koodali

Wednesday, December 14, 2016

డిజిటల్ ఎకానమి..?




విదేశాలతో పోల్చి , ఇక్కడ కూడా ఇప్పటికిప్పుడు  నగదురహితం అవ్వాలనటం సరైనదికాదు. 

  పోస్టాఫీస్ కెళ్తే , మెషీన్లు పనిచేయటం లేదు ..ఎప్పటికి బాగవుతుందో చెప్పలేం..అనే పరిస్థితి విదేశాలలో ఉండకపోవచ్చు.

అయినా, అంత అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఉన్న విదేశాలలో కూడా సైబర్ నేరాలు..వంటివి జరుగుతున్నాయంటున్నారు.

విదేశాల్లో కూడా నూరుశాతం నగదురహిత లావాదేవీలు లేవంటున్నారు.

అలాంటప్పుడు, అభివృద్ధి ..అంతగాలేని భారతదేశంలో నగదురహిత లావాదేవీలు చేయాలనటం భావ్యంకాదు.

ఎంతో కొంత తెలిసినవాళ్ళు నగదురహిత లావాదేవీలు అలవాటు చేస్కుంటున్నారు కానీ ... చదువుకున్నా టెక్నాలజీ గురించి అంతగా తెలియనివాళ్ళు ఎందరొ ఉన్నారు.

ఇంకా, అడవులలో గిరిజనులు, ఎందరో నిరక్షరాస్యులు, స్లంస్లో నివసించే ప్రజలు ..ఇలా ఎందరో ప్రజలు టెక్నాలజీ గురించి తెలియని వారు కోట్ల  సంఖ్యలో ఉన్నారు.

ఇప్పటివరకూ వీళ్ళందరూ తమకు ఉన్నంతలో నగదు వాడుకుంటూ బ్రతుకుతున్నారు.

ఇప్పటికిప్పుడు అందరూ నగదురహిత వ్యవస్థకు మారాలంటే ఇతరులపై ఆధారపడాలి.తద్వారా మోసపోయే అవకాశమూ ఉంది.

స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ఏళ్ళయినా దేశాన్ని అభివృద్ధి చేయకుండా ..

ఇప్పుడు ఉన్నఫలాన అందరూ నగదురహిత లావాదేవీలు చేయాలంటూ ఫోర్స్  చేయటం సరైనది కాదు.

ఇదెలా ఉందంటే ..

పిల్లలకు సరిగ్గా పాఠాలు చెప్పకుండా, సరైన సౌకర్యాలు కల్పించకుండా, చిన్న తరగతి పిల్లలను పట్టుకుని ఉన్నఫళాన మీరందరూ పీజీ పరీక్షలు రాయాలని అంటే ఎంత అయోమయంగా ఉంటుందో అలా ఉంది పరిస్థితి.

ఇదంతా చూస్తుంటే, అంతగా చదువుకోని వాళ్ళు, టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు దేశంలో సరిగ్గా బ్రతికే అవకాశం లేదన్నట్లుంది.

చదువురానివాళ్ళు కూడా సెల్ఫోన్లు వాడుతున్నారు కదా! అంటున్నారు కొందరు.
మామూలుగా మాట్లాడుకోవటానికి సెల్ వాడటం తేలికే కాబట్టి చాలామంది సెల్ వాడుతున్నారు.

అంతకుమించి సెల్ వాడకం గురించి తెలియనివాళ్ళెందరో ఉన్నారు.

నగదురహిత లావాదేవీలలో మోసపోకుండా ఉండాలంటే తరచూ పిన్ నంబర్ మార్చటం..వంటివి చేయాలంటున్నారు.

టెక్నాలజీ తెలిసినవారికి ఇవన్నీ తేలికగానే అనిపించవచ్చు. తెలియనివారికి పిన్ మార్చటం, యాప్ డౌన్లోడ్ చేయటం వంటివి కష్టంగానే ఉంటాయి.

టెక్నాలజీ గురించి తెలియని ప్రజలు కోట్లలో ఉన్న మన దేశంలో ఇప్పటికిప్పుడు అందరూ నగదురహిత లావాదేవీలే చేయాలనటం సరైనదికాదు అనిపిస్తుంది.


1 comment:

  1. డిజిటల్ ఎకానమి
    ఇప్పటికి చాలా రోజుల నుంచి చాలామంది ప్రజలు డబ్బుకోసం క్యూలలో కొనసాగుతున్నారు. పెద్దనోట్ల రద్దు సిక్రెట్ గా జరిగినా, పెద్దనోట్ల రద్దు తరువాత వారం రోజులకే కొత్త 2000నోట్లు విడుదల చేసారంటే వాటిని ముందే ముద్రించి ఉంటారుకదా!

    2000నోట్లు బదులు, చిన్ననోట్లు మరియు కొత్త 500నోట్లు ముందే ముద్రించి , విరివిగా అందుబాటులోకి వచ్చి ఉన్నట్లయితే నోట్లను దాచేసుకునే పరిస్థితీ వచ్చేది కాదు. ప్రజలకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు.

    జరిగింది పొరపాటా? లేక దేశంలో అందరూ డిజిటల్ ఎకానమికి మారాలని ఇలా చేస్తున్నారో ? వాళ్ళకే తెలియాలి.

    అందరూ నగదురహిత లావాదేవీలే చేయాలి..మేము నోట్లను ఎక్కువగా వదలం ..అన్నది వాళ్ళ ఉద్దేశ్యమయితే మాత్రం అది సరైనది కాదనిపిస్తుంది.

    ReplyDelete