koodali

Wednesday, July 24, 2024

దైవాన్ని గురించి...తోచినట్లు..


శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సుప్రభాతం గురించి ఒకరు..దైవాన్ని నిద్రపుచ్చటం, మేల్కొల్పటం ఏమిటంటూ , ఇంకా కొంత వెటకారంగా మాట్లాడటం జరిగింది.

 దైవాన్ని గురించి ఎవ్వరైనా తమకు తోచినట్లు వేళాకోళంగా మాట్లాడటం సరైనదికాదు. దైవానికి  మేలుకొలుపులు ..అనేవి భక్తులు ప్రేమతో భావించి చేస్తారు.

 

భక్తులు దైవాన్ని ఎన్నో విధాలుగా ఆరాధించుకుంటారు. భక్తితో సేవించుకుంటారు.  నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇవన్నీ  దైవంపట్ల భక్తితో చేస్తారు. అంతేకానీ, దైవానికి ఏమీ తక్కువయ్యి కాదు. సృష్టిలో అన్నీ దైవం సృష్టించినవే.

 

 దైవం ..సృష్టిలో జీవులు బ్రతకటానికి అవసరమైన  నీరు, గాలి, ఆహారం..ఇలా ఎన్నింటినో  సృష్టించారు.

 పిల్లలు తమ చేతులతో ఒక పండును తల్లితండ్రి నోటికి అందించినా తల్లితండ్రి ఎంతో సంబరపడతారు. భక్తులు కూడా భగవంతుని ప్రేమభక్తితో ఆరాధించుకుంటారు. 

............

 ఒక రాజుగారు దైవాన్ని విగ్రహరూపంలో ఆరాధించటం గురించి వేళాకోళంగా మాట్లాడగా, 

 రామకృష్ణపరమహంస  వారి  శిష్యులైన  వివేకానందస్వామి ,  ఆ రాజు యొక్క పెద్దల చిత్రాన్ని చూసి, ఆ చిత్రం పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే రాజుగారు ఎలా ఫీలవుతారని అడిగారట.

 అప్పుడు రాజుగారు కోపంతో తమ పెద్దల చిత్రం పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే శిక్షిస్తామనగా, 

వివేకానందగారు అది చిత్రమేకదా ..అని ప్రశ్నించగా,  రాజుగారికి జ్ఞానోదయమయ్యిందట.

ఈ సంఘటన  గురించిన సంభాషణలు ..జరిగింది జరిగినట్లు నాకు తెలియదు

............

చాలామంది దైవాన్ని నమ్మనివాళ్ళు  కూడా  తమ పెద్దలు, తాము గౌరవించే వారి చిత్రపటాలకు పూలదండలు వేయటం, పూలబొకేలను ఉంచటం,  ఆ ఫోటోలకు నమస్కరించటం చేస్తారు. 

మరణించినవారి ఫోటోలకు అంత మర్యాద ఇస్తున్నప్పుడు, ఎంతో గొప్పవారైన ఆద్యంతములు లేని  దైవాన్ని భక్తులు ప్రేమభక్తితో చక్కగా  ఆరాధించుకుంటే  ,వేళాకోళం  చేయటం సరైనదికాదు.