koodali

Friday, June 9, 2017

పిల్లల జీవితాల్లో టెన్షన్ ....ఈ రోజుల్లో .. కొందరు స్త్రీలు పురుషులు..


 
 ఈ రోజుల్లో చాలామంది పిల్లల జీవితాల్లో టెన్షన్  బాగా పెరిగింది.

 డబ్బు ఉన్న వారి పిల్లలు కూడా చదువులు, ఉద్యోగాల వల్ల బయట ఉండటం వల్ల సరైన పౌష్టికాహారాన్ని తినటం లేదు.

ఇంట్లో అయితే పెద్దవాళ్ళు బ్రతిమాలో, కోప్పడో పౌష్టికహారాన్ని తినేలా చేస్తారు.

( అయితే, ఈ రోజుల్లో పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా,  కొందరు పెద్దవాళ్ళు బిజీగా ఉండటం వల్ల గబగబా ఏదో ఒకటి వండేసి  పెట్టేస్తున్నారు. పిల్లలు  సరిగ్గా తింటున్నారో లేదో పట్టించుకునే సమయం  పెద్దవాళ్ళకు లేదు.)
..............


  ఒక సంఘటన గురించి రాస్తాను.
మాకు తెలిసిన వారి పిల్లవాడు  హాస్టల్లో ఉండి చదువుకునే వాడు.

 ఆ అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు జ్వరం వస్తే హాస్పిటల్లో చూపించారట. టెస్ట్  చేస్తే  కాన్సర్ జబ్బు చివరి స్టేజ్ లో ఉందని తెలిసిందట. కొద్దిరోజులు వైద్యం చేసినా అబ్బాయి దక్కలేదు.

ఈ విషయం విన్నాక బాధ మరియు ఆశ్చర్యం అనిపించింది. కాన్సర్ ముదిరే వరకూ ఏమీ లక్షణాలు తెలియకపోవటమేమిటి? అనిపించింది.

 నాకు ఏమనిపించిందంటే, ఆ పిల్లవాడికి అంతకు ముందు కూడా (హాస్టల్లో ఉన్నప్పుడు) అప్పుడప్పుడు జ్వరం వచ్చేదేమో? 

జ్వరం ఎందుకు వస్తుందో? అనారోగ్యం వస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ..వంటి విషయాల గురించి  పిల్లలకు ఏం తెలుస్తుంది ?

ఏదో ఒక జ్వరం టాబ్లెట్ వేసుకుని గడిపేసి ఉంటాడు. క్రమంగా ఆరోగ్యం  క్షీణించి ఉంటుంది.
..................

 ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు చదువుల ఒత్తిడితోనూ, పెద్దవాళ్ళకు  పని వత్తిడితోనూ జీవితాలు గడిచిపోతున్నాయి.

ప్రపంచంలో బాగా పెరిగిన కాలుష్యం, రేడియేషన్ వల్ల కూడా అనారోగ్యాలు ఎక్కువవుతున్నాయి.

చదువు, కెరీర్, డబ్బు సంపాదనలో మునిగి జీవితాల్నే కోల్పోతున్నవారి సంఖ్య బాగా పెరిగింది. 

 ఇవన్నీ గమనిస్తే , జీవితాలు బాగుపడాలంటే తాపత్రయాలు తగ్గించుకోవాలని  అనిపిస్తోంది.
..............................
marikonni vishayalu..
 
ఈ రోజుల్లో సమాజంలో క్రూరమైన నేరాలు..ఘోరాలు జరగటం గురించి వింటున్నాము.

  చిన్నతనం నుంచి పిల్లల్ని నైతిక విలువలతో పెంచితే, అలాంటి ప్రజలున్న సమాజంలో నేరాలు..ఘోరాలు తక్కువగా ఉంటాయి.

  చాలామంది పిల్లలు తల్లి మాటలు వింటారు. తల్లి తొలి గురువు అంటారు. తల్లి ఓర్పుగా, నేర్పుగా పిల్లలకు మంచి విషయాలు బోధిస్తూ, వాళ్ళను శారీరికంగా, మానసికంగా సమాజానికి మంచిపౌరులుగా తయారుచేయాలి.
.....................

  సృష్టిలో జీవులకు వాటి జీవనవిధానం ఉంది. మొక్కలు, చెట్లు జీవులకు ఆహారాన్ని అందిస్తాయి. మనుషులు కాయలు, పండ్లను తెంపినా, కొమ్మలు విరిచినా, మా పండ్లను, కాయలను మనుషులు తెంపటం అన్యాయం..అని అవి అనలేవు కదా..

(మొక్కలను మన ఇష్టం వచ్చినట్లు తుంపి పడెయ్యకూడదు. మన రుచి కొరకు అదేపనిగా ఆహారాన్ని తినకూడదు. అదేపనిగా తింటే జబ్బులొస్తాయి. అవసరమైనంత వరకు తింటే, మొక్కలకు, మనుషులకు కూడా మంచిది.)

స్త్రీలు సృష్టిలో గర్భాన్నిధరించటం, పిల్లలకు పాలిచ్చిపెంచటం విధానం ఉంది. మేమెందుకు పిల్లల్ని కని పెంచాలని అంటే ఏం చెప్పాలి..అయితే, మొక్కలను కూడా తెంపి తినకూడదు.   మొక్కలకూ హక్కులు ఉంటాయి కదా..

ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు తమ సహజ స్వభావానికి దూరంగా జీవిస్తున్నారు. ఇంటిపనులు చక్కదిద్దుకోవటం, వంట చేయటం, పిల్లల్ని సరిగ్గా పెంచుకోవటం..ఇలా చేయలేరు కాని, సమాజాన్ని ఉద్ధరిస్తామంటారు.

బయట ఆఫీసుల్లో ఎంత పని చెప్పినా చేస్తారు కాని, ఇంటిపని అంటే మేమే ఎందుకు చేయాలని వాదిస్తారు.

.................

ఉమ్మడి కుటుంబాలు ఉండి స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు, స్త్రీ ఇంట్లో ఎంత పని చేసినా ఆమె కష్టాన్ని గుర్తించి మెచ్చుకోవటం తక్కువగా ఉండేది. ఆ కష్టానికి డబ్బు కూడా రాదు.ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తే కొందరు మెచ్చుకుంటారు, డబ్బు వస్తుంది, బయటకెళ్లి ప్రపంచాన్ని చూడవచ్చు.

అయితే, ప్రతిదానిలోను కష్టం, సుఖం ఉంది. బయటకెళ్లి జీతం తీసుకున్నప్పుడు ఓపిక ఉన్నా, లేకున్నా  పనిచేయవలసి ఉంటుంది. అవసరమైనప్పుడు సెలవలు కూడా ఇవ్వరు.టార్గెట్లు పెట్టి, పనిచేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామంటారు.

బయటకెళ్లినప్పుడు స్త్రీలకు లైంగిక వేధింపులు ఉండే పరిస్థితి కూడా కొన్నిచోట్ల ఉంటుంది.. ఇక, సరిగ్గా ఆహారం వండుకు తినటానికి సమయం లేకపోవటం, చంటిపిల్లలను సరిగ్గా చూసుకోలేక పోవటం గురించి చెప్పుకున్నాము.

ఈ టెన్షన్లతో ఈ రోజుల్లో చాలామందికి అనారోగ్య సమస్యలు పెరిగాయి. కుటుంబాల్లో గొడవలు పెరిగాయి. మానసిక సమస్యలూ పెరిగాయి. డబ్బు ఉన్నా మనశ్సాంతి లేనివాళ్లు ఎందరో ఉన్నారు.

కొన్ని కంపెనీల యాజమాన్యాలు, మగవాళ్లకన్నా  స్త్రీలైతే ఎదురుచెప్పకుండా ఎంత పనైనా చేస్తారని స్త్రీలను ప్రోత్సహిస్తున్నారేమో?

................

ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్చలేదని చిన్న కుటుంబాలు ఏర్పడ్దాయి. ఇలా సంతోషంగా ఉండవచ్చు కదా.. సంతోషంగా ఉన్నారా? అని అడిగితే, చాలామంది లేరనే చెబుతారు.

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, చాలామందికి స్వేచ్చ ఎక్కువయ్యి ,  స్త్రీలుపురుషులు వివాహం కానివాళ్ళకు, వివాహం అయినవాళ్ళకు కూడా అక్రమసంబంధాలు ఎక్కువయ్యాయి.

ఇంకా కొత్తగా యువత తాము వివాహం చేసుకోమని, సహజీవనం అని ఉంటామంటున్నారు. సహజీవనం అంటే ఇష్టమైతే కలసిఉండటం, ఇష్టం పోతే విడిపోవటం అని కావచ్చు. మరి వీళ్లకు జన్మించిన పిల్లల పరిస్థితి ఏమిటి?

................

ఇంటిపనులు, పిల్లల పనులు పార్ట్ టైం చేసే విషయాలు కావు. చాలా పనులు ఉంటాయి.

 పాతకాలంలో , మగవాళ్ళు సంపాదన కొరకు బయటకెల్తే, స్త్రీలు ఇంటి నిర్వహణ చూసుకునేవారు. ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకునేవారు. కొందరు తమకు నచ్చినట్లు కుట్లు, అల్లికలు, తోటపని..వంటివి చేసేవారు. కొందరు భర్తకు సాయంగా వృత్తివిద్యలలో సాయం చేసేవారు.

 పాతకాలంలో చాలామంది మగవాళ్ళు ఇంటివద్దే తమకు వచ్చిన చేతివృత్తులను చేసి జీవనోపాధి పొందేవారు. దుస్తులు తయారీ, సమాజానికి అవసరమైన వస్తువుల తయారి..ఇలా జీవించేవారు. చదువు, ఉద్యోగాలంటూ ఇతరులపై ఆధారపడి ఎదురుచూడటం ఉండేది కాదు.

అలాగని టెక్నాలజి అవసరం లేదని కాదు. టెక్నాలజి వల్ల పర్యావరణానికి హాని జరగనంతలో, నిరుద్యోగం పెరగనంతలో  టెక్నాలజి ఉపయోగించాలి.

****************

మనుషులు చక్కగా జీవించటానికి అవసరమైన ధనం సంపాదించటం, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటం కొరకు ఆలోచిస్తారు.

మగవాళ్లు బైటకెళ్ళి కుటుంబానికి అవసరమైన సొమ్ము సంపాదించి తెస్తే, స్త్రీలు.. కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉండటానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, అందరి ఆరోగ్యం కొరకు చక్కటి ఆహారాన్ని తయారుచేసి పెట్టటం, పిల్లల్ని శారీరికంగా, మానసికంగా చక్కగా ఉండేలా మంచిగా పెంచటం..ఇలా పని విభజన ఉండేది.

 డబ్బు ఉంటే సరిపోదు. ఈ రోజుల్లో డబ్బు ఉన్నా కూడా, వంటరాక, సరిగ్గా వండుకునే సమయం లేక, బయట తినటం, ఇంట్లో వంటవాళ్లు సరిగ్గా వండకపోవటం, పిల్లలను దగ్గరుండి చూసుకోలేకపోవటం..వంటి ఎన్నో సమస్యలున్నాయి.

 ఈ రోజుల్లో... 
చాలామంది  స్త్రీలు మగవారిలా పనిచేయటం వల్ల చాలామందికి P.C.O.D. సమస్యలు, గడ్డాలు, మీసాలు వస్తున్నాయి. మనశ్శాంతి లేకపోవటం, అనారోగ్యం రావటం, కుటుంబసభ్యులు ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోలేకపోవటం..వంటి సమస్యలు ఉంటే ఎంత డబ్బున్నా ఏం లాభం?

 చిన్నతనం క్రచ్లలో, పెద్దయ్యాక చదువుల టెన్షన్, ఉద్యోగంలో టెన్షన్, పెద్దవయస్సులో వృద్ధాశ్రమాలలో, అనారోగ్యానికి డబ్బు ఖర్చుపెట్టడం, బాధలూ..ఇలా చాలామంది జీవితాలు వెళ్లిపోతున్నాయి. చివరికి మిగిలేది ఏమిటి?

.............

స్త్రీలు కుటుంబబాధ్యతలను చేసుకుని, తీరిక సమయం ఉంటే మధ్యాహ్నం కొంతసేపు, కొందరు స్త్రీలు కలసి సమాజానికి కొంత సేవ చేయవచ్చు. కొందరు స్త్రీలు కలసి చిన్నతరహా పరిశ్రమలా ఉపాధి ఏర్పాటు చేసుకోవచ్చు.

తమకు కుదిరిన సమయాన్ని ఏర్పాటుచేసుకుని ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు పనిచేసుకోవచ్చు. తమ చంటి పిల్లలను తమ వద్దే ఉంచుకోవచ్చు. కొంతైనా టెన్షన్ లేకుండా జీవించవచ్చు.




No comments:

Post a Comment