ఇప్పటి వాళ్ళు పాతకాలం వాళ్ళు సౌకర్యవంతమైన జీవితం అనుభవించలేదు పాపం అనుకుంటారు. నాకు తెలిసినంతలో........ అప్పటి సంగతులు,.. ఇప్పటివి కొన్ని.......... పోల్చి చూద్దామండి.
అప్పటివాళ్ళు రాత్రి త్వరగా నిద్రపోయి ప్రాతఃకాలముననే నిద్ర లేచి అటూ ఇటూ తిరుగుతూ తాపీగా పళ్ళు తోముకునేవారు.
పళ్ళు తోముకోడానికి వేప లాంటి కొన్ని ఔషధ గుణములు గల చెట్ల పుల్లలను వాడటం వల్ల పళ్ళు ధృఢముగా ఉంటాయని ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే.
పళ్ళు తోముకుని ముక్కు చీదటానికి కూడా కావలసినంత ఫ్రీగా ఉండేది అప్పుడు. ఆ పుల్లలను వాడి రోజూ పారేసినా పొల్యూషన్ ఉండదు వాటితో . అవి సహజమైనవి కనుక .
ఇక ఈ రోజుల్లో బ్రష్షులను అలా చేయలేము కదా.
ఈ రోజుల్లో రాత్రి ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా నిద్రలేచి కొంపలు అంటుకుపోయినట్లు హడావిడిగా టైం చూసుకుంటూ బ్రష్ చేస్తారు.
ఇక జలుబు చేసినప్పుడు కూడా ఫ్రీగా ముక్కు చీదటానికి ఉండదు. చాలామంది ఇళ్ళలో గట్టిగా చీదితే, ఆ పడిశం, వాష్ బేసిన్ ప్రక్క గోడల పైన ఎక్కడ పడుతుందోనని జాగ్రత్తగా ముక్కును చీదుకోవాలి.
ఇక బాత్రూంల సంగతి ..........అప్పటి బాత్రూంలు ఇంటికి కాస్త దూరంగా ఉండేవి. అందుకే జబ్బులు త్వరగా రావు. వారు స్నానానికి సుగంధ సున్నిపిండి లాంటి సహజమైన పదార్ధములు వాడేవారు.
ఇప్పటి వారు స్నానానికి షాంపూలు, రసాయనిక సబ్బులు వాడుతారు.
ఇంటి నడిమధ్యన బాత్రూం ఉండటం వల్ల..... అవి శుభ్రం చేయటానికి వాడే యాసిడ్స్, ఫినాయిల్ తో కలిసిన ఇలాంటినీరు చెట్లకు వెళితే అవి చచ్చూరుకుంటాయి. ఇలాంటి నీరు భూమిలో ఇంకటం వల్లే నేడు భూమి విషపూరితం అయిపోయింది.
ఇక భోజనం......రసాయనిక ఎరువులతో పండిన పంటల వల్ల మట్టి , మరియు మన శరీరం విషపూరితమై పోతున్నాయి,
పెద్ద వయసు చిహ్నములైన ........కళ్ళజోళ్ళు , తెల్లజుట్టు , పళ్ళు కదలటం నేడు 5 సంవత్సరముల వయసు గల చిన్న పిల్లలలోనే కనిపిస్తోంటే ............. మనము అవన్నీ అత్యంత సహజమైన విషయాలుగా పరిగణిస్తూ ......... పట్టించుకోకుండా నిర్లిప్తతను పాటిస్తున్నాము.
అప్పటి కూరగాయలను తింటుంటే సహజపరిమళంతో ఉండేవి.
నేటి కూరగాయలు.......... చిక్కుడుకాయల వంటివి తింటున్నప్పుడు మందు వాసన చక్కగా తెలుస్తోంది.
మా తాతగారింటికి వేసవి సెలవల్లో వెళ్ళినప్పుడు , రాత్రిపూట అందరమూ కలిసి వెండి వెన్నెలలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, వేడివేడి చారన్నము, వడియాలతో వెన్నెలలో ఆరుబయట భోజనం చేసేవారం. ఎంత బాగుండేదో .
ఇప్పుడు ఎంత ఏ.సి లో తిన్నా ఆ సహజత్వం వస్తుందా ?
అసలు రాత్రిపూట చంద్రకాంతిలో కాస్సేపు గడపటం వల్ల శరీరానికి మంచి కాంతి, మనసుకు మంచి ప్రశాంతి కలుగుతాయట.
ఆనాడు కూడా వ్యవసాయం, ఎన్నో వ్యాపారాలు , వృత్తులు, రకరకాల ఉద్యోగాలు ఉండేవి. అప్పటి వృత్తుల గురించి ప్రాచీన గ్రంధాలలో చెప్పబడ్డాయి. అప్పుడు ఎన్నో వస్తువులు తయారుచేయబడ్డాయి. కానీ వాటివల్ల పర్యావరణానికి హాని కలిగేది కాదు.
వారు తమ జీవనానికి అవసరమైనంత వరకే........ వస్తువులను తయారుచేసేవారు.
ఇక ఈ విషయంలో ఇప్పటివారి గురించి అందరికీ తెలిసిందే..ఇప్పటి వారు చాలామంది విలాసవంతమైన వస్తువులనే ........ నిత్యావసరాలుగా మార్చుకుని వాటిని సంపాదించుటయే జీవితలక్ష్యమని అనుకుంటున్నారు.
అప్పటి ఆడవారికి ఇప్పటిలా వాషింగ్ మెషీన్స్ లేకపోయినా ........... మగవాళ్ళకి కార్లు లేకపోయినా ............ త్వరగా పనిపూర్తి చేసుకుని తీరిక సమయాలలో ............ ఆడవాళ్ళు . ప్రక్కవారితో కబుర్లు చెప్పుకోవటం, కష్టసుఖాలు చెప్పుకోవటం, కుట్లు అల్లికలు, కలిసి పిండివంటలు చేసుకోవటం ,................... ఇంకా, మగవారు రచ్చబండ దగ్గర ఎన్నో విషయాలు చర్చించుకోవటం జరిగేదట.
ఇప్పటివాళ్ళకి ఎన్ని యంత్రాలు కనిపెట్టినా భోజనం సరిగ్గా చేయటానికే సమయం చాలటంలేదు. కాకులలాగా అక్కడకు, ఇక్కడకు తిరగటానికే సరిపోతోంది.
అప్పటివారికి చక్కటి భోజనం, ఆహ్లాదకరమైన ప్రకృతిమధ్య జీవితం బాగుండేది. ఇక అప్పటి వారి దైవభక్తి .......... ఇప్పటి వారి దైవభక్తి గురించి అందరికి తెలిసిన విషయమే.
అందరూ సరదాగా కలవటానికి ఎన్నో పండుగలు, ఆడవాళ్ళకి పేరంటాలు, ,ఎన్నో ఉత్సవములు , కార్తీక వనభోజనాలు ఇలా ఎన్నో ఉండేవి. నాట్యము , సాహిత్యము, సంగీతము , నాటకములు వేయటము ఇలా ఎన్నో ఉండేవి.
ఇప్పుడయితే చాలా మందికి కాలక్షేపానికి .................. క్లబ్బులు, పబ్బులు, డబ్బులు వదుల్చుకుని కొత్తసామాను కొనుక్కుని రెండుచేతులలో మోయలేని ప్లాస్టిక్ కవర్లతో బయటికి వస్తూ అదే అదే .......... వీకెండ్ కాలక్షేపం అనుకొనే జీవులు.
అప్పటి సామాగ్రి వల్ల పర్యావరణానికి ఏ హానీ కలిగేది కాదు.
ఇప్పటి ఎలక్ట్రానిక్ సామాగ్రి నుండి వెలువడే మీధేన్, కార్బన్ డయాక్సైడ్ వల్ల ఓజోన్ పొర దెబ్బతినటం అందరికీ తెలిసిందే.
ప్రపంచములోని కొన్ని ప్రాంతములు, శుభ్రంగా ఉంటాయని కొందరు అనుకుంటారు. నిజమే మనం చెత్త మధ్యన. ........ బ్రతుకుతున్నాము. కానీ వారు చెత్తను వారి ప్రాంతము లో కాకుండా బయట ఇతరప్రాంతములలో పోస్తారు. అంతే తేడా ........... చెత్త ఎవరికైన వస్తుంది కదా.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కానీ అండి ...... విచిత్రమైన విషయము ఏమిటంటే ...... ఇవన్నీ అందరికీ తెలిసిన సంగతులే..
బాగుందండి. బాగా చెప్పారు.
ReplyDeleteబాగుందండి.అందరికీ తెలిసిన విషయాలే ఐనా రోజులుమారాయ్ అనుకుంటా మంతె
ReplyDeleteకానీ వారు చెత్తను వారి ప్రాంతము లో కాకుండా బయట ఇతరప్రాంతములలో పోస్తారు.
ReplyDeleteVery True
మీ అభిప్రాయములు తెలిపినందుకు, చాలా కృతజ్ఞతలండి.
ReplyDeleteమీ అభిప్రాయములు తెలిపినందుకు, చాలా కృతజ్ఞతలండి.
ReplyDeleteమీ అభిప్రాయములు తెలిపినందుకు, చాలా కృతజ్ఞతలండి.
ReplyDeleteమీ విశ్లేషణ చాలా బాగుంది.అప్పటి తరానికి ఇప్పటి తరానికి మధ్య సారూప్యత కంటే విభేదమే ఎక్కువ కనిపిస్తోంది.హ్మ్! ఉరుకుల పరుగుల ఈ గందరగోళం లో మనమూ నలుగురితో పాటు నారాయణ అనకపోతే...వెనకపడిపోయాం అనుకుంటారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మళ్ళీ రివైండ్ చేసుకోలేనింది కాలమే కదా!
ReplyDeleteమీ అభిప్రాయములు తెలిపినందుకు, చాలా కృతజ్ఞతలండి.
ReplyDeleteనేను ఒక విషయం ఎప్పటినుండో రాద్దామని అనుకుంటున్నానండి. నా భావాలను ఇక్కడ చెప్పుకోవటానికి సహకరించిన వారికి, నేను వ్రాస్తున్న టపాలకు కామెంట్స్ వ్రాస్తున్న అందరికి మరియు కామెంట్స్ వ్రాయకపోయినా ...... ఈ బ్లాగ్ ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములండి.
ReplyDeleteకానీ నా బాధ ఏమిటంటే , నేను చాలా మంది బ్లాగ్స్ చూస్తానండి. వారి టపాలు చదుతాను కానీ వాటి గురించి కామెంట్స్ రాయటం అంటే నాకు కొంచెం భయం.
ఇంకా, ఒకరికి టపాలకు వ్యాఖ్య వ్రాసి ఇంకొకరికి రాయకపోతే వారు ఏమనుకుంటారో అని , ఇలాంటి రకరకాల కారణాలతో కామెంట్స్ రాయలేకపోతున్నానండి.
అయినా ఈ విషయం గురించి నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. దయచేసి ఎవరూ నన్ను అపార్ధం చేసుకోవద్దని కోరుకుంటున్నానండి. ...