కొందరు దైవ నామాలను కొంత సంఖ్య ప్రకారం వ్రాయాలనుకుని పుస్తకంలో రాస్తుంటారు.
పుస్తకం పూర్తి అయిన తరువాత ఆ పుస్తకం ఎక్కడ పెట్టాలో తెలియదు. కొందరు గుడిలో ఆ పుస్తకాలను ఇస్తుంటారు.
కొన్ని పుస్తకాలను కలిపి స్తూపంలా భద్రపరచటం కూడా జరుగుతోంది.
అయితే పేపర్ పైన దైవ నామాలను వ్రాసి, ఆ పుస్తకాలను ఎక్కడ దాచాలో అని సతమతమయ్యేవారికి నాకు తోచిన అభిప్రాయాన్ని వ్రాస్తున్నాను.
ఏదైనా పుస్తకంలో మనం అనుకున్న దైవనామాన్ని కొంచెం పెద్ద అక్షరాలతో రాసుకుని , మరల దైవనామాన్ని వ్రాసేటప్పుడు ఇంతకుముందు వ్రాసిన నామం పైనే మళ్లీ వ్రాసుకోవచ్చు.
అయితే, నామాలను మళ్లీ వ్రాసేటప్పుడు ఒకసారి వ్రాసిన నామం పైనే మరల దిద్దుకోవచ్చు.
ఇలా చేయటం వల్ల నామాలను రాయటానికి బోలెడు పుస్తకాలు తేవటం, అవన్నీ పూర్తయిన తరువాత ఆ ప్రతులను ఎక్కడ దాచాలో అర్ధంకాకపోవటం వంటివి ఉండవు.
కొందరు ఏదైనా మంత్రాన్ని దీక్షలో తీసుకుంటారు.
ఆ మంత్రాన్ని ఇతరులకు తెలియనీయకూడదన్నప్పుడు ఆ మంత్రాన్ని పుస్తకం పైన పెన్నుతో రాయకుండా... ఎన్ని సార్లు మంత్రాన్ని రాయాలనుకుంటున్నారో అన్ని సార్లు రోజూ ఒకే పుస్తకంపైన గరుకుగాలేని నున్నటి ఏదైనా పుల్లతో వ్రాయవచ్చు.
చూపుడు వ్రేలితో రాస్తే ..గబగబా రాయటం వల్ల ..వ్రేలి నరాలు బలహీనమయి ..తరువాత చేతి నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
అయితే, చూపుడు వ్రేలుకు బొటనవ్రేలు సపోర్టుగా ఆనించి చూపుడు వ్రేలితో వ్రాయవచ్చు.
పెన్నుకానీ, పెన్సిల్ కానీ తిప్పి పట్టుకుని ( అంటే రాయని వైపు ) కూడా వ్రాసుకోవచ్చు.
ఇలా రాసిన మంత్రము ఇతరులకు కనిపించదు.
రాసిన పుస్తకాలను ఎక్కడ దాచాలో అనే బెంగా ఉండదు. ఒకే పేపర్ పైన ఎన్ని సార్లైనా వ్రాయవచ్చు.
దైవనామాలను పుల్లతో వ్రాసేటప్పుడు ఎన్నిసార్లు రాసామో తెలియడానికి ....
ఒక్కొక్క నామం వ్రాసినప్పుడు ఎడమచేతి వ్రేళ్లతో లెక్కపెట్టుకుంటూ 10 నామములు పూర్తయిన వెంటనే ఒక పేపర్ పైన టిక్ చేసుకోవచ్చు. లేక ఎక్కడైనా గుర్తు పెట్టుకోవచ్చు.
.ఒకేసారి చాలా విషయాలను రాయటం వల్ల ఎక్కువగా అయి గజిబిజిగా ఉంటుందేమోననిపించి ...మరికొన్ని విషయాలను వ్యాఖ్యల వద్ద రాసానండి.
ReplyDeleteపాతకాలం పలక పైన మనము వ్రాయాలనుకున్న సంఖ్యలో నామాలను వ్రాసుకుని తరువాత పలకను కడిగేసుకోవచ్చు కదా! అనిపిస్తుంది కానీ,
. పలకల పైన చాక్ పీస్ తో నామములు వ్రాసి చెరిపితే వచ్చే దుమ్ము నేలపైన పడుతుంది.
అందువల్ల ఒక పేపర్ పైన పెన్నుతో దైవనామాన్ని వ్రాసి తిరిగి ఎప్పుడు దైవనామాన్ని వ్రాయాలనుకున్నా ఇంతకుముందు వ్రాసిన నామము పైన దిద్దినట్లుగా ఎన్నిసార్లైనా వ్రాయవచ్చు.
ఇవన్నీ నచ్చకపోతే ఈ మధ్య ఈ - పలకలు వచ్చాయి. వాటి పైన వ్రాసుకోవచ్చు.
లేదంటే లేఖిని వంటి వాటిలో మనము వ్రాయాలనుకున్న నామములను వ్రాసుకుని తరువాత డిలీట్ చేసుకోవచ్చు.
వ్రాసిన నామములను చెరపటం ఇష్టం లేనివాళ్ళు.. ఇంతకుముందు చెప్పినట్లుగా పేపర్ పైన పెన్నును తిప్పి పట్టుకుని కూడా నామములను వ్రాయవచ్చు.
వ్రాసిన వాటిలో ఏదైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
ReplyDeleteఒక సూచన ఏమిటంటే..
వ్రాయని పెన్నును తిరగేసి.. పేపర్ పైన నామములను వ్రాయాలనుకుంటే మాత్రం.. నామాన్ని విడి పేపర్లపై వ్రాసి వాటిని ఎక్కడపడితే అక్కడ ఆ పేపర్లను పడేయటం చేయకూడదు.
ఎందుకంటే, అక్షరాలు పైకి కనిపించకపోయినా ఆ పేపర్లపైన దైవనామములను వ్రాసి ఉంటారు కదా..
ఒక గట్టి పుస్తకం చూసుకుని..అందులో దైవనామములను వ్రాసుకుని పుస్తకాన్ని దేవుని అల్మరాలో పెట్టుకోవచ్చు.
పుస్తకంలో .. ఒకే నామాన్ని ఎన్ని రోజులైనా, ఎన్నిసార్లైనా దిద్దవచ్చు..ఆ పుస్తకాన్ని ఎంతకాలమైనా అలా ఉపయోగించవచ్చు.
ReplyDeleteకంప్యూటర్, టాబ్, సెల్ఫోన్, టీవీ .. చూసేటప్పుడు ఎక్కువగా మెడ క్రిందకు వంచి చూడటం, ఎక్కువగా మెడ పైకి ఎత్తి చూడటం కాకుండా.. సరైన విధంగా చూడటం మంచిది.
ఈ మధ్య మళ్ళీ కొరోనా కేసులు పెరుగుతున్నాయంటున్నారు.
ReplyDeleteకొందరిలో కొరోనా చాలా తక్కువగా వచ్చి, వ్యాధి వచ్చినట్లు తెలియకుండానే తగ్గిపోతుందట. వ్యాధి వచ్చినట్లు తెలియకపోవటం వల్ల వాళ్ళు వైద్యుని వద్దకు వెళ్ళకపోవచ్చు. బహుశా, ఇలాంటివారిలో వ్యాధినిరోధకశక్తి బలంగా ఉండవచ్చు.
అయితే, ఇలాంటి వారి నుంచి ..వ్యాధినిరోధకశక్తి బలహీనంగా ఉన్నవారికి వ్యాధి సోకుతుందేమో ? ఇవన్నీ సరిగ్గా అర్ధం కావటం లేదు. ఈ వ్యాధి విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి.
అందువల్ల, అందరూ జాగ్రత్తగా ఉండటం మంచిది.
.......
కొరోనా వచ్చి తగ్గిన కొందరిలో కొన్ని బాధలు వస్తున్నాయంటున్నారు.
ఉదా..కొద్దిగా కొరోనా వచ్చి(అంటే ఎక్కువగా వ్యాధి లక్షణాలు లేకుండా) దానికి మందులు వాడి.. వ్యాధి తగ్గిన వారిలో కూడా కొంతమందిలో.. జబ్బు తగ్గిన
కొంతకాలం తరువాత.. శ్వాససంబంధిత ఇబ్బందులు, నరాల వీక్నెస్, తలతిరగటం..వంటి కొన్ని రకాల బాధలు తెలుస్తున్నాయంటున్నారు.
ఇలాంటివి వ్యాధి వల్ల రావచ్చు, కొన్నిసార్లు.. వ్యాధి తగ్గటానికి వాడే కొన్నిరకాల మందుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కొంతకాలం ఉంటాయంటారు.
ఇలాంటప్పుడు ఆ బలహీనతలు తగ్గటానికి ఆయుర్వేద మందులు వాడవచ్చేమో.. అనిపిస్తుంది. ఉదా..బ్రాహ్మి, అశ్వగంధ..వంటి వాటిని వైద్యుల సలహాతో వాడుకోవచ్చు.
....
ఇక కోరోనా టీకా విషయంలో కొందరు ఏంటున్నారంటే.. టీకా వేయించుకుంటే కొన్ని సైడెఫెక్ట్స్ వస్తాయని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కొందరేమో టీకా చాలా సేఫ్ వేయించుకోండి..అంటున్నారు.
టీకా వేయించుకున్న వారు కూడా మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
....
ఇప్పుడు చాలామంది మాస్కులు వేసుకోకుండానే తిరుగుతున్నారు.
కొరోనా గురించి ఎన్నో విషయలు అర్ధం కావటం లేదు .. అందరూ జాగ్రత్తగా ఉండటం మంచిది.
వ్యాధినిరోధకశక్తి పెరిగేలా చూసుకోవటం, మాస్కు ధరించటం..వంటివి పాటించటం మంచిది.