koodali

Thursday, June 1, 2023

చెప్పుల వంటివి లేకుండా నడిస్తే ..

 

 కరెంట్ విషయంలో జాగ్రత్త కొరకు ఎర్తింగ్ చేస్తారు. పిడుగుల నుంచి రక్షణ కొరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

అయితే, ఎర్తింగ్ అనే పదం మనుషుల విషయంలో కూడా వాడుతున్నారు....కొద్దిసేపైనా నేలపైన పాదరక్షలు లేకుండా నడిస్తే ఎర్తింగ్ జరిగి ఆరోగ్యంగా ఉంటారని  కొందరు తెలియజేస్తున్నారు.

దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు, దేవాలయానికి వెళ్ళటానికి కొండలు ఎక్కేటప్పుడు..చెప్పులు లేకుండా నడిస్తే పుణ్యం వస్తుందని అంటారు. చెప్పుల వంటివి లేకుండా నడిస్తే ఆరోగ్యానికి కూడా మంచిదని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

 అయితే.. ప్లాస్టిక్, రబ్బర్..పాదరక్షలు వేసుకుని నడిస్తే ఎర్తింగ్ జరగదట. చెక్క వంటి సహజమైన వాటితో చేసిన పాదరక్షలు వేసుకుంటే ఎర్తింగ్ జరుగుతుందట. పాతకాలంలో మనవాళ్ళు చెక్కతో చేసిన పాదరక్షలు వేసుకునేవారు. ..

 ఈ రోజుల్లో కొండ మీద నడవాలంటే కొన్ని చోట్ల తారురోడ్ల మీద కూడా నడవవలసి వస్తోంది. తారురోడ్డు కృత్రిమం కనుక తారురోడ్ల మీద నడవటం వల్ల ఎర్తింగ్ ఉండదేమో అని నాకు అనిపించింది. మట్టిరోడ్డు మీద నడిస్తే ఎర్తింగ్ ఎలాగూ ఉంటుంది. నాపరాళ్ళు వేసిన ` దారిమీద అయితే నాపరాళ్ళు సహజమైనవే కాబట్టి ఎర్తింగ్ ఉండవచ్చు అని నాకు అనిపిస్తోంది. వీలైతే తారురోడ్డు ప్రక్కన నేలమీద నడవవచ్చు. .. 

ఎర్తింగ్ అనే విషయం గురించి విదేశాల వాళ్ళు ఒక మూవీ కూడా తీశారు...The Earthing Movie..The Remarkable Science of Grounding (full documentary) .. 

 రోజూ ఆరోగ్యం కొరకు వాకింగ్ చేసేవారు ఇంటివద్ద మట్టినేలమీద చెప్పులు లేకుండా నడవవచ్చు. రాళ్ళు గుచ్చుకుంటే నడవలేని వారు సాక్స్ వేసుకోవచ్చేమో అని నాకు అనిపిస్తోంది. (సాక్స్ అంటే నా అభిప్రాయం ప్యూర్ కాటన్ సాక్స్.)

 అయితే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎర్తింగ్ తో పాటూ ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంతేకానీ, మన ఇష్టానికి ప్రవర్తిస్తూ ఎర్తింగ్ మాత్రమే చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు.

కొందరు ఏమంటారంటే,  పూజలు చేసే సమయంలో నేల మీద డైరెక్టుగా కూర్చోకూడదు.. పూజ సమయంలో  ఏకాగ్రతతో, చక్కగా ఉండాలంటే  నేలమీద చెక్కపీట కాని, ఏదైనా పరుచుకుని కాని కూర్చోవాలని చెబుతారు. 

 కొందరు ఏమంటారంటే, విపరీతంగా పూజలు చేసే కొందరిలో విపరీతమైన శక్తి వచ్చే అవకాశం ఉంది ..అనేక కారణాల వల్ల కొందరు ఆ శక్తిని తట్టుకోలేరు... అలా  తట్టుకోవాలంటే బాగా నడవటం వంటి శారీరికశ్రమ చేయాలని కూడా అంటారు.

ఇవన్నీ గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, నడిచే సమయంలో అప్పుడప్పుడూ అయినా పాదరక్షలు వేసుకోకూడదు..ముఖ్యంగా దేవాలయాల వద్ద పాదరక్షలు వేసుకోకుండా నడిస్తే మంచిది...ఇక, కూర్చుని పూజ చేసే సమయంలో ఏకాగ్రతతో, చక్కగా ఉండాలంటే  నేల పైన  ఏమైనా పరుచుకుని కూర్చోవాలేమో .. అనిపించింది. 

.....

 నడిచే సమయంలో నేలమీద కొన్నిసార్లయినా బూట్ల వంటివి లేకుండా నడిస్తే మంచిదనే విషయంలో అనేక కారణాలు ఉంటాయి.
నాకు తోచిన వాటిలో మరి కొన్ని కారణాలు ఏమిటంటే..
 కొందరిలో అనారోగ్యం ఉంటుంది. బూట్ల వంటివి లేకుండా కొంతసేపు మట్టినేలమీద నడవటం వల్ల  ఆరోగ్యం బాగుంటుంది.  దేవాలయాల వద్ద ప్రదక్షిణ చేయటం, గిరిప్రదక్షిణ వంటి సందర్భాలలో ఇలా నడవటం ఇంకా మంచిది.

 విపరీతంగా పూజలు చేసే కొందరిలో విపరీతమైన శక్తి వచ్చే అవకాశం ఉంది. అనేక కారణాల వల్ల కొందరు ఆ శక్తిని తట్టుకోలేరు. అలా తట్టుకోవాలంటే  నడవటం వంటి శారీరిక శ్రమ చేయటం మంచిది.... కొంతసేపు మట్టినేలమీద బూట్లువంటివి లేకుండా నడవటం మంచిది...దేవాలయాల వద్ద ప్రదక్షిణ చేయటం, గిరిప్రదక్షిణ వంటి సందర్భాలలో ఇలా నడవటం ఇంకా మంచిది...దైవకృపను పొందాలి. అంతా దైవం దయ.

  ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి. .... సరిగ్గా అర్ధం కాని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అయితే, ఇవన్నీ అతిగా ఆలోచించి ఏది ఎలా చేయాలో తెలియక అయోమయం అవ్వటం కన్నా, తగుమాత్రం విషయపరిజ్ఞానం కలిగి, జీవితంలో ధర్మబద్ధంగా ఉండటానికి ప్రయత్నించటం..దైవం పైన చక్కటి భక్తి కలిగి ఉండటం ద్వారా.. ఎక్కువ విషయపరిజ్ఞానం లేకున్నా కూడా దైవకృపను పొందగలరు ..అని నాకు అనిపిస్తుంది. దైవస్మరణ ఎంతో మంచిది.

************

ఇంకా ఏమనిపిస్తుందంటే,
 చాలామంది పూజచేసేటప్పుడు నేలమీద రకరకాలైన పట్టాలను(మాట్స్)పరుచుకుని కూర్చుంటారు. ఉదా..దర్భతో చేసినవి, కొబ్బరినారతో చేసినవి. ప్యూర్ కాటన్ వస్త్రాలు పరచుకుని కూడా కూర్చోవచ్చు. అయితే, పోలియెస్టర్తో చేసిన మాట్స్ పరుచుకుని కూర్చోకూడదనిపిస్తుంది.

ఇంకా ప్రాచీనకాలంలో పూజ చేసేటప్పుడు ప్యూర్ కాటన్ వంటి వస్త్రాలను ధరించేవారు. ఈ రోజుల్లో కూడా పూజ సమయంలోనైనా ప్యూర్ కాటన్ దుస్తులను వేసుకుంటే మంచిదనిపిస్తుంది. పట్టువస్త్రాలను ధరించటం కొందరికి ఇష్టం ఉండదు. వాటి తయారీలో పట్టు పురుగులు చనిపోతాయని.

పూజ చేసేటప్పుడు ఈ మధ్య కొందరు ప్లాస్టిక్ పీటలు వేసుకుని కూర్చుంటున్నారు. అయితే, సహజమైన చెక్కతో చేసిన  పీటలు వేసుకుని కూర్చుంటే మంచిది. ఆ పీటలకు ఇనుప మేకులు లేకుండా ఉంటే మంచిదికావచ్చు. పాతకాలంలో కొందరు ఇనుప మేకులు కాకుండా చెక్క చీలలు వేసి  పీటలను తయారుచేసేవారు.

విషయపరిజ్ఞానం తెలుసుకుంటే మంచిదేకానీ, ఇలా ఆలోచిస్తుంటే ఆలోచనలకు జీవితకాలం సరిపోదు. విజయపరిజ్ఞానం అనంతమైనది. మనకు తెలియని రహస్యాలెన్నో ఉన్నాయి. అందువల్ల, మనకు చేతనైనంతలో పాటించటానికి ప్రయత్నిస్తూ దైవాన్ని నమ్మి చక్కగా జీవించాలి.

   అంతా దైవం దయ. 

****

మరికొన్ని విషయాలను నేను కామెంట్స్ వద్ద వ్రాసానండి. పోస్ట్ ఇప్పటికే పెద్దగా అయ్యింది కాబట్టి, మరిన్ని విషయాలను ఒకేచోట వ్రాస్తే గజిబిజిగా ఉంటుందేమోననే అభిప్రాయంతో కామెంట్స్ వద్ద వ్రాసాను. దయచేసి చదవగలరు.

 

10 comments:

  1. ఈ మధ్య చంటి పిల్లల ఆహారం గురించి చాలామంది చాలా విధాలుగా చెబుతున్నారు. కొన్ని విషయాలు చాలా వ్యతిరేకంగా కూడా ఉంటున్నాయి. అవన్నీ చూస్తుంటే అయోమయం అనిపిస్తుంది.

    పాతకాలంలో ఉగ్గు తయారుచేసి చిన్న పిల్లలకు పెట్టేవారు. క్రమంగా మనం ఏది తింటే ఆ ఆహారాన్ని మెత్తగా మెదిపి ఇచ్చేవారు. ఇప్పుడు పిల్లల ఆహారంలో కూడా కొత్త పోకడలు వస్తున్నట్లున్నాయి.

    నెలల వయస్సున్న పిల్లల జీర్ణ వ్యవస్థ సున్నితంగా ఉంటుంది. పాలు త్రాగే పసిపిల్లలకు.. అన్నప్రాసన జరిగిన వెంటనే బలమైన ఆహారాలు పెట్టేయాలని కొందరు పెద్దవాళ్ళు తాపత్రయపడుతున్నట్లు అనిపిస్తోంది.

    విదేశాల వాళ్ళు రకరకాల పండ్ల ప్యూరీలు పెడుతుంటారు. అందులో పుల్లటి పండ్లు కూడా ఉంటాయి. ఏ ప్రాంతం వారైనా కూడా చంటిపిల్లలకు పుల్లటి పండ్లను పెట్టకపోవటం మంచిది.

    మామిడి, అరటిపండు, పుచ్చకాయ, తర్బూజా..వంటి తియ్యటి పండ్లను తగు మోతాదులో ఇవ్వవచ్చు. నారింజ, టమేటో, ఆల్ బుఖారా, పుల్లటి ద్రాక్ష..వంటివి ఇవ్వకపోవటం మంచిది.ప్యూరీల పేరుతో పుల్లటి పండ్లను ఇస్తూ ఉంటే ప్రేగులు దెబ్బతినే అవకాశం ఉంది.

    పిల్లలకు కూరగాయలను మెత్తగా చేసి తగుమోతాదులో ఇవ్వవచ్చు. అలాగని పుల్లటి టమేటో వంటివి పసిపిల్లలకు ఇవ్వకూడదు.

    కొందరు వైద్యులు కూడా పసిపిల్లలకు పుల్లటి పండ్లను తినిపించమనటం ఆశ్చర్యంగా ఉంది.

    ఇప్పటివాళ్లు ప్యూరీలు అంటూ దుంపలను కూడా ఎక్కువగా ఇస్తున్నారు. దుంపలు మరీ ఎక్కువగా తింటే పెద్దవారికి కూడా అరగవంటారు. అలాంటిది ప్యూరీలఅంటూ రోజూ ఒక అర్ధ భాగం బీట్రూట్ చొప్పున తినిపిస్తే పసిపిల్లలకు అరుగుతుందా?

    అప్పుడప్పుడే పాల నుంచి ఘనపదార్ధాలకు అలవాటు పడుతున్న చిన్ని పొట్టలకు ఇచ్చే ఆహారం తేలికగా ఉండాలి. క్రమంగా పెంచుతూ పోవాలి. అంతేకానీ, అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నట్లు ఉండకూడదు.

    పసిపిల్లలు తమ బాధలను చెప్పుకోలేరు. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి.

    నాకు తెలిసినంతలో వ్రాసాను. ఇది పసిపిల్లల విషయం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
    మరిన్ని వివరాల కొరకు సరైన వైద్యులను మరియు పిల్లల పెంపకం గురించి బాగా తెలిసిన పెద్దవారిని సంప్రదించి వారి సలహాలను పాటించాలి.

    మిరపకాయలు వంటివి తరిగి ఆ చేతులతో చంటిపిల్లలకు స్నానం చేయిస్తే పిల్లలకు కండ్లు, శరీరం మంటపుడుతుంది. అందువల్ల మిరపకాయలు తరగాలంటే చేతులకు గ్లవ్స్ వేసుకుని తరగాలి. చేతులు బాగా కడుక్కోవాలి.

    ReplyDelete
    Replies
    1. నెలల పిల్లలకు ఆహారాన్ని సరిగ్గా ఇవ్వాలి. వారు తమ ఆకలిని చెప్పుకోలేరు. పెద్దవారే గ్రహించి తినిపించాలి.

      కొందరు పిల్లలకు ఆకలి ఎక్కువగా ఉంటుంది. చక్కగా తినే పిల్లలకు ఆహారం ఇవ్వకుండా కడుపు మాడ్చకూడదు.
      కొందరు పిల్లలు కడుపు నిండినప్పుడు ఊసేస్తుంటారు. అలాంటప్పుడు అతిగా కుక్కకూడదు.

      కొందరు పెద్దవాళ్ళు తమ ఇంట్లో వండుకున్న ఆహారాన్నే మెత్తగా మెదిపి, ఉప్పు, కారం కలపకముందే కొంత విడిగాతీసి పిల్లలకు పెడుతుంటారు.కొందరేమో పిల్లలకు విడిగా ధాన్యాన్ని, పప్పులను, కూరగాయలను ఉడికించి మెత్తగా చేసి పెడుతుంటారు. ఎలాగైనా పెట్టవచ్చు.
      అయితే, ఉదయం, మధ్యాహ్నం,సాయంకాలం కూడా కడుపు నిండేటట్లు ఆహారాన్ని తినిపించాలి.
      సాయంత్రం కూడా అన్నాన్ని, కూరలను వండి పెట్టవచ్చు. కుదరని వాళ్ళు ఇడ్లీగాని, దోశ గాని తినిపించవచ్చు. ఇడ్లీ, దోసె పొడిగా కాకుండా పప్పుచారు పైన తేటతో కానీ, కూరగాయలను ఉడికించి ,మెత్తగా మెదిపిన గుజ్జుతో కూడా కలిపి తినిపించవచ్చు.

      చంటిపిల్లల విషయంలో ఆహారంలో ఉప్పు వేసే విషయంలో వైద్యుల సలహా ప్రకారం వాడుకుంటే మంచిది.

      Delete
    2. చంటిపిల్లలకు ఇడ్లీని అలాగే తినిపిస్తే పొడిగా ఉండి పిల్లలు సరిగ్గా మ్రింగలేకపోవచ్చు.పప్పుపైన పల్చటి రసం, కూరగాయల ప్యూరి..వంటివి కలిపి తినిపిస్తే బాగుంటుంది.
      ఇలాంటివి లేనప్పుడు, ఇడ్లీపైన తడిపొడిగా ఉండేటట్లు చాలా కొద్దిగా నీరు పోస్తే ఇడ్లీ తినడానికి పొడిగా లేకుండా ఉంటుంది.
      .....
      బియ్యం, కొన్ని పప్పులు కడిగి ఆరపోసి, వేయించి మెత్తగా పొడి చేస్తారు. దానిని మెత్తగా ఉడికించి పిల్లలకు తినిపిస్తారు.

      ఇంకా, నీటిలో కొన్ని కూరగాయల ముక్కలను వేసి ఉడికించి, బియ్యం మరియు పప్పులపొడిలో కూరగాయలు ఉడికించగా వచ్చిన నీటిని పోసి ఉడికించి, ఇంకోసారి పిల్లలకు పెట్టవచ్చు. పిల్లలు కొంచెం పెరిగిన తరువాత ఉడికించిన కూరగాయల ముక్కల్ని కూడా మెత్తగా మెదిపి అన్నంతో కలిపి తినిపించవచ్చు.

      Delete
    3. ఇంకో పద్ధతి ఏమిటంటే.. కూరగాయలముక్కలను తీసుకుని ఉదా.. చిన్న సొరకాయ ముక్కను తీసుకుని సన్నటి ముక్కలుగా చేసి, కొద్దిగా నీరుపోసి మిక్సీలో తిప్పితే పల్చగా అవుతుంది.

      ఆ రసాన్ని సన్నగా పట్టిన బియ్యపురవ్వలో లేక పిల్లల కొరకు ఇంట్లో తయారుచేసిన మల్టి గ్రెయిన పిండిలో వేసి 10 నిమిషాలు మెత్తగా ఉడికించి పిల్లలకు పెట్టవచ్చు.

      ఇంకో పద్ధతి ఏమిటంటే.. కుక్కర్ గిన్నెలో కొద్దిగా బియ్యం, పప్పు, కొన్ని కూరగాయల ముక్కలు వేసి, నీరు పోసి సుమారు 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దింపి, మాషర్ తో మెత్తగా మెదిపి పిల్లలకు పెట్టొచ్చు.

      Delete

  2. పిడుగులు పడే సందర్భాలలో ఎత్తైన స్థంభాలు, చెట్ల క్రింద నిలబడకూడదని, వీలైతే క్రింద కూర్చుని చెవులు మూసుకోవాలని కొందరు అంటారు. ఇలా పొజిషన్ చెప్పటం వెనుక ఎన్నో వైజ్ఞానిక విషయాలు ఉంటాయి.

    కరెంట్ కు సంబంధించి ఎర్తింగ్ చేసేటప్పుడు కొందరు భూమిలో ఉప్పుజల్లుతారు. ఉప్పులో ఎలెక్ట్రోన్స్ ప్రవాహం ఎక్కువగా ఉంటుందని ఒకచోట చదివాను.

    దిష్టి తగిలితే సముద్రపు ఉప్పుతో దిష్టి తీస్తారు. సముద్రపు ఉప్పు నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుందని నమ్ముతారు.

    నాకు ఏమనిపిస్తుందంటే, మనకు భూమికన్నా ఎక్కువభాగం సముద్రాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఉప్పుసముద్రాల వల్ల భూమిపైన నెగటివ్ ఎనెర్జీ తగ్గుతుందేమోనని అనిపిస్తుంది.

    ReplyDelete
  3. పెద్దపెద్ద పూజలు చేసేటప్పుడు ఎంతో పద్ధతిగా చేయాలంటారు. దైవనామస్మరణ అయితే ఎవ్వరైనా ఎప్పుడైనా స్మరించుకోవచ్చు.

    నాకు తెలిసినంతంలో వ్రాసాను. వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete
  4. B విటమిన్ల కొరకు తవుడు తింటే మంచిదని చాలామంది వాడుతున్నారు. రసాయనాలు జల్లని పాతకాలంలో అయితే తవుడు తినటం వల్ల అనేక విటమిన్లు చక్కగా లభించేవి.
    ఈ రోజుల్లో పంటలపై రసాయన పురుగుమందులు జల్లటం వల్ల వరికంకులపైన కూడా మందు పడుతుంది. మరి, తవుడు పైన ఆ మందులు ఉండే అవకాశం బాగా ఉంది. అలాంటి తవుడును తినటం వల్ల ఎంతవరకు మంచి జరుగుతుందో?
    ఆరోగ్యంగా ఉండాలంటే,రసాయనమందులు జల్లని పంటలను వాడాలి.

    బాగా పాలిష్ పట్టిన బియ్యాన్ని తినటం మంచిదికాదని కొందరు ముడిబియ్యాన్ని వాడుతున్నారు. అయితే ముడిబియ్యపు అన్నాన్ని తినలేక మానేస్తుంటారు. అలాంటప్పుడు ముడిబియ్యం ఒక కప్పు, పాలిష్ చేసిన బియ్యం ఒక కప్పు వేసి కలిపి అన్నం వండుకోవచ్చు.

    ReplyDelete
  5. పూజచేసేటప్పుడు కూర్చునే పీటలకు ఇనుపమేకులు కాకుండా ఇత్తడితో కూడా మేకులు తయారు చేసి బిగించవచ్చేమో? అనిపించింది.
    ఈ మధ్యన ఒక పండితులవారు ఏమన్నారంటే, స్త్రీలు తలపైన ఇనుముతో తయారుచేసిన క్లిప్స్ , పిన్నులు కాకుండా క్లాత్ తో చేసినవి ధరిస్తే మంచిదన్నారు.
    నాకు ఏమనిపించిందంటే, స్త్రీలు తలపైన ధరించటానికి ఇనుప పిన్నులు, క్లిప్స్ కాకుండా క్లాత్ తో చేసినవి, ఇంకా ఇత్తడితో కూడా క్లిప్స్, పిన్నులు తయారుచేస్తే బాగుంటుందేమో అని అనిపించింది.

    ReplyDelete
  6. ఏ పని చేసినా ప్రకృతి తో మమేకమయి చేస్తేనే మంచిగా ఉంటుంది. చక్కటి పోస్ట్.

    ReplyDelete
  7. సర్, మీకు ధన్యవాదములండి. మీ వ్యాఖ్యను కొద్దికాలం క్రితమే చూసానండి.

    ReplyDelete