శరన్నవరాత్రులు మరియు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు మొదలవ్వబోతున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.
శరన్నవరాత్రులు మరియు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు మొదలవ్వబోతున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలండి.
ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. కారణాలు ఏమైనాకానీ, ఇలా జరగటం అత్యంత బాధాకరం. అక్కడి ప్రజల పరిస్థితి తలచుకుంటే ఎంతో బాధగా ఉంది.
యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాల వాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో తెలియక, ఎప్పుడు ఏ బాంబులు మీద పడతాయో? కుటుంబంలోని వారు ఎటు చెల్లాచెదురవుతారో తెలియక ఎంత భయంతో అల్లాడుతారో? కుటుంబంలోని పెద్దవాళ్లు చనిపోతే అమాయకులైన చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఊహించుకుంటేనే ఎంతో బాధ కలుగుతోంది.
యుద్ధాలు లేకుండా ఉంటేనే మన దగ్గర ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాము. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు అల్లాడుతున్నారు..ఇంకో చోట యుద్ధాలు.. ఇదంతా ఏమిటో ? అర్ధం కావటం లేదు.
కొంతమంది పట్ల మరి కొందరు దాడులు చేయటం కూడా బాధాకరం. ఈ దాడుల సమయంలో పిల్లలు, పెద్దవాళ్లు భయంతో ఎంత అల్లాడిపోతారో.. తలచుకుంటే ఎంతో బాధ కలుగుతుంది.
ఎక్కడైనా ఏ ప్రజల పట్ల అయినా కూడా, ఆ విధంగా దాడులు చేయటం బాధాకరం.
మనుషుల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉంటాయి. గొడవలకు అనేక కారణాలుండవచ్చు.
కొందరు ఇతరులపై ఆధిపత్యం కొరకు గొడవలకు, దాడులకు, యుద్ధాలకు సిద్ధపడతారు. కొందరు శత్రువుల నుంచి తమను రక్షించుకొనడానికి యుద్ధాలు చేస్తారు. ఇంకా ఎన్నో కారణాలుండవచ్చు.
గొడవలు జరిగినప్పుడు .. ఎవరి కోణంలో వాళ్ళు ..మా అభిప్రాయమే సరైనది.. అంటారు. ఎవరి వాదన వారిది.
కారణాలేమైనా, యుద్ధాల వంటి వాటి వల్ల ఎన్నో బాధలుంటాయి. అందువల్ల..దాడులు, యుద్ధాల వంటివి ఆగిపోతే బాగుంటుంది.
ప్రపంచంలోని జీవులు అన్నీ మంచిగా ఉండాలి.
************
కొన్ని విషయములు..link..