స్కూలులో అర్జంట్ గా టాయ్లెట్ వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. పిల్లలు టాయ్ లెట్ వెళ్ళాలని చెప్పినా కొందరు టీచర్లు పంపరు.
టాయ్లెట్ ఆపుకోవటం అనేది ఎంతో ఘోరమైన పరిస్థితి. ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది.
కొన్నిసార్లు ఫంక్షన్స్ కొరకు స్కూల్ పిల్లల్ని గంటల తరబడి నిల్చోబెట్టేస్తుంటారు.ఇలాంటప్పుడు ఆ పిల్లలు పడే ఇబ్బందులు ఎన్నో ఉంటాయి.
పెద్దవాళ్ళకు స్వాగతం పలకటం కోసం పిల్లలను నిల్చోబెడుతుంటారు. ఆ పెద్దవాళ్ళేమో తీరికగా ఎప్పుడో వస్తారు. వాళ్ళకోసం ఎదురు చూసిచూసి పిల్లలు నీరసపడిపోతారు.
పెద్దవాళ్ళ స్వాగతాల కోసం చిన్నపిల్లల్ని నిల్చోపెట్టడం సరైనది కాదు.
ఇక , చాలా హాస్టల్స్లో ఎక్కువ టాయ్లెట్స్ ఉండవు. అందువల్ల టాయ్లెట్స్ వద్ద పెద్ద క్యూ ఉంటుంది.
క్యూల వల్ల ఉదయాన్నే టాయ్లెట్స్ వెళ్ళటానికి కుదరక ...కొందరు పిల్లలు అలాగే స్కూలుకు, కాలేజీలకు వెళ్లిపోతుంటారు.
కొన్ని కాలేజీ హాస్టల్స్లో పెద్దపిల్లలు కూడా టాయ్లెట్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారు.
కాలకృత్యాలు ఆపుకునే సమస్య వల్ల ఎన్నో అనారోగ్యాలు వస్తున్నాయి.
........................
ఉదా..పాతకాలంలో పసిపిల్లలకు పల్చటి నిక్కర్ వంటివి వేసేవారు. వాళ్ళు యూరిన్ పోసినప్పుడల్లా ఆ చెడ్డిలను మార్చి ఉతికి ఆరేసేవారు. యూరిన్ నేలమీదపడితే క్లాథ్ తో తుడిచేవారు. ఈ రోజుల్లో పెద్దవాళ్లు ఆ పనులన్నీ చేయలేక, సోఫాలు, మంచాలు పాడవుతున్నాయని చెప్పి, పసిపిల్లలకు రోజంతా పెద్ద నాప్కిన్స్ వేస్తున్నారు.
ఆ నాప్కిన్స్ తో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల చర్మానికి రాషెస్ కూడా వచ్చే అవకాశముంది.. దురద, మంట వచ్చినా పిల్లలు చెప్పలేరు. గోక్కోటానికి నాప్కిన్ ఉండి గోక్కోలేరు. ఆ బాధతో పిల్లలు ఏడుస్తుంటే, పిల్లల్ని పెంచటం చాలా కష్టం అంటారు.
పిల్లలు ఇబ్బంది పడినా ఏంకాదు కానీ, సోఫాలు, మంచాలు పాడవ్వకూడదని, తమకు అస్తమాను శుభ్రం చేసే పని ఉండకూడదని పెద్దవాళ్ల ఉద్దేశం కాబోలు.పిల్లలను అలా ఇబ్బంది పెట్టటం చాలా పాపం.
ఇక కొందరు పసిపిల్లలను డేకేర్ సెంటర్లలో వేస్తారు. కొన్ని విదేశాల్లో పసిపిల్లలకు ఎప్పుడూ షూస్ వేసి ఉంచుతారు. పిల్లలను డేకేర్ సెంటర్లలో మధ్యాహ్నం నిద్రపుచ్చుతారు. నిద్రపోయేటప్పుడు కూడా షూస్ తీయకూడదని అక్కడ రూల్స్ అట.
ఇబ్బందిగా ఉండి పిల్లలు షూస్ తీయటానికి ప్రయత్నించినా కూడా, అక్కడిసిబ్బంది మళ్లీ షూస్ వేసేస్తారట. ఇంట్లో అయితే అలా ఉండదు కదా. పెద్దవాళ్లు నిద్రపోయేటప్పుడు షూస్ వేసుకుని పడుకోగలరా?
రెండేడుపులేడ్చి సానుభూతితో పనులు సులువుగా చక్క బెట్టుకొంటారు. మగవాళ్ళ మీద పడి ఏడవటమే వాళ్ల జీవిత లక్ష్యం.
మీ వ్యాఖ్యకు కృఅతజ్ఞతలండి.
నా దృష్టిలో స్త్రీలైనా పురుషులైనా సమానమే.
స్త్రీలకు, పురుషులకు ..హక్కులూ ఉన్నాయి. బాధ్యతలూ ఉన్నాయి.
స్త్రీలంటే పురుషులకు శత్రుత్వం ఉండకూడదు.పురుషులంటే స్త్రీలకు శత్రుత్వం ఉండకూడదు. కుటుంబమంటే స్త్రీలూ ఉంటారు. పురుషులూ ఉంటారు.
మగవారి సంపాదనను భార్య ఒక్కతే తింటుందా ? కుటుంబంలో అందరూ తింటారు కదా !
తమ సంపాదనను కుటుంబం కోసం ఖర్చుపెట్టడానికి బాధపడే మగవాళ్ళు వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తే సరిపోతుంది.
స్త్రీవాదులు కొందరు మేము వంటింట్లో పడి ఉండాలా ? అంటుంటారు. కుటుంబ సంరక్షణ, కుటుంబం కోసం వంట చేయటం కూడా తప్పే అనుకునే స్త్రీలు వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తే సరిపోతుంది.
కుటుంబం కోసం సంపాదించటం పురుషుని బాధ్యత, ఇంటిని చక్కదిద్దుకోవటం స్త్రీ బాధ్యతగా పెద్దవాళ్ళు నిర్ణయించారు.
స్త్రీలు తలచుకుంటే కుటుంబ పోషణ భారాన్ని కూడా చక్కగా నిర్వర్తించగలరు.
మరి పురుషులు స్త్రీలలా నెలసరి, గర్భాన్ని ధరించటం..వంటి భారాలను భరించగలరా ? ( ఆ అవకాశం వస్తే..)
...........
స్త్రీలు అణచివేతకు గురవుతున్నారని.. రక్షణ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు కల్పించారు. ఇప్పుడు కొందరు మగవాళ్ళు కూడా అణచివేతకు గురవుతున్నారని అంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మగవాళ్ళ రక్షణ కోసం కూడా కొన్ని ప్రత్యేక చట్టాలు కల్పిస్తారేమోలెండి.
మీరు చెప్పే పెద్దల నిర్ణయించినవాటిని, భారత సంస్కృతిని స్రీవాదం ఒప్పుకోదు. సుమారు 80% ప్రభుత్వానికి పన్నులరూపంలో వచ్చే ఆదాయం మగవారి సంపాదననుంచే. స్రీ వాదులు, ప్రభుత్వం సహాయం చేయాలని కోరేది పరోక్ష్యం గా మగవాళ్ల సంపాదననే. వ్యక్తిగత స్వేచ్చ పై నమ్మకం, ఆత్మాభిమానం ఉంటే స్రీలు వారి సంపాదనను వార సంపాదించుకొని జీవించాలి. మరి అలా చేయరెందుకు? నీ వంశానికి వారసుడినిచ్చా అని పల్లవి ఎత్తుకుంటారేందుకు? మోగోళ్ళకి భారత సంస్కృతి వలన ఎమీ సుఖంలేదు.లాభం అంతకన్నా లేదు. మగవారి కష్టార్జితాన్ని ప్రభుత్వం, కుటుంబం సంస్థాగతం గా దోచుకొని తినటం హక్కుగా భావిస్తున్నారు.
మరి, వాళ్లకు జన్మించిన సంతానం ఎవరి డబ్బుతో పెరిగి పెద్దవుతారు ? స్త్రీలు,పురుషులు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు కాబట్టి ప్రభుత్వమే దేశంలోని పిల్లల్ని పెంచి పోషించాలా ?
భార్య భర్త సర్దుకుపోతేనే సంసారం సజావుగా నడుస్తుంది. పంతాలు, పట్టింపులకు పోతే గొడవలు పెద్దవవుతాయి తప్ప పరిష్కారం లభించదు.
భార్యాభర్త అనేకాదు, ఎవరికయినా సరే, జీవితంలో కొంత సర్దుబాటు ధోరణి లేకపోతే కష్టం. మగవాళ్ళు లేక స్త్రీలు..తమ ఆఫీసులో పై ఆఫీసర్ పెత్తనాన్ని భరిస్తారా ? లేక ఎదురుతిరిగి ఉద్యోగం ఊడగొట్టుకుంటారా ?
ఆఫీసులో పైవాళ్ళతోనూ, సాటి కొలీగ్స్ తోనూ కూడా మనకు నచ్చని అనేక అంశాలుంటాయి. మనకి ఇబ్బంది కలిగించే అంశాలూ ఉంటాయి. అయితే, ఉద్యోగం కోసం వాటిని భరిస్తారు కదా! మరి అదే సర్దుబాటు ధోరణిని కుటుంబంలోనూ చూపిస్తే బాగుంటుంది కదా !
ఎన్ని ఆఫీసులు మారినా..కొద్దిగా అయినా సర్దుబాటు ధోరణి లేకపోతే ఉద్యోగంలో నిలదొక్కుకోవటం కూడా కష్టమవుతుంది.
బయట ఉద్యోగం అయినా వ్యాపారం అయినా లేక మరే ఉపాధి అయినా సరే సర్దుకుపోక తప్పదు. ఉదా..ఎన్ని ఇంటి గొడవలతో సతమతమవుతున్నా కూడా, వ్యాపారం చేసే వ్యక్తి షాపుకు వచ్చిన కస్టమర్లతో ఓపికగా మాట్లాడకపోతే ఇంకోసారి కస్టమర్లు అతని షాపుకు రారు.
నిజమే, ఎంత సర్దుకుపోదామన్నా కొన్నిసార్లు సర్దుకుపోలేము. అయితే జీవితమంటే సర్దుకుపోక తప్పదు.
అంతెందుకు తల్లితండ్రులు, జన్మించిన పిల్లలతో కూడా అభిప్రాయాలు కొన్ని సరిపడకపోవచ్చు. అయితే, వాళ్ళతో సర్దుకుపోతాము కదా !
ఎక్కడో పుట్టి పెరిగిన భార్యాభర్త మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం అత్యంత సహజం.
దురదృష్టం ఏమిటంటే, ఈ రోజుల్లో కొందరు బంధువులు, స్నేహితులు..అనబడే దగ్గరి వారి వల్ల కూడా భార్యాభర్త మధ్య గొడవలు వస్తున్నాయి.
ఈ పరిస్థితి మారి అందరూ బాగుండాలని ఆశిద్దాము.
స్త్రీవాదం తెలిసిన వాళ్ళు పురుషవాదం గురించి తెలియదనటం విడ్దూరంగా ఉంది.
స్త్రీలు, పురుషులు సమానం.. అంటుంటే ఇక ఎవరైనా ఓడటం అనే సమస్యే ఉండదు కదా !
వనజవనమాలి గారి గురించి పదేపదే మీరు ఈ బ్లాగులో వ్రాయటం ఎందుకో అర్ధం కావటం లేదు. మీ అభిప్రాయాలను ఆమె బ్లాగ్ లోనే వ్రాస్తే బాగుంటుంది.
చరిత్రలో స్రీలు సంపాదించిన డబ్బులతో మోగోళ్లు కోటలు కట్టలేదు...అని మీరు వెలిబుచ్చిన అభిప్రాయం గురించి నాకు ఏమనిపిస్తుందంటే,
అంతా డబ్బుతోనే బేరీజు వేయకూడదు. ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో జన్మించాలంటేనే అందుకు ఆ వ్యక్తి యొక్క తల్లి నవమాసాలూ మోసి ప్రసవిస్తేనే ఈ లోకంలోకి వస్తారు.( పూర్వకాలంలో అయోనిజులు గురించి మినహాయిస్తే..)
ఆ తరువాత శిశువు సంరక్షణ, పెరిగి పెద్దవ్వటం వెనుక స్త్రీ పాత్ర చాలా ఉంటుంది. ఇదంతా జరిగితేనే కదా డబ్బు సంపాదించేది, కోటలు కట్టేది.
సంసారంలో స్త్రీల పాత్రా ముఖ్యమైనదే.... పురుషుల పాత్రా ముఖ్యమైనదే. ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంది.
అవునండి, మీరన్నట్లు నాణేనికి రెండు పక్కలుంటాయి. వివాహంతో ఒక స్త్రీ మరొక ఇంటికి వెళుతున్నపుడు తల్లి తండ్రులు తమకి తగినది ఇచ్చి పంపటం తప్పుకాదు. దీనికోసమని అమ్మాయిని హింసించడం, ఆడపిల్ల పుట్టిందని తరిమేయడం లాటివి అమానుషం. తవ్వుకుంటే తప్పులు ఇరు పక్కలా కనపడతాయి. సద్దుకుంటే నే జీవితం.
స్త్రీ ధనానికి చట్టబద్ధత ఉన్నప్పుడు, కట్నం ఇవ్వటం పుచ్చుకోవటం నేరం అనేది పరస్పర విరుద్ధంగా ఉంది కదా ! కట్నానికి స్త్రీ ధనానికి తేడా ఏమిటండి ?
స్త్రీధనం అంటే బంగారు ఆభరణాలు, బహుమతులు వంటివే వస్తాయా ? ఈ స్త్రీ ధనానికి కొంత మొత్తం అని పరిమితి ఉంటుందనుకుంట.
లక్షల విలువ చేసే ఆస్తిని అమ్మాయికి ఇస్తే అది కట్నం అవుతుందా లేక స్త్రీ ధనం కోవలోకి వస్తుందా?
నగదు లేదా వేరే రూపేణా, అలాగే పరిమితి అంటూ ఏమీ లేదండీ. తల్లితండ్రులు తమ తాహతు కొద్దీ తమ కూతురుకు స్వచ్చందంగా (వియ్యంకుల & అల్లుడి ప్రమేయం & హక్కు ఇసుమంతయినా లేకుండా) ఇస్తే చాలు.
మొత్తం స్త్రీధనం ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. దశలవారీగా (ఉ. పిల్లలు పుట్టినప్పుడు, ప్రతి దసరా పండుగకు వగైరా) కూడా ఇవ్వొచ్చు.