koodali

Friday, September 28, 2012

కొన్ని విషయాలు మరియు జీవవైవిధ్యం....

అంతర్జాతీయ  జీవ  వైవిధ్య  సదస్సు  మన  దేశంలో  జరగటం    సంతోషకరమైన  విషయం.

ప్రపంచంలో   ఎన్నో  జీవజాతులు   అంతరించి   పోతున్నాయంటున్నారు.  కొంతకాలం  క్రిందట  ఇళ్ళలో  పిచ్చుకలు  వంటివి  కనిపించేవి.  ఇప్పుడు  అంతగా  కనిపించటం  లేదు.  పెరిగిన  కాలుష్యం  వల్ల  వాటి  సంఖ్య  తగ్గిపోతోందట .


ఈ  మధ్య  మేము  కురువపురం  వెళ్ళినప్పుడు  అక్కడ  దేవాలయం  వద్ద  పిచ్చుకలు,  ఇంకా  ఇతర  పక్షుల    కిలాకిలారావాలతో  ఆ  ప్రదేశం  ఎంతో  ఆహ్లాదకరంగా  ఉంది.


కాలుష్యం  వల్ల  పశుపక్ష్యాదులకు  ముప్పు  కలుగుతుంటే  ఆ  కాలుష్యం   వల్ల   మనుషులకు  కూడా  ముప్పు  పొంచి  ఉన్నట్లే  కదా  !     ఇప్పటి నుంచైనా  తగు  జాగ్రత్తలు  తీసుకోకపోతే  అంతరించే  జాతుల్లో  మానవజాతి  కూడా  ఉంటుంది.


మనం  వాడే  రసాయనాలు    గాలిలో,   భూమిలో ,  నీటిలో  కలిసి ....  తిరిగి    ఆహారం  ద్వారా  మనలో  ప్రవేశించటం  వల్ల  ఎంతో  అనారోగ్యం  కలుగుతుంది.  ఇప్పుడు  మనుషులు  ప్రకృతికి  దూరంగా  వెళ్తూ  అదే    అభివృద్ధి   అని  భ్రమిస్తున్నారు. 


మనుషులకు  కోరికలు  ఎక్కువై,    తమకు  ఏం  కావాలో  తెలియని  అయోమయ  పరిస్థితి  ప్రస్తుతం  ప్రపంచంలో  నెలకొని    ఉంది.  ఎందుకో,  ఏమిటో  తెలియని  పోటీతో   ప్రపంచదేశాలు  పరిగెడుతున్నాయి.  


ఈ  పోటీని  అభివృద్ధి   అని  కొందరు   అపోహపడుతున్నారు.

 అయితే,   ఈ  పోటీ    సహజ  వనరులను  వేగంగా  వాడే  విషయంలో  జరుగుతున్న  పోటీ  అని  చెప్పుకోవచ్చు. 


 సహజవనరులు   ప్రకృతిలో   ఏర్పడాలంటే  వేల,  లక్షల  సంవత్సరాల  కాలం  పడుతుంది.  కానీ,  వాటిని  వాడేయటం  తేలిక.  గత  కొద్ది  సంవత్సరాల  కాలంలో  విపరీతమైన    వాడకం  వల్ల   బొగ్గు,  వంటి  ఇంధన  వనరులు  ఖాళీ  అయ్యే  పరిస్థితి  వచ్చింది.



  ఎన్నో  ఖనిజవనరులు  కూడా     వేగంగా  తరిగిపోతున్నాయి.  ఇవన్నీ  అయిపోయాక   ప్రపంచదేశాల  మధ్య  ఇక  పోటీయే  ఉండదు.

 (  అప్పటికి  మానవజాతి   అంతరించకుండా  మిగిలి  ఉంటే..  )

  మన  పూర్వీకులు  ఇంతలా  ఖనిజాలను  వాడినట్లయితే  మనకు  ఇప్పుడు  ఒక  చెంబు  గానీ,  తప్పేలా  గానీ  తయారుచేసుకోవటానికి  ఖనిజపదార్ధమే  ఉండేది   కాదు.  పాపం  వాళ్ళు  మనలా  విపరీతమైన  కోరికలు   కలవాళ్ళు  కాదు  కాబట్టి,  మనం  ఇంకా   వస్తువులను  వాడుకోగలుగుతున్నాము.  


వస్తువులు  తయారు  కావాలంటే  ఇనుము,  బాక్సైట్ ...... వంటి   పదార్ధాలు  కావాలి  కదా  మరి......పారిశ్రామిక  అభివృద్ధి  అంటూ  ఇలాగే   ఖనిజాలని    తవ్వుకుంటూ   పోతే    రాబోయే  తరాల వారికి  ఖనిజాలే  మిగలవు.  


ఇప్పుడు   ప్రపంచ  దేశాల  వద్ద  అంతగా  డబ్బు  లేకపోయినా  ,  పేదరికం,  నిరుద్యోగం,  ఆర్ధికమాంద్యంతో  సతమతమవుతున్నా   కూడా   , విపరీతమైన  .... ఆయుధపోటీలు,  అంతరిక్ష 
పోటీలు..  కొనసాగుతూనే  ఉన్నాయి.

ఈ  మధ్యే  అంగారకయాత్ర  కూడా  జరిగింది  కదా  !
  అంగారకుడు.. వరాహస్వరూపుడైన విష్ణు మూర్తికి  భూదేవికి  కలిగిన   పుత్రుడని 
పూర్వీకులు  చెప్పటం  జరిగింది.

   భూమిపై  ధ్రువప్రాంతాల  వద్ద    వాతావరణంలోనే   మనుషులు    ఉండలేరు. .  ఇక  ఇతరగ్రహాలకు  వెళ్ళి  అక్కడ   బాగు  చేసుకుని  స్థిరపడటం  జరిగేపనేనా  ?    దీనికయ్యే  అంతులేని  డబ్బుతో   భూమిపై  పేదరికాన్ని  పోగొట్టవచ్చు.    


భూమిపై   ఉన్న  ధృవప్రాంతాల్లో  నివాసాలు  గట్రా  ఏర్పాటు   చేస్తే  మాత్రం  అక్కడ   వేడి   పెరుగుతుంది.   


అప్పుడు    అక్కడి  మంచు  కరిగి ,   సముద్రపు  నీటి  మట్టాలు  ఒకటి  లేక  రెండు  అంగుళాలు  పెరిగినా  కూడా  భూమిపైన  ఎన్నో  ప్రాంతాలు,  నగరాలు  మునిగిపోతాయట.  కనుక  ధృవ  ప్రాంతాలకు    వెళ్ళకపోవటమే  మంచిది. 

 మనుషుల్లో ,  వస్తువులపై 
పెరిగిపోయిన   మోజు  వల్లే  ఇన్ని  సమస్యలు    వస్తున్నాయి.  మన  పూర్వీకులు   ఇన్ని  వస్తువులు  లేకపోయినా  చక్కగా  జీవించారు. 

ఇవన్నీ  ఆలోచిస్తే,   భూమిపై  ప్రాణికోటి  మిగిలి  చక్కగా  జీవించాలంటే   మనుషులు  తమ  కోరికలను  తగ్గించుకోక  తప్పదు.


  పారిశ్రామిక  కాలుష్యాల  వల్ల    పర్యావరణానికి  ఎంతో    హాని  కలుగుతోంటే,  భక్తి  పేరుతో  కూడా  కొందరు  పర్యావరణానికి  చేటు  తెస్తున్నారు.  


  పూర్వీకులు,   వినాయకచవితి  పండుగలో  పర్యావరణానికి  మేలు  చేసే  చక్కటి   ఆచారాలను  ఏర్పాటు  చేసారు.

  వానాకాలంలో   ఔషధీయుక్తమైన  పత్రితో  దైవాన్ని  పూజించటం  ,  తరువాత  ఔషధీయుక్తమైన   పత్రితో  సహా  మట్టితో  చేసిన   వినాయకుని  ప్రతిమలను  నీటిలో   నిమజ్జనం  చేయటం  వల్ల   నీటిలో  ఉన్న  చెడు  బాక్టీరియా  నశిస్తుంది.   ఆ  నీటిని  వాడే  ప్రజల  ఆరోగ్యం  చక్కగా    ఉంటుంది.


   పత్రిని   సేకరించటం  ,  పూజ  చేయటం  వల్ల  ఆ  పత్రి  యొక్క   ఔషధీకరణ  గుణాలు  వంటి  విషయాల  గురించిన  వివరాలు    పిల్లలకు  తెలిసేవి. 


అయితే ,  ఇప్పుడు  వినాయక  చవితికి  పత్రి  కన్నా  , రసాయన  రంగులను  వేసిన  విగ్రహాలను  నీటిలో  కలపటం  వల్ల  నీరు  కలుషితం  అవుతోంది.  రసాయన  రంగులను  వాడవద్దని    ఎందరో  చెబుతున్నా  కూడా ,  ప్రజలు  ఎందుకు  పట్టించుకోవటం  లేదో  అర్ధం  కావటం  లేదు.


మనుషులు  తమ  స్వార్ధాన్ని  తగ్గించుకుని  ఇతరజీవులను  కూడా  బ్రతకనిస్తేనే  దైవ  కృప  లభిస్తుంది.




Wednesday, September 26, 2012

ఒకసారి త్రిమూర్తులు మణిద్వీపానికి వెళ్ళి..కొన్ని విషయములు...


ఓం.

  కొందరు  ఏమంటారంటే,  సృష్టిలో   మొదట  ఏకకణ జీవులు, తరువాత   బహుకణ జీవులు, తరువాత పక్షులు,  జంతువులు,  మనుషులు  ఇలా .... క్రమంగా  తెలివితేటలు  యాదృచ్ఛికంగా    పెరగటం  జరిగింది , 


కాబట్టి,    మనుషులే  విశ్వంలో  గొప్పవారు  అంటారు.   మళ్ళీ  ఇతరగ్రహాలలో  మనకన్నా  తెలివిగలవారు  ఉన్నట్లు  సంకేతాలు  అందుతున్నాయి.   అనీ   అంటారు.

అయితే,  మనిషి   పుట్టుక  కంటే  ముందే  విశ్వంలో  సూర్యచంద్రులు, వాతావరణం,   గాలి,   నీరు ,   భూమికి  గురుత్వాకర్షణ  శక్తి  .....వంటివన్నీ  ఉన్నాయి.


మరి ,
మనిషి  కన్నా  ముందే  జీవుల  మనుగడకు   అవసరమైన  ఇవన్నీ  జీవులకోసం  అమర్చిందెవరు  ?  ఇంకెవరు  దైవం. 

ఈ  జగన్నాటకం  సాగటానికి  వీలుగా  ఎంతో  పద్ధతిగా  ఇవన్నీ  ఏర్పాటు  చేయబడ్డాయి. 

..................

ఒకసారి  త్రిమూర్తులు  మణిద్వీపానికి  వెళ్ళి  పరమాత్మ  అయిన  ఆదిపరాశక్తిని  దర్శించి  స్తుతించారు. 

అప్పుడు  బ్రహ్మదేవుడు..అమ్మా! నాదొక  చిన్న సందేహం ..అంటూ..


..ఏకమేవాద్వితీయం బ్రహ్మ. అని  కదా  వేదాలు  చెబుతున్నాయి.  అది  నువ్వా,  లేక  నీ  విభుడైన  పరాత్పర  మహాపురుషుడా  ?....  అని  ఎన్నో  విషయములను  అడుగగా.........

చతుర్ముఖా!  నాకూ నా  పురుషుడికి  భేదం  లేదు. ఎప్పుడూ  ఏకత్వమే.  అతడే  నేను. నేనే  అతడు.  భేదం  మతి  విభ్రమం. మా మధ్య  ఉన్న సూక్ష్మమైన   అంతరాన్ని  తెలుసుకున్నవాడు  నిస్సంశయంగా  సంసార విముక్తుడు.  బ్రహ్మం ఎప్పుడు  ఏకమే.  అద్వితీయమే.  ఏకమేవాద్వితీయం  బ్రహ్మ. సందేహం   లేదు.  కానీ సృజన  సమయంలో  ద్వైత  భావాన్ని  పొందుతుంది.  ఒకటే  దీపం  ఉపాధి  యోగం  వల్ల  రెండు  అయినట్టూ ,  నీడయే  అద్దంలో  పడి  ప్రతిబింబమైనట్టూ  మేము  ద్విధాత్వం  (  ద్వైత  భావం  )  పొందుతూంటాం. ......అంటూ ....పరమాత్మ  అయిన  ఆదిపరాశక్తి ,....   ఇంకా  ఎన్నో  విషయాలను  చెప్పటం  జరిగింది.

అలా  ఎన్నో  విషయాలను  బోధించి...త్రిమూర్తులతో....


.....విషమపరిస్థితి  ఏదైనా  ఎదురైనప్పుడు  నన్ను  స్మరించండి.  స్మరణ  మాత్రం  చేతనే  నేను  మీకు  దర్శనం  అనుగ్రహిస్తాను.  అలాగే  సనాతనుడైన  పరమాత్మను  కూడా  తలుచుకోండి.   మా  ఇద్దరినీ  తలుచుకుంటే  మీకు  కార్యసిద్ధి  నిస్సంశయంగా  కలుగుతుంది......... అని  కూడా  అభయప్రదానాన్ని  చేయటం  జరిగింది.


 ........................
  భూమిపైన  జీవుల   పుట్టుక  కంటే  ముందే    సూర్యచంద్రులు,   గాలి, నీరు ,   వాతావరణం,    భూమికి  గురుత్వాకర్షణ  శక్తి  .....వంటివన్నీ  ఉన్నాయి.  

మనిషి  కన్నా  ముందే  ఇవన్నీ  ఏర్పాటు  చేయబడి  ఉన్నాయి  అంటే ,   ఎంతో  గొప్ప  ఆలోచనాశక్తి  గల  శక్తి  ఎప్పుడూ   ఉన్నట్లు  స్పష్టంగా  తెలుస్తోంది.    ఇవన్నీ  జీవులకోసం  అమర్చిన  ఆ  శక్తినే  ఆస్తికులు  దైవం  అంటారు. 

 ఇవన్నీ  గమనిస్తే  సృష్టికి   కర్త    దైవం .... అని  స్పష్టంగా  తెలుస్తోంది.


  ఇక, ఆదిఅంతము  లేని  దైవం ,వంటి  విషయాల  గురించి  జగన్మాతాపితరులైన  పరమాత్మ ఆదిపరాశక్తికే  తెలుస్తాయి. 


 జగన్మాతా  పితరులైన   పరమాత్మ ఆదిపరాశక్తికి   అనేక  వందనములు.

వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.




Monday, September 24, 2012

ఆద్యంతములు లేని దైవం ఈ విశ్వాన్ని సృష్టించారు.

ఓం 

శ్రీ  వీరబ్రహ్మేంద్రస్వామి  వారు  అనేక  విషయాలను  తెలియజేసారు.   పిండం  యొక్క  అభివృద్ధి    వంటి  విషయములను  కూడా    చక్కగా  తెలియజేసారు.    పెద్దలు  తెలియజేసిన  విషయాలను,  వారి  విజ్ఞానాన్ని    గమనిస్తే   ఎంతో  ఆశ్చర్యంగా  ఉంటుంది. 


పెద్దలు  ఇంకా  ఎన్నో  విషయాలను  మనకు  తెలియజేసారు.


ఆధ్యాత్మికవాదులు,  ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పేదాని  ప్రకారం    ...... పదార్ధాన్ని   శక్తిని   సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని ,   తెలుస్తోంది  కదా  !     ఇవన్నీ  రూపాలను  మార్చుకున్నా    కూడా   ఎప్పుడూ  విశ్వంలో   ఉంటాయని  తెలుస్తోంది.


అంటే ,  ఆద్యంతములు   లేని  ఒక  మహాశక్తి   ఎప్పుడూ   నిత్యంగా    ఉంటుందని  మనకు  తెలుస్తోంది.  ఈ  శక్తి  ఊహాతీతమైన  అద్భుతమైన  ఆలోచనా  శక్తి  కూడా  ఉన్న  శక్తి. (  ఆలోచన  కూడా  ఒక  శక్తే  కాబట్టి..  ) అన్ని  శక్తులూ  కలబోసిన   ఈ మహా శక్తినే  ఆస్తికులు  దైవం  అని  భావిస్తారు. 


ఈ  మహా శక్తి  తన  సంకల్ప మాత్రం  చేతనే  విశ్వాన్ని  సృష్టించటం  జరిగింది.  ఈ  సృష్టిలో  అణువణువునా  సృష్టికర్త  అయిన  దైవం  ఉనికి  ఉంటుందట. 

...................
మనం  ఒక  పని  చెయ్యాలంటే  ఎంతో  ఆలోచించి  చేయవలసి  వస్తుంది.     ఇంత  పద్ధతిగా  ప్రపంచం  ఏర్పడిందంటే  దాని  వెనుక  ఎంతో  ఆలోచన   తప్పక  ఉంటుంది..... ఉండాలి  కూడా...  

  ఆలోచన  లేనప్పుడు  ఇంత  చక్కటి  సృష్టి  ఎలా  సాధ్యం  ?  అసలు   ఆలోచన  లేనిదే  ఏ  పనైనా  ఎలా  చేయగలం  ? 

కొందరు  భావిస్తున్నట్లు  ఆలోచన  అనేది  లేకుండా  యాధృచ్చికంగా  సృష్టి   జరగటం  అనే  దానికి  అర్ధం  ఏమిటి  ?  

నిర్జీవమైన , ఆలోచనలేని స్థితిలో యాధృచ్చికంగా సృష్టి ఎలా జరుగుతుంది ?    అది  సాధ్యం  కాని  విషయం.


  సృష్టిలో  ఆది  నుంచి  ఆలోచన  ఉంది.  అందుకే  దైవం  ఈ  సృష్టిని  తన  సంకల్పమాత్రం  చేతనే  సృష్టించారు....  అని  పెద్దలు  చెప్పి   ఉంటారు. 


 ఒక్క  వాక్యంలో   నా  అభిప్రాయం  ఏమిటంటే,     ఆద్యంతములు   లేని    దైవం   ఈ  విశ్వాన్ని  సృష్టించారు.

......................................

ఈ  విశ్వంలో  భూమి  ఒక  చిన్న  ప్రదేశం  మాత్రమే.  భూమిపై  ఉన్న  మనకు  తెలిసిన  విషయాలు  అత్యల్పం.  ఇతరలోకాల్లో ,  కేవలం  సంకల్పమాత్రం  చేతనే , ఎన్నో   పనులను  చేయగల  జీవులు  కూడా   ఉంటారట.  


 వారు   తమ  సంకల్పమాత్రం  చేతనే  తాము  కోరుకున్న  రూపాన్ని పొందగలగటం,    తమ  రూపాలను   తాము  కోరుకున్నట్లు  మార్చుకోవటం  వంటివి  కూడా   చేయగలరట.   వారే  అలా  చేయగలిగినప్పుడు    విశ్వం  లోని  అన్ని  లోకాలకు   సృష్టికర్త  అయిన  దైవం  తమ   సంకల్పమాత్రం  చేతనే  ఏమైనా  చేయగల  సమర్ధులు.


...............................
సంకల్పబలంతో  అసాధ్యాలు  చేయగలగటం  అనే  విషయాన్ని    కొందరు  ఒప్పుకోరు.  కానీ,   ఈ  రోజుల్లో  కూడా  మనం  చూస్తున్నాము.  కొందరు  తమ  సంకల్పబలం  చేత  ఎన్నో  అసాధ్యాలను  సాధ్యం  చేసి  చూపిస్తున్నారు.

  జుట్టుతో,  పళ్ళతో   లారీలను,  విమానాలను  లాగి  చూపిస్తున్నారు.  ఇవన్నీ  ఆధునిక  విజ్ఞానానికి  అంతుచిక్కని  విషయాలే.  ఏ  శక్తితో  వాళ్ళు  అలా  చేయగలుగుతున్నారు  ? 


 ఇలాంటి  చిత్ర విచిత్రాలెన్నో   ఈ  రోజుల్లో  కూడా    ప్రపంచంలో  జరుగుతున్నాయి.
........................

నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  మన   శరీరం  ఎలా  పనిచేస్తుందో   మనకు  పూర్తిగా  తెలియదు.  అంతెందుకు.. మన  మనస్సు    ఎలా  పనిచేస్తుందో  మనకు  పూర్తిగా  తెలియదు. 


ఇక  విశ్వ  రహస్యాల  గురించి,  దైవ  రహస్యాల  గురించి  మనకు  పూర్తిగా  ఎలా  తెలుస్తుంది  ? అతి కొద్దిగా  తెలిసినా  ఇతరులకు  అర్ధమయ్యేటట్లు  వివరించటం  కొన్నిసార్లు  చేతకాదు.

  మనం  తినే  వస్తువు  రుచిని  ఇతరులకు  వివరించటం  సాధ్యం  కాదు  కదా  !  వస్తువు  రుచి  తెలియాలంటే  ఆ  వస్తువును  తామూ   రుచి   చూడాలి .


అలాగే  కొన్ని  ఆధ్యాత్మిక    విషయాలను  వివరంగా   తెలుసుకోవాలంటే  ఎవరికి  వారు  ప్రయత్నించి   తెలుసుకోవాల్సిందే.  ( ఉదా.... ధ్యానం  వంటి  విషయాల  ద్వారా...). గురువుల  ద్వారా   తెలుసుకోవచ్చు .

......................................

  కొందరు  మహానుభావులు   ఆధ్యాత్మిక విషయాలను  ఇతరులకు  చక్కగా  వివరించగలరు.  
ఉదా... అష్టావక్ర  మహర్షి    జనకమహారాజుకు   ఆధ్యాత్మిక విషయాలను    తెలియజేసిన  విధానం  అద్భుతమైనది.


Friday, September 21, 2012

హేతుబద్ధత...........


టీవీలో  ఒక  వినోదకార్యక్రమం  వస్తోంది. 


 ఆ  కార్యక్రమంలో  .....  కొన్ని  రోబోట్లు  తీరికవేళలో  కబుర్లు  చెప్పుకుంటున్నాయి. 

 ఒక  రోబోట్ , సాలోచనగా  ....  మనల్ని  సృష్టించినదెవరో  అంతుపట్టటం  లేదు.... అన్నది.


 ఇంకో  రోబోట్ ,....  మనల్ని  ఎవరూ  సృష్టించలేదు.  సృష్టికర్త  అంటూ  ఎవరూ  లేరు.  మనకు   మనమే  యాదృచ్ఛికంగా    జన్మించాము.  అన్నది.


ఈ  విషయం  మీద  రోబోట్లన్నీ  రెండువర్గాలుగా  విడిపోయాయి.   రోబోట్ల  వాదనలతో   అక్కడంతా   గోలగోలగా  తయారయింది.   


వేరే  గదిలో  కూర్చుని   , స్క్రీన్   మీద    రోబోట్ల  వాదనలను  గమనిస్తున్న ,   ఈ  రోబోట్లను     సృష్టించిన  శాస్త్రవేత్తలు  వినోదంగా   నవ్వుకున్నారు. 


 
వినోదకార్యక్రమం  సంగతి   అలా   ఉంచితే....

   దైవం, జీవులు.....శాస్త్రవేత్తలు , రోబోట్ల    పోలికలో   చాలా     తేడాలు   ఉన్నాయి. 
................
 
ఆస్తికులు  సృష్టిని  సృష్టించినది  దైవం  అని  భావిస్తారు.   నాస్తికులు  సృష్టి  యాదృచ్చికంగా  దానికదే   సృష్టించబడిందని   అంటారు. 


 ప్రతి  విషయంలోనూ   హేతుబద్ధంగా  ఆలోచించాలి  అని  వాదించే  భౌతికవాదులు  ,  సృష్టి  యాదృచ్ఛికంగా  దానికదే   ఏర్పడిందని  అనటంలో  హేతుబద్ధత  ?

యాదృచ్ఛికం  అనటం  కన్నా,  దైవమనే  మహాశక్తి  వల్లే  సృష్టి  ఏర్పడిందనటంలోనే  హేతుబద్ధత  ఉంది. 


 ఒక  రోబోట్    యొక్క  విడిభాగాలను  దూరంగా  విసిరేసి  ఒక  సంవత్సరం  గడిచిన  తరువాత  చూసినా,  ఆ  విడిభాగాలు  అలాగే  ఉంటాయికానీ,  వాటికవే  కలిసి  రోబోట్  గా  తయారవదు  కదా  !  ఎవరైనా  వ్యక్తి  ఆ  విడిభాగాలను  కలిపితేనే   రోబోట్  తయారవుతుంది.  


చిన్న  రోబోట్  విషయంలోనే  ఇలా  ఉంటే  ఇంత  గొప్ప  సృష్టి,    సృష్టి  కర్త  లేకుండా  దానికదే  యాదృచ్ఛికంగా  ఎలా  ఏర్పడుతుంది ?  అదీ  ఇంత  పద్ధతిగా....  చక్కటి  ప్రణాళిక  ప్రకారం....  



..గాలిలో  ఎగిరే  పక్షులకు  తేలికైన  రెక్కలు  ఉండటం,  నీటిలో  చేపలకు  ఈదటానికి  తగ్గట్లు  శరీరం  ఉండటం,  అతి  చిన్న  చీమకు  ఉండే  శ్రమశక్తి,     గతితప్పకుండా  వచ్చే  సూర్యచంద్రులు,  వాటివల్ల జీవించే  మొక్కలు,  భూమికి  గల  గురుత్వాకర్షణ  శక్తి .... 


..ఇంత   గొప్ప  
సృష్టి   దానికదే     యాదృచ్ఛికంగా  ఏర్పడిందని  అనటం  హేతుబద్ధత  అనిపించుకోదు.
 

ఈ బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న   అందరికి    అనేక    కృతజ్నతలండి .
 ............

Wednesday, September 19, 2012

ఓం....


* అందరికి వినాయక  చవితి శుభాకాంక్షలండి .

* శ్రీ గణేశ స్తుతి.

 
శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే..


 
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంపాదికి

దోషభేదికి బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి

మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్

మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్.


 
* ఫలం: సర్వపాపనాశనం - సర్వ విఘ్ననాశనం-

  సర్వ వాంఛాఫలసిద్ధి.

* అచ్చుతప్పులు  వంటివి   ఏమైనా  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. 



Monday, September 17, 2012

మన మనస్సే మనం చెప్పినట్లు నడుచుకోనప్పుడు , ఇతరులు మనం చెప్పినట్లు నడుచుకోవటం లేదని ..........


సృష్టిలో మనకు అర్ధం కాని విషయాలు అనంతంగా ఉన్నాయి.

రమణ మహర్షుల వారు " నేను " అంటే ఏమిటి అని విచారణ చెయ్యమని చెప్పారట.

మనం మనకే అర్ధం కాము.

మన మనస్సు, మన శరీరం ....ఇవన్నీ కలిపి నేను అని భావిస్తూ ,..


  ఈ " నేను " కోసం , ఎంతో తాపత్రయపడిపోతాము.

చిత్రమేమిటంటే మన మనస్సు గురించి కానీ, మన శరీరంగురించి కానీ మనకు ఏమీ తెలియదు.,

తెలుసుకోవాలన్నా మనకి ఏమీ అర్ధం కాదు.

మన మనస్సు మనదే అనుకుంటాము కానీ ,

మరి మన మనస్సు మనం చెప్పినట్లు ఎందుకు వినదన్నది ఎంత ఆలోచించినా అర్ధం కాదు.

మన మనస్సే మనం చెప్పినట్లు నడుచుకోనప్పుడు , ఇతరులు మనం చెప్పినట్లు నడుచుకోవటం లేదని వాళ్ళను నిందించటం అనవసరం.

నా మనస్సు, నా మనస్సు ....అని నేను తాపత్రయపడటమే కానీ, దానికి అలాంటి మొహమాటమేమీ ఉన్నట్లు కనిపించదు.

మనం ఏపనైతే చెయ్యకూడదు అనుకుంటామో,  మన మనస్సు ఆ పనే చెయ్యాలని ఒకోసారి మొండికేస్తుంది.

దీనిని అదుపులో పెట్టటం చాలా కష్టం.  చాలాసార్లు ఈ మనస్సును అదుపులో పెట్టలేక నేను ఎంత నరకాన్ని అనుభవించానంటే ,

నాకు అనిపిస్తుంది, చెరకు గడలు యంత్రంలో నలిగేటప్పుడు అనుభవించే బాధ ఇలాగే ఉంటుందేమో ! అని.

అందుకే ఎంత ప్రయత్నించినా మన మనస్సు మన మాట వినకపోతే, భగవంతుని శరణు వేడాలి అని పెద్దలు చెబుతారు.


అయితే పడ్డవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు.

మట్టి కూజా కాలితేనే కదా గట్టి కూజా తయారయ్యేది.

గొంగళిపురుగు దశ తరువాతే అందమైన సీతాకోక చిలుక దశ వస్తుంది.

అలాగని నేనేదో సీతాకోకచిలుక దశకు వచ్చేశానని కాదు.

కష్టాలు వచ్చినప్పుడు ఎవరూ కూడా గాభరాపడకుండా ఉండాలి అని చెబుతున్నాను అంతే . .

కష్టాలు సుఖాల కొరకే.

కష్టాల వల్ల పూర్వపాపం ఖర్చయిపోతుంది. సుఖాలవల్ల పూర్వపుణ్యం ఖర్చయిపోతుందని పెద్దలు చెప్పారు కదా!

అయితే నా మనస్సు అంటే నాకు ఇష్టమే. దైవప్రార్ధన చేయాలంటే దాని సహాయం కూడా అవసరమే కదా !

అంతా దైవం దయ.

ఇక శరీరం .......దానిగురించి మాత్రం మనకేం తెలుసు.?

ఇలా ఆలోచించగా .... ఏం తెలుస్తుందంటే మన మనస్సు, శరీరం వేటిపైనా మనకు    అంతగా అడ్డూ, అదుపు, అధికారం .. లేవని అర్ధమవుతుంది.

మన శరీరంలో మనం శ్వాస తీసుకునే ప్రక్రియ కూడా మన ప్రమేయం లేకుండానే జరిగేటట్లు ముందే ఏర్పాటు చేయబడి ఉంది.

అందుకే కదా మనం నిద్రపోతున్నప్పుడు కూడా శ్వాస ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది.

ఎంత అద్భుతమైన దైవసృష్టో కదా ! అనిపిస్తుంది.

మన శరీరం అనబడేది ఆక్సిజన్, కార్బన్, వంటి కొన్ని ఎలిమెంట్స్ తో తయారుచేయబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా !

అంటే శరీరమంటే గాలి, నీరు ఇలాంటివేనన్నమాట.

మరి అందులో చైతన్యం ఎలా వస్తుందో ? జీవులు ఇన్ని పనులు ఎలా చేస్తున్నారో ?

అంతా అత్యంత ఆశ్చర్యం, అద్భుతం.
 
ఆధునిక శాస్త్రవేత్తలు శరీరంగురించి ఇలా చెబుతున్నారు.

Question: What Are the Elements in the Human Body?

Answer: Most of the human body is made up of water, H2O, with cells consisting of 65-90% water by weight. Therefore, it isn't surprising that most of a human body's mass is oxygen. Carbon, the basic unit for organic molecules, comes in second. 99% of the mass of the human body is made up of just six elements: oxygen, carbon, hydrogen, nitrogen, calcium, and phosphorus.

1. Oxygen (65%)
2. Carbon (18%)
3. Hydrogen (10%)
4. Nitrogen (3%)
5. Calcium (1.5%)
6. Phosphorus (1.0%)
7. Potassium (0.35%)
8. Sulfur (0.25%)
9. Sodium (0.15%)
10. Magnesium (0.05%)
11. Copper, Zinc, Selenium, Molybdenum, Fluorine, Chlorine, Iodine, Manganese, Cobalt, Iron (0.70%)
12. Lithium, Strontium, Aluminum, Silicon, Lead, Vanadium, Arsenic, Bromine (trace amounts)

Reference: H. A. Harper, V. W. Rodwell, P. A. Mayes, Review of Physiological Chemistry, 16th ed., Lange Medical Publications, Los Altos, 

California 1977.

శాస్త్రవేత్తలు చెప్పినట్లు శరీరం అంటే గాలి, నీరు అయితే మన పెద్దలు చెప్పినది కూడా అదే కదా ! అంతా మట్టి, గాలి, నీరు, అంతా మాయ.

ప్రాచీనులు చెప్పినదీ, ఆధునికులు చెబుతున్నదీ ఒక్కటిగానే అనిపిస్తున్నది కదా .. అంతా దైవం దయ....

(నేను వ్రాసినవి చదివి నాకు ఏవో సినిమా కష్టాలవంటి కష్టాలు ఉన్నాయని అపార్ధం చేసుకోకండి. దైవం నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు.  )

అయితే,

  ( ఈ రోజుల్లో చాలామంది జీవితంలో 90 శాతం మంచి ఉన్నా కూడా, మిగిలిన 10 శాతం లోటును గురించే ఆలోచిస్తూ జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నారు కదా ! . నేనూ అలాగే.. ) .

....................

 ఈ  టపా  పాతదేనండి . 



Friday, September 14, 2012

కొలనుభారతి శ్రీ సరస్వతీదేవి ఆలయం .

                                 ఓం .

నల్లమల  అడవుల్లో  కొలువుదీరిన  కొలనుభారతి  శ్రీ సరస్వతి దేవి   ఆలయం  ప్రాచీనకాలం  నాటి  ఆలయమట.

 ఆలయం  చిన్నగా  ఉందని ,  కొత్త  ఆలయం  కట్టాలని  
ఆలోచిస్తున్నారని  భక్తి  టీవీ  ద్వారా  తెలుస్తోంది.

అమ్మవారిని    తరలించటం  సరికాదని  
పండితులు అంటున్నారట.


   అమ్మవారిని  శ్రీచక్రాన్ని  కదిలించి  ఆలయాన్ని  కడితే  దుష్ఫలితాలు  సంభవిస్తాయని  వారు   హెచ్చరిస్తున్నారట.
.......................

 పండితుల  మాటప్రకారం  చేయటం  అన్నివిధాల  మంచిది అనిపిస్తుంది .

 
శ్రీ సరస్వతీదేవి  ఆలయం  అభివృద్ధి  చేయాలంటే ,  అమ్మవారిని  శ్రీచక్రాన్ని ......కదిలించ కుండా   ఆలయం  చుట్టుపక్కల  అభివృద్ధి   చేయవచ్చు. 

 చుట్టూ  అభివృద్ధి  చేయటానికి   అక్కడ   చాలా  ప్రదేశం  ఉంది.


కొంతకాలం  క్రితం   మేము  ఆ  క్షేత్రానికి  వెళ్ళి  దైవాన్ని  దర్శించుకున్నాము.

వైజాగ్  లోని  శ్రీ  కనకమహాలక్ష్మి దేవి  దేవాలయాన్ని  అలాగే ఉంచి..   చుట్టూ  ఎన్నో   నూతన  నిర్మాణాలను  నిర్మించారు.  

 అంతా  దైవం  దయ.



Wednesday, September 12, 2012

కొన్ని దేవాలయాలు.....మరి కొన్ని విషయాలు.


ఓం.
 పరమాత్మ ఆదిపరాశక్తి   అయిన  శ్రీ  లలితా దేవి వారికి   అనేక  నమస్కారములు.

ఎంతో  మహిమ  గల  మేల్ మరువత్తూర్  ఆదిపరాశక్తి  క్షేత్రం ,  తమిళనాడులో   చెన్నై  నుంచి  తిరువణ్ణామలై  వెళ్ళే   దారిలో   ఉంది.

మేల్ మరువత్తూర్  ఆదిపరాశక్తి  దేవాలయం  గురించి   ఈ  లింకులో  కొన్ని  వివరములు  ఉన్నాయండి.  


  ఎంతో  మహిమ  గల    శనిదేవుని  క్షేత్రం  శనిశింగణాపూర్  ,మహారాష్ట్రలో   శిరిడికి     కొద్ది  దూరంలో  ఉంది.
శనిశింగణాపూర్  దేవాలయం   గురించి   ఈ  లింకులో  కొన్ని  వివరములు  ఉన్నాయండి.

Shani Shingnapur - Wikipedia, the free encyclopedia

......................................

  ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న   అందరికి  అనేక  కృతజ్ఞతలండి.

................................

 


Monday, September 10, 2012

మొక్కలు, లోహాలకు కూడా ఫీలింగ్స్ ఉండటం గురించి, మరియు కొన్ని విషయాలు.


*  " ఒక  యోగి  ఆత్మ  కధ " గ్రంధంలో  సైన్స్ కు  సంబంధించి  ఎన్నో  వివరాలున్నాయి. 
 
* మొక్కలు,  లోహాల  గురించిన  ఎన్నో  వింతైన  విషయాలను  భారతీయ  సుప్రసిద్ధ  శాస్త్రవేత్త   జగదీశ్ చంద్ర బోసు ,  తాను  చేసిన  ప్రయోగాల  ద్వారా  నిరూపించారు. ...

కొన్ని  విషయాలు...

బోస్ గారు   క్రెస్కో గ్రాపు  అనే  పరికరాన్ని  కనిపెట్టారు.  ఆ  పరికరం  ద్వారా  ,  ఎవరైనా బాధించినప్పుడు  ....  మొక్కలు  ,  లోహాలు   కూడా  బాధను  అనుభవిస్తాయని   వెల్లడి  చేసారు.

 
*లోహాల్లో  జీవశక్తి  బయటనుంచి  కలిగే  ప్రేరణలను  బట్టి  అనుకూలంగా  గాని,  ప్రతికూలంగా  గాని  ప్రతిక్రియలు  చూపిస్తుంది.
 
*బోస్  క్రెస్కో గ్రాపుకు ,  ఉన్నదాన్ని  కోటిరెట్లు  పెద్దగా  చేసి  చూపించే  బ్రహ్మాండమైన  శక్తి  ఉంది.  సూక్ష్మదర్శిని  అయితే  కొన్నివేల  రెట్లు  మాత్రమే  పెద్దగా  చేసి  చూపిస్తుంది.
 
*" లోహాల్నీ ,  మొక్కనూ,  జంతువునూ  ఒకే  సామాన్య  సూత్రం  కిందికి  తేవడానికి  సార్వత్రికమైన  ప్రతిచర్య  ఒకటి  పనిచేస్తున్నట్లు  కనిపిస్తుంది.
 
*బోసు  మహాశయులు  ఫెర్న్  మొక్కకు  ఒకచోట  , పదునైన  పరికరం  ఒకటి  గుచ్చారు;  వెంటనే  ఆ  మొక్క  గిలగిలా  కొట్టుకోడంతో  ఎంత  బాధపడుతోందో  తెలిసింది.
కాడలో  కొంతమేరకు  ఆయన  కత్తి  గుచ్చేసరికి  మొక్క  విపరీతంగా  విలవిల్లాడిపోతున్నట్టు   నీడలో  కనిపించింది.
 
*ఆయన  విష  సంబంధమైన   ఒక  రసాయనాన్ని  తగరానికి   పూసారు.  ఒక  పక్క  తగరపు  ముక్క  కొన  విలవిల్లాడుతూ  ఉండగా  పట్టికమీదున్న  ముల్లు  చావు  కబురు  చల్లగా  చెప్పింది.
 ...............
*  మొక్కలు,  లోహాల  గురించి  మరిన్ని  విషయాలు  తెలుసుకోవాలంటే "  శ్రీపాద శ్రీ వల్లభ  సంపూర్ణచరితామృతము "  గ్రంధంలో   మరిన్ని  వివరములున్నాయి.
 ...............

"భారతీయ ప్రతిభా  విశేషాలు  108  నిజాలు ." పుస్తకంలో  కూడా  ఈ  శాస్త్రవేత్త   గురించి  వివరాలు  ఉన్నాయి.

 కొన్ని  విషయాలు.... 
 
*సెల్ ఫోన్లు,  రేడియోలు,  టీవీలు ,  శాటిలైట్లు, చివరకు  బ్లూటూత్  వ్యవస్థలన్నీ  వైర్ లెస్ విధానం  ఉపయోగించే  పనిచేస్తున్నాయి. 

  *.. ఈ  విధమైన  తంత్రీరహితమైన  ( Wireless  )  ప్రసారపద్ధతిని    ముందు  కనుగొన్నది  భారతీయుడైన  సుప్రసిద్ధ  శాస్త్రవేత్త ' జగదీశ్  చంద్రబోస్  '. 


*  క్రీ.శ.1896,సెప్టెంబర్21న  బోస్  ఇంగ్లండ్ లో  రాయల్ ఇన్ స్టిట్యూట్ లో  ఒక  ప్రదర్శన,  ప్రసంగం  ఇచ్చారట.
..............................
 
* మొక్కలు,  లోహాలకు  కూడా  ఫీలింగ్స్  ఉండటం ....  వంటి   విషయాలు  వింటే   చిత్రంగానే   ఉంటుంది.


ప్రపంచంలో  మనకు  తెలిసింది   సముద్రంలో  నీటిబొట్టంత  మాత్రమే. మనం  నమ్మశక్యం  కాని  వింతలెన్నో   సృష్టిలో   ఉన్నాయి.
 
*"Matter and energy cannot be created or destroyed"  అని    శాస్త్రవేత్తలు  చెప్పే  విషయాన్ని  బట్టి  చూసినా ..  పదార్ధం , శక్తి ,యొక్క రూపం  మారుతుంది  .. అంతేకానీ,    పదార్ధాన్ని ,శక్తిని,   సృష్టించలేము , నశింపజెయ్యలేము....అని  తెలుస్తుంది.  

  ఉదా...నీరు  ఆవిరిగా  మారుతుంది ... ఆవిరి  మరల  నీరుగా  మారుతుంది  .  

  * పదార్ధానికే  పుట్టుక , నశించటం  అనేవి  లేనప్పుడు , పదార్ధాన్ని  సృష్టించిన  దైవం  ఆద్యంతాలు  లేని   నిత్యశక్తి .... అని  పెద్దలు  చెప్పిన  మాట  నిజమని  తెలుస్తోంది    కదా  ! 
...............
 
* బోస్  గారి   గురించి  కొన్ని     వివరాలు  ఈ లింకులో ఉన్నాయండి.... Jagadish Chandra Bose - Wikipedia, the free encyclopedia

..........................

మొక్కలు, పశుపక్ష్యాదులు మూగజీవులు. వాటి భావాలు మనకు సరిగ్గా అర్ధం తెలియవు. పశుపక్ష్యాదుల భావాలు మనకు చాలావరకూ తెలుస్తాయి. మొక్కలకు, మనుషులకు..  నెప్పి విషయంలో బాధపడే స్థాయిలో తేడాలుంటాయని అంటారు...ఈ విషయాలు సరిగ్గా అర్ధం కావట్లేదు. ఇక లోహాల సంగతి అర్ధం కావటం మరీ కష్టం.


* జుత్తును, గోర్లను కత్తిరిస్తే బాధ  ఉండదు. మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసినా ఎక్కువ బాధ ఉండదు. అలా మొక్కలకు ఎక్కువ బాధ ఉండదేమో? అని కొందరి అభిప్రాయం. ఇవన్నీ సరిగ్గా అర్ధంకాని విషయాలు.... ఆధునిక వైజ్ఞానిక పరికరాలకు కూడా  సరిగ్గా అంతుబట్టని  విషయాలు ఎన్నో ఉన్నాయి.


* భూమి ఒక పరీక్షా లోకం.ఇక్కడ కష్టాలు, సుఖాలు రెండూ ఉండే విధంగా సృష్టి ఉంది. ఇది ఒక ఆటస్థలం, నాటకరంగం వంటిది కూడా కావచ్చు. మనకు అర్ధం కాని విషయాలు సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ దైవానికే తెలుస్తాయి.

 

Friday, September 7, 2012

ప్రాచీనులు అందించిన అద్భుతమైన విజ్ఞానం... ...


*భారతీయ ప్రతిభా  విశేషాలు  108  నిజాలు..

*ETERNALLY  TALENTED  INDIA  -  108 FACTS..

............అనే  పుస్తకాన్ని , మాకు  తెలిసిన  వారు   ఈ  మధ్య  మాకు    ఇచ్చారు.  ఈ  పుస్తకాన్ని  వివేకానంద  లైఫ్  స్కిల్స్  అకాడమీ , హైదరాబాద్  వారు  సమర్పించారు.    ఈ  పుస్తకంలో  ఎన్నో  గొప్ప  విషయాలు  ఉన్నాయి.  


  ప్రాచీన  భారత  దేశపు  గొప్పదనం  గురించి,  ఇంకా  ఎన్నో  విషయాలను  సేకరించి ,  ఈ  గ్రంధం  ద్వారా    అందించారు .  
........................................

పుస్తకం  లోని    కొన్ని  విషయాలు  . 
.........................................

* ఈ  మధ్యకాలంలో ' స్ట్రింగ్  ధియరీ ' అనే   ఒక  నూతన  సిద్ధాంతాన్ని    శాస్త్రజ్ఞులు  ప్రతిపాదించారు.  

దీని  ప్రకారం  (' Quarks, Leptons' ) ' కణములు ' ('Particles' )    కాదనీ,  అవి అతి  సూక్ష్మమైన  , కంపించే  గుణం  కలిగిన  తీగల  వంటివనీ  నిర్ధారించారు.

 ఇది  మహత్తరమైన  నక్షత్రం  నుండీ   ,  అతి  సూక్ష్మమైన  పరమాణువుల  వరకూ  వ్యాపించి  ఉందనీ  ( Super string  )  నిర్ధారించారు.


*భారతీయ  దృక్పధం.....

* వేదం  లోని  ' శతపధ  బ్రాహ్మణం ' (  8.7.3.10 ) ఇలా  అంటున్నది. సూర్యుడు  తక్కిన  జగత్తు  ఒక  తీగ  వలే   ఉన్నవి.  ఆ ' తీగ ' యే  వాయువు.  వాయువు  అనగా  వేదార్ధంలో ' గాలి ' అని  కాదు.   'వ్యాపించినది ' అని  అర్ధం.


*భగవద్గీతలో  శ్రీ  కృష్ణ  పరమాత్మ  ఇలా  అంటారు .

'  మత్తః   పరతరం  నాన్యత్  కించిదస్తి  ధనంజయః
మయి  సర్వమిదం  ప్రోతం సూత్రేమణిగణా ఇవ  ....భ.గీ.  7-7 శ్లో.


' ఒక  సూత్రంలో  మణులు  కూర్చినట్లు  ఈ  జగత్తంతా  నాలో  ఇమిడిఉన్నది  '.    శ్రీ  కృష్ణభగవానుడు  చెప్పినట్లు  అనంతం  నుంచి  అణువు  వరకూ   జగత్తంతా  ఒక  సూత్రంలో  బంధించబడింది. 

 దీనినే  ఆధునిక  శాస్త్రవేత్తలు  నేడు  Super String   అన్నారు.

ఇలా  నక్షత్రరాశి  ప్రభావం  అతి  సూక్ష్మమైన  పదార్ధంతో  జగత్తు  నిండా  అనుసంధానించబడినప్పుడు  ,  ఆ  నక్షత్ర ప్రభావాన్ని  మన  జ్యోతిష్య  శాస్త్రం  ఏనాడో  గుర్తించి,  గ్రహించి  విశదీకరించింది  కదా  !

అనాదిగా  భారతీయ  సంస్కృతి  ప్రతిదానినీ   చైతన్య  పూరితంగా  గుర్తించి  ,  ఆరాధించింది.  ఇది  ఈ  వేదభూమిలో  సార్వజనీనం. 
........................

 * "  పృధ్వి  వ్యాపస్తేజో  వాయురాకాశం  కాలోదిగాత్మా  మన  ఇతి  ద్రవ్యాణి  !     

- వైశేషికదర్శనం - 

కణాద  మహర్షి    వివరించినట్టుగా  మనస్సు  - ఆత్మ  రెండూ  కూడా  ద్రవ్యములే (  Maatters ) . ఇప్పుడిప్పుడే  ఆధునిక  విజ్ఞానం,  పరిశోధనాకర్త  యొక్క  దృక్పధాన్ని  అణువిశ్లేషణలో  లెక్కలోకి  తీసుకుంటూ  ఉంది.

 
...................

*అగస్త్యుని  విద్యుత్  ఉత్పత్తి  విధానం..........

*యంత్రశాస్త్రం...Machine Science  of India..............
 

వైద్యం,   ఖగోళ  శాస్త్రం,    ఇంకా  అనేక  రంగాలలో  పలు  యాంత్రిక  పరికరాలను   ఆనాడే  ఉపయోగించారు.  అప్పటివారు విమానాలనూ  నిర్మించారు.

*గణితంలో  దిట్టలు-  భారతీయులు.....

*గురుత్వాకర్షణ  సిద్ధాంతం  కనుగొన్నది  ఎవరు  ?....Many  apples  had  fallen  before  Newton's  Gravity  Laws..........



ప్రాచీన  భారతీయ  గ్రంధాల  నిండా  గురుత్వాకర్షణ సిద్ధాంతము  గురించి  ప్రస్తావించబడి  ఉంది.   ఈ  గ్రంధాల  గురించి,  గురుత్వాకర్షణ   గురించి  వివరాలు  ఉన్న   శ్లోకాల  యొక్క  ఉదాహరణలను  ఇచ్చారు.

*సప్తవర్ణం-  భానుకిరణం....................Seven  Colours  of  Light

*కాంతివేగమును  ఎవరు  లెక్కించారు?  ............Measuring  the  Speed  of  Light .


సాయనాచార్యులి  ఋగ్వేద భాష్యంలో .. ఋగ్వేద శ్లోకం  ద్వారా   కాంతివేగాన్ని  లెక్కించటం  గురించి  వివరంగా  తెలుసుకోవచ్చు.

 ఇలా..  ఎన్నో  విశేషాలను   ఈ  గ్రంధం  ద్వారా  అందించారు.  ఈ  పుస్తకంలోని  విషయాలను  తెలుసుకుంటే  ప్రాచీనుల  గొప్పతనం  అర్ధమవుతుంది.
...................

*ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న   అందరికి  అనేక  కృతజ్ఞతలండి.  బ్లాగ్ లో  కొత్తగా  ఎవరైనా   సభ్యులైనప్పుడు  కృతజ్ఞతగా  ఇలా  వ్రాస్తుంటాను. 



 ఈ  బ్లాగును  కొత్తగా  చదువుతున్నవారికి,  ఇంతకు  ముందు   నుంచి  చదువుతున్నవారికి,  అగ్రిగేటర్లకు ..... అందరికి  కృతజ్ఞతలండి. 

* నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  అయినా   ఈ  మాత్రం  వ్రాయగలుగుతున్నానంటే ,  అంతా   దైవం  దయ వల్ల, మరియు    శ్రేయోభిలాషుల  ప్రోత్సాహం  వల్ల.


Wednesday, September 5, 2012

ముహూర్తాలు...మరి కొన్ని విషయాలు.

 
ఓం.

శ్రీ  ఆదిపరాశక్తి పరమాత్మ  అయిన  శ్రీ లలితాదేవి వారికి..  అనేక  నమస్కారములు. 

జన్మనిచ్చి పెంచి  పెద్దచేసినందుకు   తల్లిదండ్రులను,  విద్యాబుద్ధులను  నేర్పించినందుకు  గురువులను   ఎంతో   గౌరవిస్తాం . (  ఈ  రోజు  గురు  పూజోత్సవం  సందర్భంగా   అందరికీ  శుభాకాంక్షలు  ) ఎవరైనా  మనకు    సహాయం  చేస్తే  కృతజ్ఞతలు  చెబుతాము.


 అలాగే ,  తరాల   తరబడి  భూమి  మీది  జీవులకు,   పీల్చే  గాలిని,    త్రాగటానికి  నీటిని,    సూర్యరశ్మిని,  చంద్రకాంతిని,  ఖనిజాలను  ..... ...ఇలా  ఎన్నింటినో  అందిస్తూన్న  మహాశక్తి  అయిన  దైవానికి  కృతజ్ఞతలు    చెప్పుకుంటాము.


 ఏదైనా  ముఖ్యమైన  పనిని  మొదలు   పెట్టేటప్పుడు  ఇంట్లోని   పెద్దవాళ్ళకు    చెప్పి  వారి  ఆశీర్వాదాలు  తీసుకుని  బయలుదేరితే  పిల్లలు  తమను  గుర్తు  పెట్టుకున్నారని  పెద్దవాళ్ళు    ఎంతో  సంతోషిస్తారు.

  పెద్దవాళ్ళకు  చెప్పకుండా  నిర్లక్ష్యం   చేస్తే   పెద్దవాళ్ళు   శపించరు  కానీ ,  తమను   పిల్లలు  మర్చిపోయారని   చిన్నబుచ్చుకుంటారు.


  అలాగే  ఏదైనా  ముఖ్యమైన   పనిని  ప్రారంభించేటప్పుడు   మనం  బ్రతకటానికి  కారణమైన   దైవాలను    గ్రహాధిపతులను  ప్రార్ధించి ,  మంచి  ముహూర్తం  చూసుకుని  పనిని   ప్రారంభిస్తే  వారి  ఆశీర్వాద  బలంతో  మనకు  మరింత  మంచి  జరుగుతుంది. 


 ఏ  పంచాంగమైనా  గొప్పదే. అన్నీ  దైవం  దయయే.   అయితే,   గౌరీపంచాంగం  ఎవరికి  వారుగా   ముహూర్తాలు  చూసుకోవటానికి  సులభంగా  ఉంటుంది. (  ప్రతి  విషయానికి  పండితులను  సంప్రదించటానికి   కుదరకపోవచ్చు.  ) 
 
  పంచాంగాలలో   సూర్యోదయ  సమయం  ఎప్పుడు  అనేది  వ్రాస్తారు.  

ఉదా...6 .00 సూర్యోదయం  అని  ఉంటే ,  అక్కడనుంచి  లెక్కవేసి  ముహూర్తం   చూసుకోవాలి.  (  నాకు  తెలిసినంతలో  ) .

   ఒక  ఉరికి  ఇంకొక  ఊరికి  సూర్యోదయ  కాలం  మారుతుంది. 

ఉదా... రాజమండ్రిలో వ్రాసిన   పంచాంగం లోని  సమయానికి , వేరే ఊరిలో   నివసించేవారు  తమ  గ్రామంలో  సూర్యోదయాన్ని బట్టి , కొన్నిసార్లు  కొన్ని  నిమిషాలు  +  కలపటం  కానీ,  కొన్ని  నిమిషాలు  -  తీసివేసి  గాని  లెక్కించుకోవాలి.


ఒకే  ఊరిలో  కూడా  సూర్యోదయం  ఎప్పుడూ  ఒకే  సమయానికి  ఉండదు.  కాలాలను  బట్టి  మారుతుంటుంది.
 
గౌరీపంచాంగంలో  ముహూర్తాలు  6 గంటలనుండి  మొదలయినట్లు  ఉంటుంది.  కానీ  ఏ  ఊరు  వారు  తమ  ఊరిలో  సూర్యోదయ  సమయాన్ని  బట్టి  ముహూర్త సమయాన్ని  లెక్కించుకోవాలి.


మామూలు  పంచాంగం  ప్రకారం    చూసేటప్పుడు  కూడా   ఇలాగే  తమ  ఊరిలో  సూర్యోదయ  సమయాన్ని  బట్టి  ముహూర్త సమయాన్ని  లెక్కించుకోవాలి.  
 
 
పనిమీద   వేరే  ఊరు   వెళ్ళినప్పుడు ,  మన  ఇంట్లోని   పంచాంగాన్ని    కూడా  తీసుకువెళ్ళినా , మనం  వెళ్ళిన    ఊరిలోని  సూర్యోదయ  సమయాన్ని  బట్టి ,  మన  దగ్గర  ఉన్న  పంచాంగంలోని  ముహూర్తాన్ని  సరిచేసుకోవాలి.

 పంచాంగం   చూడటం  విషయంలో    చాలా  మంది    పొరపాట్లు     చేస్తున్నారు.

  కొందరు,  తెల్లవారుఝాము  అంటే  ఈరోజు  ఉదయం  అని  అనుకుంటారు. తప్పుగా  ముహూర్తాలు  చూసుకుంటే  అన్నీ  తప్పులే  అవుతాయి.
 

 సూర్యోదయానికి కొంతకాలం ముందు తెల్లవారుఝాము..
సూర్యోదయం తరువాత సమయాన్ని ఉదయం ..అని వ్రాస్తారు.

ఉదా..6-30 సూర్యోదయం ఉన్నప్పుడు, ఆదివారం తెల్లవారు ఝామున 6-00 వరకు ఫలానా నక్షత్రం అని అంటే ..

.ఆదివారం తెల్లవారుఝామున (ఆదివారం రా.తె. 6.00 ) అంటే,  ఇంగ్లీష్ టైం ప్రకారం  సోమవారం మార్నింగ్ 6-00 వరకు.. అని అనుకోవాలి. (నాకు  తెలిసినంతలో).. 

(ఈ విషయాన్ని కొన్ని పంచాంగాలలో రా.తె. అని కూడా సూచిస్తారు. )

***************
 ఇప్పుడు  సమయాన్ని  నిమిషాలు,  సెకన్లలో  లెక్కిస్తున్నాము.

 కానీ, పూర్వీకులు  సెకన్ల   కన్నా   తక్కువగా  లిప్తలలో   కూడా  సమయాన్ని  లెక్కించేవారట.
 
    ఇంకో  చిత్రమైన  విషయమేమిటంటే ,  ప్రపంచంలోని   ఏ   ఒక్కరి  వేలిముద్రలు  ఒకేలా  ఉండవట.  ఎవరి  వేలిముద్రలు  వారికే   ప్రత్యేకంగా  ఉంటాయి. 

 మరీ  పట్టుదలలకు  పోకుండా   మనకు  చేతనైనంతలో    పంచాంగంలో  చెప్పిన  విషయాలను  పాటించుకుంటే  మంచిది. 


ఈ  రోజుల్లో  వివిధ  పంచాంగాలలో  వివిధ  సమయాలు    వ్రాస్తున్నారు.    ఏ  సమయాన్ని  పాటించాలో  తెలియక  సామాన్యులకు   గందరగోళంగా  ఉంటుంది.  

ఆధునిక  విజ్ఞానశ్శాస్త్ర   సిద్ధాంతాల  విషయంలో  శాస్త్రవేత్తల  మధ్య  భిన్నాభిప్రాయాలు  ఉంటాయి.  జ్యోతిశ్శాస్త్ర   సిద్ధాంతాలను   అర్ధం  చేసుకునే  విషయంలో  పండితుల  మధ్య   భిన్నాభిప్రాయాలు  ఉంటాయి.  ఎవరి  వాదన  సరైనదో  సామాన్యులకు  తెలియదు.  అందుకని  ఎవరు  ఏది   చెప్పినా  గుడ్డిగా  ఆచరించటం  కన్నా   ,    పరిస్థితిని   బట్టి     ప్రవర్తించటం    మంచిది. 


 మనకు  దిక్కుతోచనప్పుడు  దైవంపై  భారం  వేయటం  ఉత్తమం.

ఏ జాతకాలూ    తెలుసుకోకపోయినా    చెడుపనులకు    దూరంగా ఉంటూ,    సత్ప్రవర్తనను    కలిగిఉండి    దైవంపైన    భారం వేసి    జీవించే    వ్యక్తికి    దైవమే    సరియైన   దారిని   చూపిస్తారు.

నాకు  తెలిసింది  తక్కువ.  వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దైవం  క్షమించాలని  ప్రార్ధిస్తున్నాను.

  వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  తెలిసిన  వారు  చెబితే  సరిచేస్తానండి.