koodali

Friday, October 24, 2025

ఏవి నిజాలో ?ఏవి ప్రక్షిప్తాలో? ... కొన్ని విషయములు..

 

ఈ మధ్య ఒక దగ్గర విన్న విషయం గురించి నాకు కొన్ని సందేహాలు కలిగాయి.

 శ్రీరాముల వారు మాంసాహారాన్ని తీసుకున్నారో? లేదో? అనే విషయాల గురించి గొడవలు జరుగుతున్నాయి. 

అయితే, ఈ మధ్యన ఒకరు ఏమన్నారంటే, శ్రీ ఆంజనేయుల వారు లంకకు వెళ్లినప్పుడు  సీతాదేవితో ..శ్రీ రాముల వారు సీతాదేవి మీద బెంగతో మధుమాంసాదులను కూడా తీసుకోవటం లేదని అన్నట్లు.. ఆ శ్లోకాన్ని చెప్పి, అంటే శ్రీరాముల వారు ఇంతకుముందు తింటేనే కదా.. ఇప్పుడు తినటం లేదని హనుమంతుల వారు చెపుతారు..అన్నారు.

ఈ విషయాలను గమనించిన తరువాత నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

  నారదుస్తులను ధరించి కొన్ని నియమాలతో వనవాసానికి వెళ్ళిన శ్రీరాముల వారు నియమాలను పాటించారని నేను ఒకదగ్గర విన్నట్లు గుర్తుంది. 

ఆ విషయాలను గమనించిన తరువాత, వనవాస సమయంలో రాముల వారు ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించారన్నట్లు  నాకు అర్ధమయింది. 

మరి, సీతాదేవి పట్ల బెంగతో శ్రీరాములవారు మధుమాంసాలను తీసుకోవటం లేదని హనుమంతుల వారు సీతాదేవికి చెప్పారంటున్నారు..

మరి ఇంతకుముందు నేను విన్నది సరైనదా? కాదా? నారవస్త్రాలు ధరించి వనవాస నియమాలను పాటించినప్పుడు, మధుమాంసాదుల గురించి నియమాలు ఉన్నాయా? లేవా? అని సందేహాలు కలిగాయి.
 
 కొందరేమో వనవాస సమయంలో వారు ఆహార విషయంలో  కొన్ని నియమాలతో ఉన్నారంటారు. కొందరేమో మాంసాహారాన్ని తిన్నారంటారు..ఏం జరిగిందో దైవానికే తెలుస్తుంది.

ఏమిటో? అప్పుడు ఏం జరిగిందో? గ్రంధాలలో  ఏవి నిజాలో ? ఏవి ప్రక్షిప్తాలో?  
..........

 నాకు ఏమనిపిస్తోందంటే, సంస్కృతంలో  అనేక అర్ధాలుంటాయి...ఒక్క అక్షరాన్ని కలిపి లేక విడదీసి చదివినా అర్ధాలు మారిపోయే అవకాశముంది. అందువల్ల ఆ శ్లోకాన్ని సరిగ్గా ఎలా అర్ధం చేసుకోవాలో మనకు తెలియకపోవచ్చు.

మధు(మధువు) అంటే అనేక అర్ధాలుంటాయి. మాంసం.. అన్నా కూడా అనేక అర్ధాలుంటాయి. 

మాంసం అనే పదానికి బలాన్ని కలిగించే ఆహారం అని కూడా అర్ధం ఉండవచ్చు...పండ్ల రసాలను కూడా మధు.. అని అంటారు కావచ్చు..

వనాల్లో సంవత్సరాల తరబడి ఉన్నప్పుడు సీతాపహరణానికి ముందు,  బలమైన ఆహారం కొరకు కొన్ని పంటలను కూడా వారు పండించుకుని ఉండవచ్చు.

 ఉదా..కొన్ని పప్పుధాన్యాలు పండించుకున్నారేమో? మినుములు(మాష) కూడా మాంసాహారంతో సమానమైన బలమైన ఆహారమని అంటారు. 

 నానబెట్టిన పప్పుధాన్యాలు లేక ఉడికించిన గుగ్గిళ్ళు వంటివి..

నాకు ఏమనిపిస్తోందంటే... అపహరణ తరువాత  సీతాదేవి పట్ల బెంగతో రాముల వారు తన ఆహారం పట్ల  శ్రద్ధ వహించలేదని ...

పువ్వులు, పండ్ల నుంచి లభించే తీపి పదార్ధాన్ని.. పండ్ల రసాలను(మధు..), బలాన్ని కలిగించే మినుముల(మాష) వంటి పప్పుధాన్యాలను  భుజించటం పట్ల.. శ్రద్ధ వహించలేదని అర్ధం చేసుకోవచ్చని.. నాకు అనిపిస్తుంది.


రామాయణం జరిగిన త్రేతా యుగంలో, మనుషులు జీవించే కాలమూ ఇప్పటితో పోలిస్తే చాలా ఎక్కువేనంటారు. అప్పటి కాలంలో వారి ఆకారాలు ఇప్పటివారితో పోలిస్తే భారీగా ఉండేవారంటారు. అప్పట్లో మొక్కలు, చెట్లు కూడా ఆకారాలు భారీగా ఉండేవి కావచ్చు. అప్పట్లో ఇప్పటిలా తేనెటీగల నుంచి నుంచి తేనె సేకరించటం కాకుండా, భారీ పరిమాణంలో తేనె వంటి తీపి పదార్ధం పువ్వులు, పండ్ల నుంచి తేలికగా లభించేది కావచ్చు.  

 వేల సంవత్సరాల క్రిందట విషయాలను గ్రంధాలలో చదివిన వాటిని కొన్నిసార్లు మనం సరిగ్గా తెలుసుకోలేకపోవచ్చు.

............................

 నాకు సంస్కృతం తెలియదు. నేర్చుకోవాలనే  ఆసక్తి కూడా  ప్రస్తుతం లేదు.  నాకు తోచింది రాయాలనిపించి వ్రాసాను. 

అయితే, ఈ విషయాల గురించి నాకు సరిగ్గా అర్ధం కాలేదు. సందేహాలున్నాయి.
..........

అయినా, రాములవారు మాంసాహారాన్ని భుజించారని చెప్పటానికి కొందరు ఎందుకు పదేపదే ప్రయత్నిస్తున్నారో? అర్ధం కావటం లేదు.  

ఇంతవరకు మాంసాహారం తిన్నారని చెప్పారు. ఇప్పుడు మధు.. కూడా స్వీకరించారని అంటున్నారు. 

వారు తిన్నారు కాబట్టి, మనం కూడా తినొచ్చని ప్రజలు ఎవరైనా భావిస్తే? 

మధు ..అంటే మత్తెక్కించే సారా వంటిదని కొందరు భావించే ప్రమాదం కూడా ఉంది. 

మాంసాహారం తినడం తప్పని వేదాలలో చెప్పబడిందని కొందరు చెబుతున్నారు. మద్యాన్ని తీసుకోవటం పంచమహాపాతకాల్లో ఒకటని గ్రంధాలలో ఉందంటున్నారు. వాటిని సమర్ధించటం కూడా పాపమేనట.

మాంసాహారం వల్ల ఎంతో జీవహింస జరుగుతుంది. మద్యపానం వల్ల నేరాలు..ఘోరాలు జరుగుతాయి.

 ..................

అయినా, వనవాస సమయంలో రాముల వారు నార వస్త్రాలను ధరించి నియమాలను పాటించే సమయంలో మధుమాంసాదులను స్వీకరించారని  అందరికి చెప్పాలనుకోవటం ఏమిటో? నాకు అర్ధం కావటం లేదు. 

  గ్రంధాలలో చదివిన వాటిని కొన్నిసార్లు మనం సరిగ్గా తెలుసుకోలేకపోవచ్చు...కొన్ని ప్రక్షిప్తాలు కూడా ఉండొచ్చు. 

ఏది ఎందుకు జరిగిందో.. దైవానికి సరిగ్గా తెలుస్తుంది.

  ..............

 నేను ఈ పోస్టును కొంతసమయం తరువాత డిలిట్ చేస్తానేమో?


 వ్రాసిన వాటిల్లో తప్పులు ఉంటే దయచేసి క్షమించమని  దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

 ..............

 గ్రంధాలలో అర్ధం కాని విషయాలుంటాయి. ఎన్నో ప్రక్షిప్తాలు కూడా ఉంటాయి. 

ఇవన్నీ ఆలోచిస్తూ, వాదిస్తూ సమయాన్ని గడపటం కన్నా, ఇవన్నీ విని గందరగోళం పడటం కన్నా..కొంతవరకు తెలుసుకుని..అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుని మన శక్తికొలది చక్కగా దైవాన్ని ఆరాధించుకోవటం మంచిది.


**********************

క్రింద ఒక కామెంట్ కు నా కామెంట్...

క్షత్రియులు మాంసాహారం తినవచ్చని రాముల వారు తినటంలో తప్పేముందని ..అలా ఒకరు వ్యాఖ్య వ్రాసారు. పొరపాటున ఆ వ్యాఖ్య డిలిట్ అయ్యింది. డిలిట్ అయినందుకు దయచేసి తప్పుగా అనుకోవద్దండి. 


క్షత్రియులైనంత మాత్రాన మాంసాహారం తినితీరాలని ఏమీ ఉండదండి. శాకాహారులు కూడా చాలా శక్తిని కలిగి ఉంటారు. 

అయినా ఇక్కడ, రాముల వారు మాంసాహారం తీసుకునేవారా ? లేదా? అన్న సంగతి వేరే విషయం.

రాములవారు వనవాస సమయంలో నారవస్త్రాలు ధరించి ఎన్నో నియమాలను పాటించారని, ఆ సమయంలో ఆహారవిషయంలో కూడా నియమాలను పాటించారని ఒక దగ్గర విన్నాను.

మరి, నార వస్త్రాలను ధరించి నియమాలతో వనవాసానికి వెళ్ళిన సమయంలో కొందరు భావిస్తున్న విధంగా మాంసాహారాన్ని స్వీకరించారా? అనేది సందేహం.

 ఇంతవరకు మాంసాహారం తిన్నారని చెప్పారు. ఇప్పుడు మధు.. కూడా స్వీకరించారని అంటున్నారు. మధు..అంటే వారి అభిప్రాయం ఏమిటో? అర్ధం కావటం లేదు.

 దైవానికి అన్నీ తెలుసు...అంతా దైవము దయ.

 ***********
వ్యాఖ్యల వద్ద నా పేరుతో నేను వ్రాసే వ్యాఖ్యలు కొంతకాలం నుంచి వెళ్ళటం లేదండి. ఇలాంటప్పుడు నేను వ్యాఖ్యలు వేస్తే, వేరే ఎవరైనా నా పేరుతో నాలాగే anrd అని వ్రాసి తప్పు వ్యాఖ్యలు రాస్తారని అనిపించి వ్యాఖ్యలు రాయటం లేదు.

  ఎక్కువ పోస్టులు, 
వ్యాఖ్యలు..వ్రాయవద్దని ఎప్పటినుండో అనుకుంటున్నాను. కొంతకాలం క్రితమే ఈ విషయాన్ని ఒక పోస్టులో కూడా వ్రాసాను...అందువల్ల, 
వ్యాఖ్యల  విషయాన్ని పట్టించుకోలేదు.
........................

 మాంసాహారం గురించి కొంత వివరంగా ఇంతకుముందు పోస్టులో వ్రాసాను.  ఒక లింక్ ఇస్తాను..మీకు ఆసక్తి ఉంటే మరికొన్ని విషయాలను చదవచ్చు.

LINK..... .....

 పాలు, తేనె వంటివి శాకాహారం ఎలా అవుతాయి?..హింస..అహి. 


 

 

  

No comments:

Post a Comment