koodali

Friday, March 26, 2010

హక్కులు పెద్దలకేనా..పిల్లలకు వుండవా..

 

ఈ రోజుల్లో ప్రపంచము లో సంస్క్రుతి బాగా మారిపోయింది.ఇప్పుడు ఎక్కువ మంది భార్యాభర్తలు తమ హక్కుల గురించి ఆలోచిస్తున్నారు.మరి పిల్లలకు బాధలు ,భయములు ఉంటాయి కదా.

డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ నాడు తల్లితండ్రి ఇద్దరు ఉద్యోగములకు వెళ్ళటము వల్ల చాలా చిన్న పిల్లలను క్రెచ్లలో వదిలి వెళ్తారు. అక్కడకొన్ని దగ్గర బాగా చూస్తారు. కొన్నిదగ్గర సరిగ్గా చూడకపోవచ్చు.ఏంతైనా తల్లిలా చూస్తారా..


మరి ఆ పిల్లలకు తమ భాధలు చెప్పుకోవటానికి భగవంతుడే దిక్కు. పెద్దవాళ్ళు చెప్పే జవాబు మేము వాళ్ళ కోసమే దబ్బు సంపాదిస్తున్నామని.




ఇప్పుడు ప్రశ్న ఏమంటే ఇదే పెద్దలు వారి ముసలితనములో వారి పిల్లలు వారిని వ్రుద్దాశ్రములలో చేర్పిస్తే మాత్రము ఎంత ఘోరం........... మాపిల్లలు మమ్మల్ని ప్రేమగా చూడటము లేదు మాకు డబ్బు కాదు ప్రేమ కావాలి ఈ వయసులో ........ అని అందరికి చెప్పి భాధ పడుతారు.

కొంతమంది కోర్ట్ కూడా కేస్ పెడతారు. వీరికి తమ పిల్లల చిన్నతనములో వారితో మాట్లాడటానికి టైం ఉండదు. మరి ఇప్పుడు వారి పిల్లలకు వీరితో మాట్లాడటానికి టైం ఉండదు.


ఏమంటే ఆ పిల్లలు వారికి పుట్టిన పిల్లలకు సంపాదించటములో బిజీగా ఉంటారు కాబట్టి. పెద్ద వయసులో మనము పిల్లల ప్రేమను కోరుకున్నప్పుడు.......... మరి పిల్లలు వారి చిన్నతనాన్ని బయటేక్కడో ఎందుకు గడపాలి. ఎందుకంటే వారికి మాటలు రావు కాబట్టి. వారికి హక్కులు తెలియవు కాబట్టి.



మనకు గాని మన పిల్లలకు గానిజీవితములో ఏదైనా కష్టము వచ్చినప్పుడు అది పోవాలంటే భగవంతుడు మన కోట్ల ఆస్తిని చూసి మనల్ని కాపాడడు. మనము ఎన్ని మంచి పనులు చేసామో చూసి వాటిని బట్టి రక్షిస్తాడు.


అందుకని నా అభిప్రాయము ఏమంటే మనము జీవితములో సుఖముగా ఉండాలంటే మన ము ప్రక్రుతిని సర్వనాశనము చేసేసి భూమిని తవ్వేసి చందమామను కూడాను పొల్యూట్ చెయ్యటానికి కూడా రడీ అయిపోతున్నాము.


విషాదమేమంటే ఇన్ని సౌకర్యాలు పెరిగినా ఏ ఒక్కరికి మనశ్శాంతి లేదు. మనము మనకు సరిపడినంత ఆస్తి మాత్రము సంపాదించుకుని................ నలుగురికి సహాయపడితే భగవంతుడు మనకు మంచి చేస్తాడు. మనకు కూడా ఎంతో సంతోషముగాఉంటుంది.


ఏదో నాకు తోచింది రాసేసాను,దయచేసి ఎవరి మనసునైనా కష్టపెడితే క్షమించండి.

 

No comments:

Post a Comment