ఈ పోస్ట్ లోని విషయములు జనవరిలో వేసిన.. కొన్ని విషయములు ..పోస్టులోని విషయములే. ఆ పోస్ట్ పెద్దగా అవటం వల్ల, కొంతభాగాన్ని తీసి ఇక్కడ వేయటం జరిగిందండి.
....................
టెక్నాలజి అంటూ పోటీలు పడుతున్నారు కొందరు. టెక్నాలజీ కొంతవరకు అవసరమే కానీ, పర్యావరణహిత టెక్నాలజి ఉండాలి. .
ప్రపంచంలో నైతికవిలువలకు హాని కలగని విధమైన టెక్నాలజి వాడకం కావాలి. ఉదా..సెల్ఫోన్ల ద్వారా అశ్లీలచిత్రాలు వంటివి మంచిదికాదు.
............
ప్రపంచంలో మనుషులందరికీ ...ఆహారం, ఇల్లు, విద్య, వైద్యం, రక్షణ....ఇలాంటి కనీస అవసరాలు తీరాలి.
...........
ఒక్క మొక్క నుండి అనేక విత్తనాలు ..ఆ విత్తనాల నుండి అనేక మొక్కలు..ఆ మొక్కల నుండి బోలెడు ఆహారం లభించేలా దైవం సృష్టిని చేసారు. ..
అయినా కూడా, అందరికీ ఆహారం లభించేలా చేసుకోలేకపోతున్నారు.
ఇప్పటికీ ప్రపంచంలో చాలామందికి సరిగ్గా ఆహారం లభించటం లేదు.
కొందరేమో తినటానికి తిండిలేక, డబ్బులేక, ఉపాధిలేక కష్టపడుతున్నారు.
చాలామంది మద్యం, మత్తుమందులకు బానిసలవుతున్నారు.
డబ్బు ఉన్నా కూడా కొందరికి అనేక సమస్యలు ఉంటున్నాయి, చాలామందికి మానసిక ప్రశాంతత ఉండటం లేదు.
ధనిక దేశాలలో కూడా చాలామంది అనేక సమస్యలతో బాధలు పడుతున్నారు.
ప్రపంచంలో ప్రశాంతత లేనప్పుడు ఏం లాభం?
సమాజంలో నేరాలు..ఘోరాలు జరగకుండా ఉండాలి. అందరూ ప్రశాంతంగా బ్రతకాలి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి.
............
మన
దేశాన్ని శుభ్రంగా అందంగా చేసుకోవచ్చు కదా....రోడ్లను శుభ్రంగా చేయటం,
రైల్వేస్టేషన్లు, బస్సు స్టాండ్లు, హాస్పిటల్స్..ఇలాంటి ప్రదేశాలు శుభ్రంగా
ఉంచాలంటే చాలామంది వర్కర్స్ అవసరమవుతారు.
బోలెడు మొక్కలను నాటి,
శుద్ధి చేసిన మురికి నీటిని వాటికి పోయవచ్చు. ఇలాంటివి చేస్తే దేశం
శుభ్రంగా ఉంటుంది. చాలామందికి ఉపాధి లభిస్తుంది. ప్రజలు కూడా పరిసరాలను
శుభ్రంగా ఉంచేలా కఠినచర్యలు తీసుకోవాలి.
గిడ్డంగులలో దాచిన ఆహారదినుసులను పాడవకుండా తక్కువధరకు పేదలకు అందిస్తే అందరికీ ఆహారం లభిస్తుంది. ఇవన్నీ చాలా చేయవచ్చు.
.................
అంతా దైవము దయ.
.....................
కొన్ని పోస్టుల లింక్స్..
ఆసక్తి ఉన్నవారు క్రింద ఉన్న లింక్స్ వద్ద చదవగలరు.
వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. 1 *******
వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్....2 **********
వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. .3 *************
వ్రాసిన కొన్ని పోస్టుల లింక్స్.. ....4 *************