koodali

Sunday, July 19, 2026

ఇంట్లో శివలింగాకారం అని నలుగురికి చూపిస్తే, మూఢనమ్మకాలు ప్రచారం చేస్తున్నట్లు కొందరు మాట్లాడుతున్నారు...

 

మా ఫ్రిజ్లో కూడా చాలాకాలం క్రిందట  శివలింగాకారంలా ఏర్పడింది. ఆ చిత్రాలను బ్లాగులో పోస్ట్ చేసాను. 
 
 link..

 ఫ్రిజ్లో శివలింగం ఆకారంలా ఏర్పడటం చూసి నాకు ఆశ్చర్యంగా, ఆనందంగా..అనిపించింది. పెద్దసైజులో అలా ఆకారం ఏర్పడటం నేను ఎప్పుడూ గమనించలేదు.
 
 అది ఐస్ వల్లే ఏర్పడినా, శివలింగంగా భావించి..ఆ విషయాన్ని చూపించాలనిపించి చూపించాను. మూఢనమ్మకాలు ప్రచారం చేయాలని కాదు. నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకం.

అప్పట్లో మా ఫ్రిజ్లో శివలింగాకారాన్ని నేను మా చుట్టుపక్కల ఎక్కువమందికి చూపించడానికి భయపడ్దాను. 
 
నేనే అలా ఏర్పాటు చేసానని అనుకుంటారేమో అని, ఇంకా  ఏమంటారోనని, చూడటానికి ఎక్కువమంది  వస్తారేమో? తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో? అని సందేహాలు కలిగాయి.

 మరికొందరు కూడా వాళ్ల ఫ్రిజ్లో ఇలా ఏర్పడినట్లు చూపించిన ఫోటోస్ చూశాను.
 
ఎవరైనా, ఫ్రిజ్లో శివలింగాన్ని చూపించి, గుడికట్టి భక్తులను పిలిచి, ఇక్కడ మొక్కుకుని హుండిలో డబ్బులు సమర్పిస్తే కష్టాలు, కోరికలు తీరుతాయని.. చెప్పారా ?

మూఢాచారాల పట్ల కొందరి ఆవేదన నేను అర్ధంచేసుకోగలను.

సమాజంలో కొందరు దైవము పేరుతో కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే, అందరూ అలా మోసం చేసేవాళ్ళే ఉండరు.

 దైవము పేరుతో వ్యాపారంలా చేసి, డబ్బు సంపాదించేవారు కూడా ఉండవచ్చు. ఈ రోజుల్లో ఎవరు ఎటువంటివాళ్ళో తెలియదు కాబట్టి, జాగ్రత్తగానే ఉండాలి.

  ఎవరు ఏం అనుకున్నా, మా ఇంట్లో ఫ్రిజ్లో శివలింగాకారంలా ఏర్పడటం విషయం గురించి నేను గొప్పగా, ఆనందంగా భావిస్తాను.
................

చాలామంది.. ప్రకృతిలో, రాయిలో, రప్పలో, చెట్టులో, పుట్టలో దైవాన్ని చూస్తారు. మట్టితో, ఇసుకతో ..దైవరూపాన్ని తయారుచేసి పూజిస్తారు. 
 
ఇంట్లో పూజించే పటాల్లోని చిత్రాలను మనుషులే గీచినా, ఆ చిత్రంలో దైవాన్ని ఆరాధిస్తారు.

ఒక పాతసినిమాలో ఒక వ్యక్తి తనకు శివపూజకు సమయం మించిపోతోందని దగ్గరలో శివలింగం లేదని, తను మోహించిన  స్త్రీ యొక్క స్తనం శివలింగాకారంలో ఉన్నదని భావించి, దానినే పూజించినట్లు  సినిమాలో చూసినట్లు గుర్తుంది. అలా  చూపిస్తే,  జనాలు బాగా చూసారు. మరి సినిమాల్లో ఇలా చూపిస్తే ఏమంటారు?

అలా కాకుండా, కొబ్బరికాయనుకాని,  చిన్నరాయినికాని శివలింగంగా భావించి పూజించవచ్చు. లేదంటే మానసికంగా భావించి, మానసికపూజ చేయవచ్చు. మానసిక పూజ చాలా గొప్పదంటారు.

కొందరు దైవము పేరుతో వ్యాపారం చేస్తున్నారనిపిస్తోంది.  మూఢనమ్మకాలు పెంచే సీరియల్స్, సినిమాలను  అందరూ వ్యతిరేకించాలి.
.........................

సృష్టి అంతటా దైవము ఉన్నారు. అలాగని ప్రతిరాయిని రప్పను, చెట్టును, ప్రతిదానిని పూజించాలంటే కుదిరే పనికాదు.  అలా అతిగా చేస్తే ఆ వ్యక్తి అతిగా తయారయ్యే పరిస్థితి రావచ్చు. 
 
దైవపూజలు అయినా, లౌకికవ్యవహారాలైనా, ఏదైనా..  అతిగా కాకుండా  చేస్తే మంచిది. దైవపూజలు పేరుతో మూఢత్వంగా ప్రవర్తించకూడదు.

...................

పూజ అంటే బోలెడు  విషయాలను చెప్పటం, వాటిని సరిగ్గా పాటించకపోతే కష్టాలు వస్తాయనటం.. దైవము పట్ల ధ్యాస కన్నా, విధివిధానాలు పాటించటం పట్లే ధ్యాస ఎక్కువ ఉండేలా పరిస్థితి తయారయ్యింది.

సమాజంలో ప్రచారంలో ఉన్న కొన్ని మూఢనమ్మకాలవల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.. చాలా మూఢనమ్మకాలున్నాయి.
....................

  ప్రజలకు దైవము అంటే భక్తి ఉండాలి, పాపాలు చేయకూడదని భయం ఉండాలి. 
 
అంతేకానీ, పాపభీతి లేకుండా, ఎన్ని పాపాలు చేసినా పరిహారాలు చేస్తే సరిపోతుందనే విధంగా పరిస్థితి తయారయ్యిందనిపిస్తుంది.

 .......................

సోషల్మీడియా వచ్చాక ఎందరో ఎన్నో చెప్పటం, ప్రతిదానికి ఇలాగే చెయ్యాలి, ఇలా చెయ్యకూడదంటూ చెప్పి ప్రజలను భయాందోళనకు, అయోమయానికి గురిచేస్తున్నారు. 
 
హిందుగ్రంధాలలో కూడా ప్రక్షిప్తాలైన మూఢనమ్మకాలు చాలాఉన్నాయి. వాటిని తొలగించాలి, వాటిని ఎవరూ ప్రచారం చేయకూడదు.

సమాజంలో ఎప్పటినుంచో ప్రజలలో ఏర్పడిన మూఢనమ్మకాలకు కారణాల గురించి ఆలోచించి సరిదిద్దుకోవాలి.

నే
ను కూడా  చాలామందిలా చాలా విషయాల గురించి భయపడుతూ చాలాకాలం కొన్నింటిని పాటించాను. అయితే, ఇప్పుడు నేను చేయగలిగినంలో మాత్రమే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 
 
మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా బ్లాగులో ఎన్నో విషయాలను వ్రాసాను. అయినా కొన్ని సెంటిమెంట్స్..ఉన్నాయి.
..............................

 ఈ పోస్ట్ కొన్ని రోజుల తరువాత ఇక్కడ డిలిట్ చేసి వేరే దగ్గర పోస్ట్ చేద్దామనుకుంటున్నానండి.