గత పోస్ట్ లో నేను ..వైకుంఠ ఏకాదశి ఈ డిసెంబర్ లో అన్నట్లు వ్రాసాను.
అయితే వైకుంఠ ఏకాదశి 2017 జనవరి లో వచ్చిందంటున్నారు.
పొరపాటుకు దయచేసి క్షమించండి.
**************
ఇంకొక విషయం ఏమిటంటే, శని దేవుని జయంతి గురించి నాకు సరిగ్గా తెలియదు.
శనిదేవుని జయంతి గురించి గత పోస్టులో ...
.గ్రహశ్రేష్టులు శ్రీ శనేశ్వర దేవత వికారి నామ సంవత్సరము మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రమున జన్మించినట్లు శాస్త్రగ్రంధాలు పేర్కొన్నాయి. కాశ్యపగోత్రోద్భవుడు అయిన 'శనిదేవుని జయంతి' శింగణాపూర్ లో ప్రతిసంవత్సరము వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు అతి వైభవముగా జరుపబడుతుంది...ఈ విషయాలను నేను ఒక దగ్గర చదివాను.
( ఈ నెల 22 న అంటే రేపు మార్గశిర బహుళ నవమి .)..అని వ్రాయటం జరిగింది.
ఈ విషయాలను మా దగ్గర ఉన్న ఒక పుస్తకంలో చదివాను.
*************
అయితే కొన్ని ప్రాంతాల వారు, శనిదేవుని జయంతి ....వైశాఖ అమావాస్య నాడు చేస్తారట..... మరికొందరు జ్యేష్ఠమాస అమావాస్య నాడు కూడా చేస్తారన్నట్లు అంతర్జాలంలో చదివాను.
బహుశా సౌరమాన పద్ధతి మరియు చాంద్రమాన పద్ధతుల వల్ల ఈ విధంగా జరుగుతున్నదేమో ?
(నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు.)
*************
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
No comments:
Post a Comment