దైవపూజామందిరాలు ఎన్నో విధాలుగా ఉంటాయి.
కొందరు ఒక పీఠంపై దైవమూర్తిని లేక దైవమూర్తులను ఉంచి పూజించుకుంటారు.
కొందరు అలమారలో దైవమూర్తులను ఉంచి పూజిస్తారు.
అయితే ఎక్కువ దైవవిగ్రహాలు, పటాలు ఉన్నప్పుడు..
అలమారలో రెండు అరల్లో అంటే.. ఒక అరలో కొన్ని దైవ పటాలను, మరొక అరలో మరికొన్ని దైవ పటాలను ఉంచి పూజిస్తారు. ఇలాంటప్పుడు రెండు అరల్లోనూ దీపాలను వెలిగిస్తారు కొందరు.
ఇలాంటప్పుడు, క్రింద అరలో దీపం వెలిగించినప్పుడు ఆ వేడిసెగ పైన అరలో ఉన్న దేవతా విగ్రహాలకు, పటాలకు తగిలే అవకాశం ఉంది.
పైన అరలో ఉన్న దేవతా విగ్రహాలకు క్రింద దీపం పెట్టటం మంచిది కాదని నాకు అనిపించింది.
అందువల్ల దేవతా విగ్రహాలను అన్నింటినీ ఒక పీఠంపైనే ఉంచి, అక్కడ దీపం వెలిగించటం మంచిదనిపిస్తోంది.
లేదంటే అల్మరాలో దేవతా పటాలుంచి, బయట చిన్న స్టూల్ పైన దీపం వెలిగించటం మంచిది.
అయితే, అటూఇటూ తిరిగేసమయంలో స్టూల్ పైన ఉన్న దీపం చేతులకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
వీటన్నింటికన్నా ..ఉన్న దేవతా పటాలన్నీ ఒకే అరలో ఉంచి అక్కడ దీపం వెలిగించటం మంచిదనిపిస్తోంది.
***************
పైన పోస్ట్ పెట్టిన చాలాకాలం తరువాత మరికొన్ని విషయములను ఇక్కడ వ్రాసి పోస్ట్ చేయటం జరిగిందండి. 2024..
మరికొన్ని విషయములు..
ఈ మధ్య ఒక వీడియోలో వారు కొన్ని విషయాల గురించి తెలియజేస్తూ...ఈ మధ్యన కొందరు అర్చకులు గొంతు కాన్సర్ కు గురయ్యారని, కల్తీ అగరుబత్తులు, కల్తీ హారతికర్పూరం ఎక్కువగా వాడటం వల్ల ఆ విధంగా జరుగుతుందని వారి అభిప్రాయాన్ని తెలియజేసారు.
నిజమే, కల్తీవి వాడటం వల్ల అలా జరగవచ్చు. కల్తీ లేనివి వాడటం మంచిది.
చాలామంది ..బోలెడు అగరుబత్తులు, చాలా హారతి కర్పూరం .. వెలిగిస్తుంటారు. అలా కాకుండా, కొద్దిగా తగ్గించి వేయవచ్చు. కల్తీ లేనివి అయితే , కొంచెం ఎక్కువ అయినా వేయవచ్చు.
.లింక్..హారతి ఇచ్చే అసలైన విధానం ఇదే ! Anantha Lakshmi Dharmasandehalu Significance Of Aarti In Telugu
SumanTV Prime
*************
link..