koodali

Saturday, May 30, 2015

పాజిటివ్ మరియు నెగటివ్ ఆలొచనలు...

  
ఆలోచనలకు  శక్తి ఉంటుందని పెద్దలు తెలియజేసారు.

పాజిటివ్ గా ఆలోచించటం వలన పాజిటివ్ సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పాసిటివ్ గా ఆలోచించటం మంచిదని అంటారు.  నెగటివ్ గా ఆలోచించటం వల్ల నెగటివ్ సంఘటనలు జరిగే అవకాశం ఉందంటారు.

................

అయితే , కొన్నిసార్లు నెగటివ్ ఆలోచన కూడా అవసరమే అనిపిస్తుంది. ( నెగటివ్ ఆలోచన యొక్క ఫలితం పాజిటివ్ గా ఉన్నప్పుడు..)


 ఉదా..ఒక రాజ్యానికి రాజు అయిన వ్యక్తి  నెగటివ్ గా కూడా ఆలోచించవలసి ఉంటుంది.


 రాజ్యం అంటే శత్రువు దాడిచేసే అవకాశాలు ఎప్పుడూ పొంచి  ఉంటాయి కాబట్టి,  రాజ్యరక్షణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే, శత్రువు దాడి చేసినప్పుడు సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగే సత్తా ఉంటుంది.


 అలా కాకుండా... 
అంతా బాగానే ఉంది. లోకంలో అందరూ మంచివారే , రాజ్యంపై ఎవరూ దాడి చేయరు.. అని కేవలం పాజిటివ్ గా ఆలోచించుకుంటూ  రక్షణ ఏర్పాట్లు చేసుకోకుండా తాపీగా కూర్చుంటే శత్రువు దాడిచేసినప్పుడు పరాజయం పొందే అవకాశం ఉంది.

వ్యక్తుల జీవితంలో కూడా  ముందు  జాగ్రత్తలు  తీసుకోవలసిన  సంఘటనలు ఎన్నో ఉంటాయి .  

.................................. 

చెడు కనకూడదు, చెడు వినకూడదు, చెడు అనకూడదు ..అనే విషయం గురించి నాకు ఏమనిపిస్తుందంటే...


 మనకు  చేతనైనంతలో చెడును అడ్డుకోవటానికి  ప్రయత్నించవచ్చు . అయినా  తగిన ఫలితం లేనప్పుడు మాత్రం  సాధ్యమయినంతలో చెడ్డ విషయాలకు దూరంగా ఉండాలి అనిపిస్తుంది.


ఉదా..ఒక వ్యక్తికి చెడు అలవాట్లు లేవనుకోండి. అతని స్నేహితులలో కొందరికి చెడు అలవాట్లు  ఉన్నప్పుడు ,  చెడ్డ అలవాట్లు ఉన్న స్నేహితులతో  ఆ అలవాట్లను మానిపించటానికి ప్రయత్నించ వచ్చు.. 


ఎంత చెప్పినా వాళ్ళు మానకపోతే అలాంటి వాళ్ళతో స్నేహాన్ని మానివేయటం మంచిది. 


అలాంటి వాళ్ళతో  స్నేహాన్ని  కొనసాగిస్తూనే  ఉంటే , చెడ్డ అలవాట్లు లేని వ్యక్తికి కూడా  ఆ చెడ్డ అలవాట్లు అలవాటు అయ్యే ప్రమాదముంది. 


ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ...  చెడు కనవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు..అని పెద్దలు తెలియజేసారు  కానీ, 


.  సమాజంలో  చెడు విషయాలు  జరుగుతున్నా కూడా  పట్టించుకోకుండా,  తప్పించుకుని   ఎవరి మానాన వాళ్ళు బ్రతకాలని పెద్దల ఉద్దేశం కాదు .. అనిపిస్తుంది.


సమాజంలో తప్పులు జరుగుతుంటే అడ్దుకోకుండా  చూస్తూ ఊరుకోవటం కూడా తప్పేనని పెద్దలు తెలియజేసారు.

..........................

 (అయితే, సమాజంలోని  చెడ్డ వాళ్ళ మధ్య ఉన్నాకూడా .. దృఢమైన దైవభక్తి, ఆత్మ బలం ఉన్న వ్యక్తులు  చెడిపోరు.)

......................... 

.వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను . 



3 comments:

  1. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

    మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ ప్రచారం చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవిచేసుకొంటున్నాము.

    సాయి రామ్ సేవక బృందం,
    తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
    సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
    * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

    ReplyDelete

  2. మీకు కూడా నమస్కారమండి.

    మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నాకు తెలిసిన విషయాలు తక్కువ. తెలిసినంతలో వ్రాస్తున్నాను. అంతా దైవం దయ.

    మీరు ఇచ్చిన లింక్ చూసానండి. చాలా బాగుంది.

    నా బ్లాగును కూడా చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

    సాయి సాయి.

    ReplyDelete
  3. పైన వ్రాసిన టపాకు మరికొన్ని విషయాలను జోడించాలనిపించి వ్యాఖ్య ద్వారా వ్రాస్తున్నాను.
    ............
    దైవం.. దుష్టశిక్షణను, శిష్టరక్షణను చేస్తారు. లోకక్షేమం కొరకు..అమ్మవారు ఎందరో రాక్షసులను సంహరించటం, శివుడు గరళాన్ని తన కంఠంలో నిలిపి ఉంచటం, విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ధరించి ఎందరో రాక్షసులను, రాక్షస ప్రవృత్తి గలవాళ్లను సంహరించటం జరుగుతోంది.
    ................
    సమాజంలో చెడును సంస్కరించటం కోసం ఎందరో మహనీయులు భువిపై జన్మలను ధరించారు.
    ...............

    మానవసేవే మాధవసేవ అంటారు. అయితే, దైవపూజ వల్ల మానవులకే కాకుండా సమస్త పశుపక్ష్యాదులకు, ప్రపంచం అంతటికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంది.
    .................

    కొందరు మహనీయులు సమాజానికి దూరంగా కొండల్లో, గుట్టల్లో తపస్సులో ఉన్నాకూడా తాము సాధించిన తపశ్శక్తిలో కొంత భాగాన్ని సమాజం బాగు కోసం ఉపయోగిస్తారు.
    ................
    సంసారంలో ఉంటూనే అధర్మంపై పోరాటాన్ని చేసిన వాళ్లూ ఎందరో ఉన్నారు.
    ......................
    సంసారంలో ఉంటూ స్వధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ నిష్కామంగా జీవితాన్ని గడిపిన వాళ్ళలో జనకమహారాజు ఒకరు.
    ..................
    సమాజంలో మంచి పెరగాలంటే చెడును పారద్రోలాలి. మంచిగా ప్రవర్తించే వాళ్ళ సంఖ్య పెరగాలి.

    సమాజంలో మంచి పెరగాలంటే లోకంలోని చెడు శక్తి తగ్గి, మంచి శక్తి పెరగాలి.

    ReplyDelete