koodali

Saturday, December 27, 2014

పురాణేతిహాసాలలో అతిశయోక్తులు ..

 
పురాణేతిహాసాలలో  ఎన్నో  అతిశయోక్తులున్నాయని కొందరు ఎగతాళి  చేస్తుంటారు.  అలా అనుకోవటం  సరైనది  కాదు.

పురాణేతిహాసాలలో  భారీ  ఆకారాల  జీవుల  గురించి  తెలియజేసారు. దేవతలు .. పక్షులను,  జంతువులను తమ వాహనాలుగా  చేసుకోవటం  కూడా  చెప్పబడింది.

అంత  పెద్ద  పక్షులు  ఎక్కడయినా  ఉంటాయా ?  అని నేటికాలంలో కొందరు విమర్శిస్తారు.

 ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పిన  దానిప్రకారం  చూసినా   ప్రాచీన  కాలంలో  డైనోసార్స్  వంటి  భారీ  జీవులు ఉండేవని  అంటున్నారు.  ఆ కాలంలో  ఏనుగులు  వంటివి  కూడా  భారీ  ఆకారాలతో  ఉండేవని అంటున్నారు.

మరి, పురాణేతిహాసాలలో  భారీ ఆకారాల  జీవుల  గురించి  చెబితే మాత్రం  అతిశయోక్తులనటం  ఏం న్యాయం ? 
......................

 పురాణేతిహాసాల ద్వారా చూస్తే, ఆ కాలంలో  కొందరు  ఎంతో  శక్తి కలవారిగా  తెలుస్తుంది. బహుశా, ప్రాచీనులలో  కొందరికి ఎక్కువ శక్తిసామర్ధ్యాలు  ఉండి ఉండవచ్చు .

ఈ కాలంలో కూడా కొందరు..  లారీలను,  విమానాలను  ఒంటి  చేత్తో  లాగేస్తున్నారు. ఇలా వాహనాలను  సునాయాసంగా లాగేవారికి  ఆ బలం  ఎలా వస్తుందో  ఆధునిక సైన్స్  చెప్పలేకపోతోంది.

 ఇవన్నీ  గమనిస్తే  మనకు  తెలిసిదేమిటంటే, ఆధునిక  విజ్ఞానానికి  అంతుపట్టని  విషయాలెన్నో  విశ్వంలో  ఉన్నాయని తెలుస్తోంది.
...................

 పురాణేతిహాసాలలో  కొందరు ఆకాశానికి  ఎగరటం, నీటిపై  తేలటం  వంటి  శక్తులు  కలిగిఉండేవారంటే..అవన్నీ  అతిశయోక్తులని  అంటారు  కొందరు..

ఈ రోజుల్లో  కూడా  కొందరు  యోగ శక్తితో  నీటిపై మునగకుండా కూర్చుంటున్నారు.

ప్రాచీన  కాలంలో  ఇప్పటికన్నా  మించిన  విజ్ఞానం  ఉండిఉండవచ్చు.  అప్పటివారికి  ఇతర  గ్రహాల  జీవులతో సంబంధాలు  ఉండి  ఉండవచ్చు. 

 ఇతర  గ్రహాలపై  జీవం  ఉన్నదనీ,  వారు  మనకన్నా  విజ్ఞానవంతులు  కావచ్చనీ  నమ్మే  వాళ్ళు  ఎందరో  ఇప్పటివాళ్ళలో  ఉన్నారు.
.............................

 భూమిమీది  విషయాల  గురించే  మనకు  సరిగ్గా  తెలియదు.  ఇక  దైవం  గురించి, విశ్వం  గురించి  మనకు  అంతా  తెలుసు..  అని  అనుకోవటం  హాస్యాస్పదం.

 విశ్వరహస్యాల  గురించి  మనకు  తెలిసింది  సముద్రంలో  నీటిబొట్టంత.  తెలియనిది  సముద్రమంత. 

 మనకు  చేతనయితే  పురాణేతిహాసాలలోని  అద్భుతవిజ్ఞానం  గురించి  తెలుసుకోవాలి . అంతేకానీ  పురాణేతిహాసాలలో  ఉన్నవన్నీ  అతిశయోక్తులే అని అనుకోవటం అజ్ఞానం.
.............................

ఏదైనా  విషయం  గురించి  చెప్పేటప్పుడు  ఎదుటివారికి  ఆసక్తిగా ఉండటానికి  కొంత  అతిశయోక్తి  జోడించి  చెబుతుంటారు  కొందరు.  పురాణేతిహాసాలలో  కొన్ని  ప్రక్షిప్తాలు  కూడా ఉన్నాయంటారు.

 ఏవి  ప్రక్షిప్తాలో  మనకు  సరిగ్గా  తెలియదు.  అందుకని  పురాణేతిహాసాలను  అపార్ధం  చేసుకోవటం  మాని  సరిగ్గా  అర్ధం చేసుకోవటానికి  ప్రయత్నించాలి.


No comments:

Post a Comment