ఆ ఆంజనేయస్వామికి నమస్కారములు.
వేదములు, పురాణములు వీటిగురించి మనము పూర్తిగా తెలుసుకోవటం అసాధ్యం కదండి ......... అలాంటప్పుడు మనము త్వరపడి వాటిని అపార్ధం చేసుకోకూడదని నా అభిప్రాయమండి. వేదములు పరమాత్మ ప్రసాదములు ( ప్రసాదితములు ). అందుకనే మనము వేదములను గౌరవించాలి . .....
ఆ పరమాత్మ (శ్రీ మన్మహాదేవి,శ్రీ మన్మహాదేవుడు) దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ పరమాత్మకు నమస్కారములు.
పురాణములు వాటిలోని కధలను మనము చిన్నతనములో చదివినప్పుడు ఒక అర్ధం లో గోచరించవచ్చు. అదే మనకు వయస్సు పెరిగి బుధ్ధి పరిపక్వత చెందేకొద్దీ సత్యం కొంచెం కొంచెముగా అర్ధమవుతూ ఉంటుంది. అందుకని త్వరపడి వాటిని అపార్ధం చేసుకోకూడదు. అందుకే తరాలు మారినా అందులోని అర్ధములు అనంతములు. పురాణములలో చాలా లోతైన గొప్ప విషయాలుంటాయి. అవి పండితులకు మాత్రమే అర్ధమవుతాయి. నేను వాటి జోలికి పోదలుచుకోలేదు, నాకు అవి అర్ధం కావు కాబట్టి. నాకు తెలిసిన సామాన్య విషయాలే రాయటం బాగుంటుంది లెండి .
ఇప్పుడు ....... బ్రహ్మ దేవుడు సృష్టి చేస్తారు కదా. సృష్టి రచనకు విజ్ఞానం అవసరం. అందుకే వారికి భార్యగా చదువుల తల్లి సరస్వతీ దేవి ఉండటం ,......మరి మహా విష్ణువు పాలన చేస్తారు. అందుకే వారికి సంపదలనిచ్చే తల్లి మహాలక్ష్మీ దేవి భార్యగా ఉండటం., ...... అలాగే పరమశివుడు సం హారాన్ని చేస్తారు గదా... అందుకే వారికి శక్తి స్వరూపిణి తల్లి పార్వతీ దేవి భార్యగా ఉండటం ......... ఇవన్నీ ఎంత చక్కగా అర్ధవంతముగా ఉన్నాయో గదా. అంటే సృష్టి రచనకు అగ్ని దేవుని భార్య స్వాహా దేవి పేరు కూడా అలాగే బాగుంది కదండి.
ఇక పురాణములలో సృష్టి ఎలా జరిగింది, ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయంట. నవగ్రహములు వాటిగురించి రామాయణము కాలంలోనే మనవారికి తెలుసు. ఒక్కొక్క గ్రహం వాటి విశేషాలు, అవి ఎన్ని యోజనముల దూరంలో ఉంటాయి, ఇవన్నీ మన ప్రాచీన కాలం నాటి పెద్దలు చెప్పారుకదా. ఈ నవగ్రహముల లక్షణములు , ఇంకా నక్షత్రములు, వాటి ఆకారాన్ని బట్టి రాశులు, పంచాంగం ఇలా ఏర్పరిచారుగదా... పంచాంగం ప్రకారమే గ్రహణములు, గ్రహసంచారము ..... అంటే ఏ గ్రహము ఆకాశములో ఎక్కడ ఉంటుందన్నది, ఇలాంటివి ఎంతో ముందు చెప్పగలుగుతున్నారు.
ఇంకా పురాణములలో పాత్రల ద్వారా పెద్దలు మనకు ...... జీవితములో మనము ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అని కూడా తెలియచేశారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఒకోసారి అధర్మంగా ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తితోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తారు ..... ఇలాంటివన్నీ మనము ఆ కధల ద్వారా తెలుసుకోవచ్చు.
ఇలాంటి గొప్ప గ్రంధములు వారసత్వముగా కలిగినందుకు మనము గర్వపడాలి గాని చాదస్తం అనుకోవటం తప్పు కదండి..
No comments:
Post a Comment