ఈ రోజుల్లో కొందరు ఏమంటున్నారంటే.....
ఎవరైనా దైవభక్తులు , స్వాములు దేశంలో జరుగుతున్న.........అవినీతి, అన్యాయాలను గురించి మాట్లాడితే ....... వాళ్ళు, భక్తిగురించి తప్ప ఇతరవిషయాలు మాట్లాడటమే తప్పు ........... అన్నట్లు మాట్లాడుతున్నారు.
వారూ ఈ దేశ పౌరులే కదా ! అలాంటప్పుడు వారికీ మాట్లాడే హక్కు ఉంటుంది.
ఈ రోజుల్లో మతం పేరుతో ప్రజలను మోసం చేసే మోసగాళ్ళు ఉన్నమాట నిజమేకానీ .......... అందరూ అలా చెడ్డగా ఉండరు కదా..........
పూర్వం రాజులకు గురువులు ఉండేవారు ........ రాజ్యపాలనలో సలహాలను ఇవ్వటానికి. ఉదా... దేవతలకు ఏదైనా సమస్య వస్తే దేవేంద్రుడు దేవతల గురువైన బృహస్పతిని సలహా అడగటం మనం గ్రంధాలలో చదువుకున్నాము.
దశరధులవారికి వశిష్టులవారు గురువుగా ఎన్నో సలహాలను ఇస్తుండేవారు.
ఇలా వారు రాజ్యరక్షణ విషయంలో, ప్రజల బాగోగుల విషయంలో రాజులకు సలహాలను ఇస్తుండేవారు. రాజులు అవి పాటించేవారు.
రాజులు కూడా తమకు అన్ని విషయములు తెలిసినా గురువులను గౌరవించేవారు. గురువులు కూడ వారికి తమ సహకారాన్ని అందిస్తూ అందరి క్షేమాన్ని కోరుకునేవారు...
ఈ మధ్య కాలంలో చూస్తే........
విజయనగరసామ్రాజ్య స్థాపనలో శ్రీ విద్యారణ్య స్వాముల వారి పాత్ర ఎంత ముఖ్యమయినదో మనకు తెలిసినదే.
శ్రీ సమర్ధ రామదాసులవారు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజుకు గురువుగా ఎన్నో సలహాలను ఇచ్చి ముందుకు నడిపించారు.
ఇంతేకాదు,...............
మన పూర్వ ఋషులు, ఉపనిషత్ ద్రష్టలు దైవభక్తి వల్లనే ఎన్నో వైజ్ఞానిక విషయాలను కనుగొని ప్రపంచానికి అందించారు.
గణితశాస్త్రం, ఆయుర్వేదం, ఖగోళశాస్త్రం, అర్ధశాస్త్రం, జీవశాస్త్రం, రసాయనిక శాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలను ప్రపంచానికి అందించారు.
అప్పుడు అంత గొప్ప ఆధ్యాత్మికవాదులు ఉండేవారు.
ఈ రోజుల్లో కూడా దైవభక్తులైన శాస్త్రవేత్తలు ,మరియు ఇతరులు ఎందరో ఉన్నారు.
ఇంకా,ప్రపంచంలోని సర్వమతప్రజలకోసం తాపత్రయపడే మహానుభావులు ఎందరో ఉన్నారు........,
" ఒక యోగి ఆత్మ కధ " గ్రంధములో మహా గురువులు ప్రపంచంలోని సర్వమతములకు చెందిన ప్రజల బాగోగులకోసం తాపత్రయపడటం స్పష్టంగా తెలుస్తుంది.
ఇంకా,..........
శ్రీ రామకృష్ణులవారు.......వివేకానందులవారి గురించీ మనకు తెలుసు. శ్రీ రామకృష్ణమఠం వారు పేదవారికి ఎంతో సహాయం చేస్తున్నారు.
శ్రీ రామకృష్ణమఠం లో అన్ని మతముల వారికి ప్రవేశం ఉంది.
ఎందుకంటే.......... పేర్లు, వేషభాషలు ఎన్ని రకాలుగా ఉన్నా ........... దైవం ఒక్కరే. ప్రపంచ మానవులందరూ వారి సంతానమే.
దైవభక్తులైన వారు ప్రపంచమంతా శాంతిగా ఉండాలని కోరుకుంటారు. అసలు ప్రతి మనిషికి దైవ భక్తి ఉండటం అవసరం.
అంతేగానీ దైవభక్తులైన వారిని .......... మీకు ఇతరవిషయాలు గురించి ఎందుకు ? అనటం తగనిపని.
**************
mari konni vishayamulu...
కొన్ని గ్రంధాలలో ఇతరమతాల వారి పట్ల స్నేహభావాన్ని ప్రకటించారు. అందరి దైవము ఒక్కరే..అని హిందూ పెద్దవాళ్ళెందరో తెలియజేసారు.
రామకృష్ణమఠంలోకి అన్ని మతాల వారికి ప్రవేశముంది. ఒకయోగి ఆత్మ కధ గ్రంధంలోనూ ఇతార మతాల వారి గురించి ప్రస్తావన ఉంది.
****************
అందరి దైవం ఒక్కరే అన్నది నిజమే కానీ, సమాజంలోని కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి ఉంది.
దైవ శక్తి అందరికీ ఒక్కటే..అని గ్రహించి ఎవరి పద్ధతిలో వారు దైవాన్ని ఆరాధించుకుంటే చాలా బాగుంటుంది. అయితే, అందరూ అలా అనుకోవటం లేదు కదా..ఇతరులను తమ మతాల్లోకి మార్చటానికి కొందరు నయానా, భయానా ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి.
ఏ మతం వారికైనా సుఖాలు, కష్టాలు.. ఉంటాయి. అన్ని మతాల వారు మంచిగా, సుఖంగా జీవించాలన్నది నా అభిప్రాయం.
*******************
ఇతరమతాల వారు చాలా మంది వేరే మతస్తుల వారు పూజించే దైవాన్ని పూజించరు. హిందువులు కొందరు మాత్రం అందరు దేవుళ్ళు ఒకటే.. అంటూ అన్ని మతాల దేవతలను పూజిస్తుంటారు. ఇలా చేయటం వల్ల హిందూమతానికి నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఇతరమతస్తులు కొందరు హిందువులను మతం మార్చటానికి ప్రయత్నిస్తున్నారు.
హిందువులు ఆలోచించుకోవాలి. దేశంలో హిందువుల సంఖ్య తగ్గి హిందువులు మైనారిటీలు అయితే , హిందువుల పరిస్థితి ఏమిటి?
అన్ని మతాల వారు ఎవరి పద్ధతిలో వారు దైవాన్ని ఆరాధించుకుంటూ అందరు స్నేహభావంతో ఉంటే చాలా బాగుంటుంది. అయితే, కొందరు మాత్రం మతాలను మార్చటానికి ప్రయత్నిస్తూ సమాజంలో గొడవలు రావటానికి కారణమవుతున్నారు.
కొందరు హిందువుల వల్ల కూడా సాటి హిందువులకు సమస్యలు వస్తాయి. కొందరు హిందువులు తమకుతోచిన ధోరణిలో ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. అవన్నీ చేయలేక విసుగుతో వేరే మతాలకు వెళ్లాలని అనుకునే వారూ ఉంటారు.
వేరే మతాలకు వెళ్లకపోయినా కూడా, హిందువుగా ఉంటూనే భయాలతో, ఎన్నో అయోమయాలతో జీవితం సాగించే వారూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, హిందువులు కొన్ని విషయాలలో ఉన్న విపరీత ధోరణి తగ్గించుకుని పట్టువిడుపుతో ప్రవర్తించాలి.
మతం పట్ల ప్రజలలో విసుగు, నిరాశానిస్పృహలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు ఏమనిపించిందంటే, ఈ విసుగు పెరిగి ఈ మధ్యకాలంలో మతాలను వదిలివేస్తున్న వారున్నారు.
ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే, హిందువులు ఆచారవ్యవహారాల విషయంలో క్లిష్టత తగ్గించుకుని సరళంగా ఉండేలా పాటించాలి. కలికాలంలో క్లిష్టమైన ఆచారవ్యవహారాలను అందరూ పాటించలేరు. జీవితంలో దైవభక్తికి, ధర్మబద్ధంగా జీవించటానికి అధిక ప్రాముఖ్యతను ఇవ్వాలి.