koodali

Wednesday, February 15, 2017

ఓం ..శనిదేవులు దయామయులు. . శ్రీ శనిదేవుని వ్రత కధ..


 
ఓం ..శనిదేవులు దయామయులు. . శ్రీ శనిదేవుని వ్రత కధ..
ఓం 

పూర్వము అయోధ్యను పాలించే దశరధమహారాజు కొలువై ఉండగా అందలి జ్యోతిషశాస్త్రజ్ఞులు రాజుగారితో ఇట్లనిరి. ఓ రాజా! గ్రహములలో కడు క్రూరుడైనటువంటిన్నీ , దేవరాక్షసులకు సైతము భయము గొల్పునటువంటిన్నీవాడైన శనైశ్చరుడు కృత్తికాంతమును ప్రవేశించి రోహిణీశకటమును భేదింపబోవుచున్నాడు. దానివలన 12 సంవత్సరములు దుర్భిక్షము కలుగును. 


  ఆ మాటలు విని దశరధుడు మంత్రి పురోహితులతో ఆలోచించి జగద్రక్షణార్ధమై - వశిష్టమహర్షీ ! దీనినెట్లు నివారించుట? అనగా విని వశిష్టుడు - రాజా ! ఈ యోగము తప్పించుట బ్రహ్మేంద్రాదులకు కూడ శక్యము కాదు అని పలికెను.

   అప్పుడు దశరధుడు అతిసాహసుడై ధనుర్బాణములను ధరించి రధమెక్కి సూర్యమండలమునకు పైన నాల్గులక్షల మైళ్ళ దూరమున గల నక్షత్రమండలమందలి రోహిణీ శకటమును దాటి యప్పుడు శని కృత్తికాంతమునుండి రోహిణీ శకటమును ప్రవేశించుచున్నాడని యెఱిగి
కోపముఖము గల శనికెదురుగా నిల్చి మహాస్త్రము విడువగా శని నవ్వి రాజా ! నీ పరాక్రమమునకు మెచ్చితిని. నా దృష్టి సోకినచో దేవగంధర్వసిద్ధసాధ్య విద్యాధరాదులు కూడా నశించెదరు.నీ కిష్టమగు వరమును కోరుకొమ్మనెను.  

 అంత దశరధుడు ఓ మందా ! ప్రపంచముండువరకు నీవు రోహిణిని భేదింపకుము అని కోరగా శని శాశ్వతవరమిచ్చెను. దశరధుడప్పుడు మహానందమును పొంది తనవలన ఇక ద్వాదశవర్ష దుర్భిక్షమెన్నడు రాదు కదా ! అని సంతసించెను. పిదప ధనుస్సు విడచి శనికి నమస్కరించి యిట్లు ప్రార్ధించెను.

  శనైశ్చర ! కోణ ! పింగళ !బభ్రు ! కృష్ణ !రౌద్ర ! అంతక ! యమ ! సౌరి ! మంద ! అను నీ దశనామములు స్తోత్రము చేయువారికి కష్టములు కలుగవు. నీచే పీడితులు కారు. నీవు సంతోషింతివేని రాజ్యమొసగెదవు. కోపగించెదవేని మొదటికే నాశనము చేయుదువు. దేవాసుర నరాదులు, సప్తఋషులు నీచే చూడబడిరేని స్థానభ్రంశము కలిగి దైన్యమొందుదురు. నీ కిదే వందనము ! వరార్ధినై వచ్చితిని. అనుగ్రహింపుము. అనెను.
 
 ఆ స్తోత్రమునకు సంతసించి శని నీ కిష్టమగు వరము కోరుకొమ్మనెను.

   అప్పుడు దశరధుడు ఓ శనైశ్చరా ! గ్రహరాజా ! ఇది మొదలుగా నీవెవ్వరిని బాధింపకుము అనెను. ఆ వాక్యములు విని మందస్మితుడై శని యిట్లనెను. గ్రహము అనగా పట్టునది, పీడించునది. కావున ఎవరీ స్తోత్రమును ఒక  సారియైనను రెండుమారులైనను చదువుదురో వారు నా వలని పీడచే బాధింపబడరు. శ్రావణమాసములోని శనివారమున స్నానపానాదులొనర్చి నల్లని వస్త్రము, నువ్వులు దానమొనర్చుట గాని లేదా తైలాభిషేకము చేయుట గాని జరిగించువారి జోలికి నేను పోను. నా బాధ గల స్త్రీపురుషులీ కధను వినినచో చిక్కుల నుండి దాటించెదను.
 
 నా పూజను భక్తి శ్రద్ధలతో చేయువారిని నావలనను, ఇతర గ్రహముల వలనను గలుగు దుష్ఫలితములనుండి కాపాడెదను. అని పలికిన శని పల్కులకు దశరధుడు సంతోషించి వరద్వయసిద్ధిబొంది తన ఇల్లు చేరెను.

  మా వద్ద  ఒక పుస్తకంలో ఉన్న .. శనిదేవుని వ్రత కధ లో..  కొన్ని విషయములను వ్రాసాను.

 *******************
  పై విషయములను గమనిస్తే,
 తన వద్దకు వచ్చిన దశరధుని పట్ల కోపాన్ని ప్రదర్శించలేదు. దశరధుడు లోకక్షేమం కొరకు తన వద్దకు వచ్చారని తెలిసికొని వరములను అనుగ్రహించారు.
* శనిదేవుడు ఎంతో దయగలవారని తెలుస్తుంది.

 **************
 దశరధుల వారు చేసిన శనిస్తోత్రం గురించి ..అంతర్జాలంలో గానీ , పుస్తకంలోగానీ, లేక ఎవరైనా పండితుల ద్వారా  అడిగి తెలుసుకోవచ్చు.

........

కొన్ని విషయములు ఈ క్రింది లింకుల వద్ద గమనించగలరు..

     shani-6.wmv.flv అనే లింకును..   

Download Video shani-6.wmv.flv - Download MP3-3GP-MP4-FLV (8 ...

   
 అని ఉన్న దగ్గర చూడగలరు.

*******************
వ్రాసిన విషయములలో అచ్చు తప్పుల
వంటివి ఉన్నచో దయచేసి  క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


 

1 comment:

  1. వ్రాసిన విషయాల గురించి తెలియజేసినవారికి, లింకులను అందించిన వారికి కృతజ్ఞతలండి.

    ReplyDelete