దైవం దయ వలన మాకు శుభకరమైన సంఘటనలు జరిగాయి. కొన్ని పనుల వల్ల ఈ మధ్య కొంతకాలం బ్లాగ్ వ్రాయలేదండి.
నాకు వీలుకుదిరినప్పుడు సాయిసాయి అని స్మరించుకుంటాను .... అని ఇంతకు ముందు టపాల ద్వారా తెలియజేశాను. ఈ విషయం గురించి ఈ మధ్య మరికొన్ని ఆలోచనలు వచ్చాయి.
సాయిసాయి అని మామూలుగా స్మరించుకోవచ్చు. ఇంకా , సాయి నామాన్ని పాటలాగా కూడా పాడుకుంటూ స్మరించుకోవచ్చు అనిపించింది.
పాటలాగా స్మరించుకుంటున్నప్పుడు గబగబా శ్వాసలు తీసుకోకుండా రెండు శ్వాసల మధ్య కొంచెము దూరం పెరిగి తక్కువ శ్వాసలు తీసుకునే విధంగా కూడా నామాన్ని స్మరించుకోవచ్చు. అనిపించింది.
ఎవరైనా దైవనామాన్ని స్మరించే విషయంలో ఎలా స్మరిస్తే సులువుగా ఉంటుందో కాలక్రమేణా ఎవరికి వారికే తెలుస్తుంది.
అంతా దైవం దయ.
పాటలాగా స్మరించుకుంటున్నప్పుడు గబగబా శ్వాసలు తీసుకోకుండా రెండు శ్వాసల మధ్య కొంచెము దూరం పెరిగి తక్కువ శ్వాసలు తీసుకునే విధంగా కూడా నామాన్ని స్మరించుకోవచ్చు. అనిపించింది.
ReplyDelete---------------------------------------------------
ఇదేదో ESP లాగా ఉంది. ఏమిటి ఈ మధ్య కనపడటల్లేదు అనుకుంటూ ఉంటే మీ పోస్ట్ కనపడింది.
మీరు చెప్పిన దానితో ఒక రూపం కూడా జోడిస్తే అదే meditation అవుతుంది. నా ఇంకో బ్లాగు నుండి అది ఎంత శక్తి వంతమైనదో ఇస్తున్నాను.
Borderline Personality disorder (BPD). Sufferers unable to regulate their emotions. Symptoms: Anger, Fear of Abandonment, Unstable sense of self, Feeling of emptiness, Transient Paranoia. The technique used to treat BPD is Dialectical behavior therapy. One of the elements in it is called "Wise mind" or achieving Zen state of mind. Patients follow their breath and let their focus settle into their physical center at the bottom of their inhalation. This is similar to Hindu Meditation.
Deleteమీ వ్యాఖ్యకు అనేక కృతజ్ఞతలండి.
మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూసాను. . రిప్లై ఇవ్వటంలో ఆలస్యం జరిగినందుకు దయచేసి క్షమించండి.
ఆధునిక వైద్యంలో కూడా Meditation. తరహా విధానాన్ని ఉపయోగిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉందండి. ఆధునిక వైద్యంలో కూడా ఇలాంటి విధానాన్ని ఉపయోగించటం అనేది మంచి పద్ధతి. మీరు అన్నట్లు .... This is similar to Hindu Meditation.
మీరు కనపడి ఈ రోజుకి నెలమీద వారం. టపా రాసినందుకు కులాసా అని తెలిపినందుకు ఆనందం.తక్కు శ్వాసలు తీసుకుని ఎక్కువకాలం జీవించు. తక్కువ భోజనం చేసి ఎక్కువ కాలం జీవించు. భగవన్నామం జపించడమే తపస్సు కలిలో. నామ స్మరణే ధన్యోపాయం అన్నారు.
ReplyDeleteమీ వ్యాఖ్యకు అనేక కృతజ్ఞతలండి.
Deleteమీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూసాను. . రిప్లై ఇవ్వటంలో ఆలస్యం జరిగినందుకు దయచేసి క్షమించండి.
నిజమేనండి మీరన్నట్లు .... తక్కు శ్వాసలు తీసుకుని ఎక్కువకాలం జీవించు. తక్కువ భోజనం చేసి ఎక్కువ కాలం జీవించు. భగవన్నామం జపించడమే తపస్సు కలిలో. నామ స్మరణే ధన్యోపాయం అన్నారు.