మేము వినాయక నిమజ్జనం కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందంటే..ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ఆకులు, పువ్వులు ఉన్నాయి. చెత్త కూడా పడేసి ఉంది. దుర్వాసన వస్తోంది.
మరీ ఎక్కువ ఆలోచిస్తే అయోమయం అవుతుంది. కొంతవరకే ఆలోచించగలం. మానవప్రయత్నంగా కొంతవరకు ఆలోచించి పాటించి.. దైవాన్ని నమ్ముకోవటం మంచిది.
..............
వినాయకుని ప్రతిమకు రసాయన రంగులు వేసి నీటితో కలిపితే మంచిది కాదు.
మరికొన్ని విషయములు..
ఈ రోజుల్లో చాలా పూజలలో విపరీతంగా సామాగ్రిని వాడుతున్నారు. పూజలు
ముగిసేసరికి బోలెడు నిర్మాల్యం మిగులుతాయి. కొందరు వాటిని చెత్తలో
వేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లతో సహా నీటిలో పడేస్తారు కొందరు.
కొందరు తమ దీక్షలు పూర్తయ్యాక దీక్షా వస్త్రాలను నదీతీరాల వద్ద గట్లవద్ద వదిలేసి వెళ్లిన దృశ్యాలు వార్తల్లో వచ్చాయి.
కుంభమేళా తరువాత మిగిలిన టన్నుల వ్యర్ధాలను మిషన్లతో ఎత్తిపోయవలసి వచ్చిందట.
ప్రజలు కొన్ని విషయాలను పాటించాలి. దైవచిత్రాలను ఎక్కడపడితే అక్కడ ముద్రించి తరువాత వాటిని చెత్తలో వేయటం సరైనది కాదు.
పూజల తరువాత మిగిలిన వాటిని, తినగా మిగిలిన ప్రసాదం పాకెట్లను రోడ్ల పక్కన పడేయటం కాకుండా జాగ్రత్తగా ఒక దగ్గర వేయాలి.
పసుపుకుంకుమ తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు, నూనె, నెయ్యి కవర్లు..ఇలాంటివి నీటిలోను, రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ వేయడం కాకుండా, ప్లాస్టిక్ వేసే చెత్తబుట్టలలో మాత్రమే వేయాలి.
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. చెరువులను, నదులను అశుభ్రంగా చేయకూడదు
....................
ప్లాస్టిక్ వంటి కొన్నింటి తయారీ మరియు వాడకం వల్ల కొందరు ఉపాధి పొందుతున్నారు కాబట్టి, అలాంటి వాటిని విమర్శించకూడదు, నిషేధించమని అనకూడదని కొందరు అనుకుంటారు.
పొల్యూషన్ వల్ల కొన్ని జీవజాతులు అంతరించే పరిస్థితిలో ఉన్నాయని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. అలాంటప్పుడు మన అవసరాలకోసం లేక కొందరు బ్రతకటం కోసం పొల్యూషన్ పెంచుతూ పోతే మనుషులతో సహా అన్ని జీవజాతులు అంతరించే ప్రమాదముంది.
.....................................
సోషల్ మీడియా వల్ల విపరీతధోరణి మరింత పెరిగింది. మీడియాలో ఉండాలంటే ఎప్పుడూ ఏదో ఒక్కటి చెప్పాలని కొందరు ఎప్పుడూ ఏదో చెబుతూ ఉన్నారు.
మన దేశంలో చాలా మందికి అత్యాశ పెరిగింది. ఎంతసేపూ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే పిచ్చి పెరిగింది. తల్లితండ్రి పిల్లలను చంపటం, భార్యాభర్తల అక్రమసంబంధాలు..ఒకరినొకరు క్రూరంగా చంపుకోవటాలు ఎక్కువయ్యాయి.
మీడియా ద్వారా అశ్లీలమైన, భయంకరమైన వ్రాతలు, దృశ్యాలు ప్రసారాల ప్రభావం చాలా ఉంటుంది. మూఢనమ్మకాలను ప్రచారం చేసేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. ఇలాంటి వాటిని ఎందుకు బాన్ చెయ్యటం లేదో అర్ధం కావటం లేదు.
అశ్లీలత, భయానకమైన విషయాలు, మూఢనమ్మకాలు..ఇలాంటివి మీడియాలో రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ప్రచారం చేసే వాళ్లపైన కేసులు పెట్టి శిక్షించాలి.
మన దేశంలో చాలామంది శుభ్రతను పాటించటం లేదు. అశుభ్రంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేసే వారిపైన కూడా కేసులు పెట్టి శిక్షించాలి.
ఈ రోజుల్లో చాలా విషయాల్లో వేలం వెర్రిలా ఏది ఎందుకు చేస్తున్నారో తెలియకుండా తయారవుతోంది.
ఎలాగోలా డబ్బు సంపాదించటం..విపరీతంగా ఆస్తులు పోగేయటం..విపరీతంగా వస్తువులను కొనేయటం..రకారకాలు వండుకుని విపరీతంగా తినటం...చేస్తున్నారు. మా డబ్బుతో మేం కొనుక్కుంటాం.. అనటానికి వీల్లేదు.
విపరీతమైన వస్తు వినియోగం వల్ల పర్యావరణం పాడవుతుంది. అమూల్యమైన ఖనిజ సంపద తరిగిపోతుంది. ఈ ప్రపంచం ఏ కొద్దిమందికి సంబంధించినది కాదు. అన్ని జీవులకు సంబంధించినది.
...............
సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సాటి మనుషులతో కూడా మంచిగా ఉండాలి. కష్టసుఖాలలో సాటి మనుషుల సహాయసహకారాలు కూడా అవసరమే కానీ, మనుషులు కొంతవరకే చేయగలరు.
పండుగలు, పూజలు కూడా కొందరు తమకు తోచినట్లు చెబుతుంటే, చేసేవాళ్లు తమకు తోచినట్లు చేస్తున్నారు. ఆచారవ్యవహారాల పేరుతో ప్రజలను భయపెట్టటం కూడా ఎక్కువయ్యింది.
ఈ రోజుల్లో ఎవరికి ఏమీ చెప్పేటట్లు లేదు. అందరిని సరైన దారిలోకి తీసుకురావాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
ReplyDeleteబకెట్లో నీళ్ళు పోసి, ఆ నీటిలో విగ్రహాన్ని పెట్టి నిమజ్జనం చేసి, ఆ నీటిని మొక్కలవద్ద, చెట్ల వద్ద పోసి నిమజ్జనం చేయటం తప్పో రైటో నాకు తెలియదు కాని,బయట మురికినీటిలో నిమజ్జనం చేయాలనిపించక ఇలా చేసాను.
బకెట్లో నీళ్లు పోసి విగ్రహాన్ని అందులో పెడితే, త్వరగానే మట్టి కరుగుతుంది. ఆ విగ్రహపుమట్టి నీటిని మొక్కలవద్ద ఒకదగ్గర పోయాలి. బకెట్ అడుగున మిగిలిన విగ్రహపు మట్టిని తీసుకొచ్చి బాత్రూంలో పోయవద్దు.
ఒక చిన్న బకెట్లో నీళ్ళు తీసుకువెళ్లి, బకెట్ అడుగున మిగిలిన విగ్రహపు మట్టిని అంతా నీటితోతిప్పి, ఆ మట్టినీటిని కూడా అక్కడే మొక్కలవద్ద పోయాలి.