కొందరు దేవుని చిత్రాలను గిఫ్టులుగా ఇస్తుంటారు. వాటిని శుభ్రం చేయకపోతే వాటిపైన దుమ్ము చేరుతుంది.
మరి కొందరు ఇంట్లోని దేవుని పటాలు దేవాలయాలలో ఒకమూల పెట్టేసి వస్తుంటారు. వాటిని ఏం చేయాలని ? దేవాలయాల నిర్వాహకులు సతమతమవుతారు .
ప్రజలు బోలెడు పటాలను కొనకుండా తగుమాత్రం పటాలను కొనుక్కుంటే సరిపోతుంది.
మరి కొందరు భక్తులు, దేవాలయాల వద్ద దేవుని చిత్రాలను, పుస్తకాలను ఉచితంగా పంచిపెడుతుంటారు.
అవన్నీ తీసుకుంటే ఇంట్లో పుస్తకాలు, పటాలు బోలెడు అయి అల్మారా నిండిపోతుంది. తీసుకోకుంటే దేవునికి కోపం వస్తుందేమోనని భయపడతారు కొందరు.
కొన్నిసార్లు సామూహిక వ్రతాలు నిర్వహించినప్పుడు నిర్వాహకులు భక్తులకు దేవునిపటాలను ఉచితంగా ఇస్తారు.
అయితే అప్పటికే ఇంట్లో అలాంటి పటం ఉన్నా కూడా, మళ్లీ ఇంకోటి తీసుకెళ్తే పటాలు ఎక్కువవుతాయి.
********************
ఈ మధ్య ఎక్కడపడితే అక్కడ దేవుని చిత్రాలను ముద్రిస్తున్నారు.
ఉదా..స్వీటుబాక్సులపైన, విజిటింగ్ కార్డులపైన ఒకటనేమిటి చిన్నచిన్న హారతి పాకెట్లపైన ముద్రించటం వల్ల వాటిని ఎక్కడ పడవేయాలో అర్ధంకావట్లేదు.
స్వీట్ ప్యాకెట్ అయిపోయిన తరువాత బయట చెత్తబుట్టలో పడేద్దామంటే పాకెట్ పైన దేవుని చిత్రం ఉంటుంది.
దైవచిత్రాలను బయటపడేయాలంటే సంశయంగా ఉంటుంది.
అయితే, ఏం చేయలేం కాబట్టి, దైవచిత్రాలను బయటపడేసినందువల్ల పాపం వస్తే, ఆ పాపం ఆ చిత్రాలను ఎక్కడపడితే అక్కడ ముద్రించిన వాళ్ళకే రావాలి, అనుకుని బయట వేస్తాను.
దేవాలయాలలో కూడా టికెట్లు ముద్రించేటప్పుడు దైవచిత్రాన్ని ముద్రిస్తారు.
ఉదా..విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తే భక్తుల ఫోటో కోసం ఇచ్చే కార్డు పైన అమ్మవారి చిత్రం ఉంటోంది.
చాలామంది వాటిని అక్కడే పడేయటం వల్ల నేలపైన అమ్మవారి చిత్రం ఉన్న కార్డులు పడేసి ఉంటాయి.
ఇక తెలుగు న్యూస్ పేపర్లలో బోలెడు దైవచిత్రాలను వేస్తారు.
ఇంగ్లీష్ పేపర్లలో దైవ చిత్రాలు వేయరు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువగా ఉంటాయనుకుంటా..
యంత్రాలు వచ్చిన తరువాత దైవ చిత్రాలను శ్రమలేకుండా అదేపనిగా ముద్రించి పడేస్తున్నారు, వీధుల్లో కాళ్ల క్రింద వాటిని తొక్కుతూ వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది.
చెత్తబుట్టల్లో, పెంటకుప్పల్లో దైవచిత్రాలు పడిఉన్నప్పుడు చూస్తే.. ఇది మహాపాపం అనిపిస్తుంది,
ఇలాంటి చర్యల వల్ల పుణ్యం సంగతి అలాఉంచి పాపం వచ్చే అవకాశం ఉంటుంది కదా!
భారతదేశం అనేక కష్టాలు పడటంలో ఇలాంటి చర్యలూ కారణమే కావచ్చుననిపిస్తుంది.
దైవానికి నచ్చేవిధంగా ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి .
అంతేకానీ, విపరీతంగా దైవచిత్రాలను ముద్రించి పడేయటం వల్ల దైవానుగ్రహం కలుగుతుందని అనిపించటం లేదు.

No comments:
Post a Comment