతులా తన నాశనాన్ని తాను ఆహ్వానించినట్లే.


    అంతులేని కోరికలను అదుపులో పెట్టుకోవాలి.సృష్టిలోని సహజవనరులను పొదుపుగా వాడుకోవాలి. అప్పుడే ప్రకృతి మనల్ని కాపాడుతుంది.