మన ఆచారములు అంతా చాదస్తమేనా..........
ఏ విషయములో అయినా మంచిని మాత్రమే గ్రహించాలి అని నా అభిప్రాయమండి. అంటే మన పాత ఆచారములు గాని క్రొత్త సైన్స్ గాని వీటి వల్ల నైతికత తో కూడిన ఆనందం మనకు కలగాలి.
సైన్స్ మరియు భగవంతుడు వేరని ఎందుకు అనుకోవాలి . ఇంత గొప్ప ప్రపంచాన్ని స్రుష్టించిన భగవంతుడు పెద్ద సైంటిస్ట్ అని నా అభిప్రాయము.
మనము గుమ్మానికి పసుపు రాయటము వల్ల గాలికి బయట నుంచి వచ్చే దుమ్ము ఆ గడపకు తగిలి ఇంట్లోకి రాకుండా గడప కాపాడుతుంది.ఆపసుపు లోని ఆంటిబయొటిక్ గుణము వల్ల ఆ దుమ్ము లోని చెడు క్రిములు చనిపోతాయి.
ఇవన్నీ అర్ధము కావని గుమ్మానికి పసుపు రాస్తే డబ్బు వస్తుందని పెద్దవాళ్ళు చెప్పారు.మరి మనము ఈ రోజుల్లో పసుపు రంగు పెయింట్ వేసేసి................. పెద్దవారు చెప్పినదానివల్ల ఏమి ఉపయోగము....... అంతా చాదస్తము అంటున్నాము.
అలాగే చెట్ల ఆకులు కార్బండైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజెన్ విడుదల చేస్తాయని మనకు తెలుసు.ఒక్క మామిడి చెట్ల ఆకులు మాత్రము చెట్ల నుంచి కోసిన తరువాత కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసే శక్తి కలిగి ఉంటాయట.
అందుకని ఎక్కువమంది కలిసే ఫంక్షన్స్ లో మామిడి ఆకులు కట్టడము వల్ల గాలి శుభ్రముగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇవన్నీ సైంటిస్ట్స్ కనిపెడుతున్నారుకదా.
ఎన్నో వందల సంవత్సరముల మన ఆచారములలో......... తెలిసీ తెలియని కొంతమంది......... చెడ్డ ఆచారములు ప్రవేశపెట్టడము వల్ల మనము అన్ని ఆచారములు తప్పని చెప్పకూడదు.
మీ అందరికి థాంక్స్. నా అభిప్రాయములు చదివినందుకు. నాకు కంప్యూటర్ ఆపరేట్ చెయ్యటము సరిగ్గా రాదండి. దయచేసి తప్పులు క్షమించండి.
.ప్లాస్టిక్ మామిడి ఆకులు బదులు నిజమయిన ఆకులు వాడుదాము....
No comments:
Post a Comment