koodali

Friday, December 30, 2011

మనువు నుంచి మానవులు ...


మనం ప్రాచీన విజ్ఞానాన్ని, ఆధునిక విజ్ఞానాన్ని రెండింటిని గౌరవించాలి. అని నా అభిప్రాయం. అయితే కొందరు తెలిసీతెలియని వారు, కొందరు స్వార్ధపరుల వల్ల ప్రాచీన సాహిత్యంలో చేరిన మూఢనమ్మకాలను, విడిచిపెట్టాలి. 


అలాగే ఆధునిక విజ్ఞానంలో పెరుగుతున్న అతివాదపరిశోధనలను అంటే పర్యావరణానికి, ప్రపంచానికి హాని కలిగే విజ్ఞానాన్ని విడిచిపెట్టాలి.


కొందరు ఏమనుకుంటారంటే ప్రాచీనులు నిర్లిప్తత వంటి గుణాలను ప్రోత్సహించారు అనుకుంటారు. కానీ, అర్జునునికి గీత ద్వారా భగవానుడు బోధించినది నిర్లిప్తత కాదు కదా !  ధర్మయుద్ధం చెయ్యమని ప్రోత్సహించారు. అంతేకానీ నిర్లిప్తతను కాదు.


ప్రాచీన గ్రంధాలలో లోకానికి కావలసిన అన్ని విషయాలూ ఉన్నాయి. అంటే సైన్స్ కోణం నుండి చూస్తే సైన్స్, సామాజిక కోణం నుండి చూస్తే సామాజిక సంబంధ విషయాలూ ఇలా ఏ కోణం నుండి చూసే వారికి ఆ విషయాలు తెలుస్తాయి.

ఉదా... చంద్రునికి 27 మంది భార్యలు అని పెద్దలు చెప్పారు. సైన్స్ కోణం నుండి చూసేవారికి 27 మంది భార్యలు అని కాకుండా 27 నక్షత్రాలుగా అనుకోవచ్చు.



ఇంకా పూర్వులు టెలిస్కోపుతో తెలుసుకున్నారో ? తపశ్శక్తితో తెలుసుకున్నారో ? నవ గ్రహాలు గురించి ... వాటి మధ్య ఉండే దూరం ఎన్ని యోజనాలో ...ఆ వివరాలు కూడా చెప్పటం జరిగింది. ఇదంతా సైన్సే కదా !



ఇంతకుముందు టపాలో దశావతారాల గురించి అనుకున్నాము. అందులో కశ్యపుని సంతానమైన దేవతలకు స్వర్గ లోకము, దైత్యులకు పాతాళలోకము నివాసంగా వ్రాశానండి. పాతాళంలో దైత్యులూ మాత్రమే కాకుండా సర్ప జాతులు కూడా నివసిస్తాయట. 



పాతాళంలో దైవమైన " అనంతుడు " ఉంటారు. .... ఇంకా వాసుకి మొదలైన సర్ప శ్రేష్టులు, కొన్ని సర్ప జాతులు కూడా నివసిస్తారట. ఈ విషయం ఇంతకుముందు టపాలో వ్రాయలేదు. జరిగిన పొరపాటుకు దయచేసి క్షమించండి.



* పరిణామక్రమంలో వానరుల నుండి మానవులు వచ్చారని భావించటం తప్పేమో అనిపిస్తుంది. రామాయణ కాలంలో ఎంతో పరిణతి చెందిన వానరుల గురించి పెద్దలు చెప్పారు. అయితే ఆంజనేయస్వామి మాత్రం ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారని పెద్దలు చెప్పటం జరిగింది. 



రామాయణంలో చెప్పబడ్డ వానరులు దగ్గరదగ్గర మానవుల లాగే ఎంతో పరిణతి చెందినవారు. బహుశా ఇలాంటి వానరుల గుర్తులు చూసి ఇప్పటి శాస్త్రవేత్తలు మానవులు వానరుల నుండి పరిణామం చెందారని అనుకుంటున్నారేమో?


* ఇక మనిషి కోతి నుండి పరిణామం చెందాడని కొందరు శాస్త్రవేత్తలు అంటుంటే ......అలా పరిణామం చెందలేదని చెప్పే శాస్త్రవేత్తలు కూడా బాగానే ఉన్నారు. "AGAINST EVOLUTION " అని మనం నెట్లో సెర్చ్ చేస్తే వివరాలు ఉన్నాయి. 



సృష్టిలో జీవం ఏకకణ జీవి, బహుకణజీవి, ఆల్గే, సరీసృపాలు, మొక్కలు, పక్షులు, జంతువులు, మానవులు ..ఇలా సృష్టి పరిణామం జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వారంటున్నట్లు సృష్టిలో జీవులు ఒకదానితరువాత ఒకటి ఒక క్రమంలో జన్మించి ఉండవచ్చు.


అయితే వేటికవే జన్మించాయి కానీ, సరీసృపాల నుంచీ పక్షులు.......పక్షుల నుంచీ జంతువులు .. జంతువుల నుంచీ ... మానవులు ....ఇలా పరిణామం జరగలేదు అనిపిస్తుంది.



* ఇతర గ్రహాలలో జీవులు ఉన్నారని, ఆ జీవుల ద్వారా కూడా భూమిపై జీవం ఏర్పడి ఉండవచ్చని ఈనాటి కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అలా చూస్తే బ్రహ్మదేవుడు భూమిపై సృష్టి చేయటానికి సంకల్పించి మానసపుత్రులను పొందటం....తరువాత అలా కశ్యపుని ద్వారా భూమిపై జీవజాలం ఏర్పడటం ...పరిశీలిస్తే..


*బ్రహ్మదేవుడు, కశ్యప మహర్షి వంటివారు ఇతర లోకాలకు సంబంధించిన వారే. అయితే వారు తలుచుకుంటే ఏ లోకంలోనైనా ఉండగలరు. వరుణుడు కశ్యపుని భూలోకంలో జన్మ ఎత్తమని శపిస్తారు. అలా కశ్యపుడు కృష్ణుని తండ్రి అయిన వసుదేవునిగా జన్మ ఎత్తటం జరిగింది. ఈ విషయం పరిశీలిస్తే కశ్యపుడు ఇతరలోకంలో ఉంటారని తెలుసుకోవచ్చు. .


భూమిపై జీవం ఏర్పడకముందే కశ్యపుడు దేవదానవులను, వాసుకి వంటి వారిని సంతానంగా పొందారు . దేవదానవులు, వాసుకి మొదలైన వారు స్వర్గలోకం ,పాతాళలోకాలలో నివాసం ఏర్పరుచుకున్నారు. వారే కూర్మావతారంలో క్షీరసాగరమధనంలో ఉన్న వారు కావచ్చు. అని ఈ విషయాలు ఇంతకుముందు టపాలో అనుకున్నాము.



* ఇక తరువాత వరాహస్వామి భూమిని సముద్రం నుంచీ పైకి తీసిన తరువాత .... బ్రహ్మదేవుని మానస పుత్రుడైన .స్వాయంభువ మనువు తన తండ్రి సలహాతో మహాదేవిని ఆరాధించి సృష్టి చేయ సంకల్పించారు . స్వాయంభువ మనువు శతరూప దంపతులకు పుత్రులు, పుత్రికలు జన్మించారు. . .... ఒక పుత్రికను కశ్యపునికిఇచ్చి వివాహం చేయగా వారికి సంతానంగా భూమిపై ప్రాణులైన మొక్కలు, జంతువులు ( వానరులు మొదలైనవి...) జన్మించటం .....కశ్యపుని పుత్రుడైన సూర్యుడు ... ..సూర్యునికి పుత్రుడైన వైవస్వత మనువు .... ... యిలా అభివృద్ధి జరిగింది.వైవస్వత మనువు తరువాత మానవుల అభివృద్ధి జరిగిందని అనుకోవచ్చేమో ? అనిపిస్తుంది.


స్వాయంభువు మనువు యొక్క పుత్రులు, పుత్రికలు ..... మానవులు అని కాకుండా వారు దేవతల వంటి వారు అని మనం భావించ వచ్చేమో .

అంటే, ఇంద్రుడు, సూర్యుడు మానవుల కన్నా గొప్ప వారైన దేవతలు .అయినప్పుడు వీరికన్నా ముందు వారైన కశ్యపుడు, స్వాయంభువ మనువు యొక్క పుత్రులు, పుత్రికలు ఇంకా గొప్పవారు అయి ఉంటారు కదా ! అందుకని వైవస్వత మనువు తరువాతే భూమిపై మానవుల అభివృద్ధి జరిగిందని మనము భావించ వచ్చేమో . తోచింది వ్రాశాను. ఎంతవరకూ సరైనదో భగవంతునికే తెలియాలి.


ఈ విధంగా భూమిపై జీవం ఏర్పడిన విధానాన్ని పూర్వులు తెలియజేశారు అనిపిస్తుంది.

వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని కోరుకుంటున్నాను.


సృష్టి , స్వాయంభువ మనువు, వైవస్వత మనువు గురించిన ఎన్నో వివరాలు " శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము " గ్రంధములో చెప్పబడినవి. ఆసక్తి ఉన్నవారు చదవగలరు.


 


Wednesday, December 28, 2011

దశావతారాలను పరిణామసిద్ధాంతం ప్రకారం....కరెక్ట్ కాదేమో...

ఇంతకుముందు వ్రాసిన టపాలో దశావతారాలను పరిణామసిద్ధాంతం ప్రకారం ఉదాహరిస్తూ వ్రాశాను కదండి. అయితే ఆ ఆలోచన కరెక్ట్ కాదేమో అనిపించింది.

తరువాత శ్రీ దేవీ భాగవతం గ్రంధములో కశ్యపుని సంతానంగా దేవ, దానవ, పశుపక్ష్యాదులు జన్మించాయని చదివిన తరువాత నాకు అనేక సందేహాలు ,ఆలోచనలు వచ్చాయి.

ఆ ఆలోచనలు,
సందేహాలు ఇక్కడ ..........

విష్ణుమూర్తి యొక్క దశావతారాలను పరిణామసిద్ధాంతం ప్రకారం చెప్పాలంటే ముందు వరాహావతారం కదా రావలసింది. ఎందుకంటే భూమిని సముద్రం నుంచి పైకి తీసినతరువాతే కదా భూమిపై జీవం ఏర్పడుతుంది...ఇలా సందేహాలు వచ్చాయి.

కనుక దశావతారాలు పరిణామక్రమం అని చెప్పలేము. ..... కశ్యపుని సంతానమైన దేవదానవులు, పశుపక్ష్యాదులు, ఎలా
డైరెక్ట్ పుట్టడం జరిగిందో ... మానవులు కూడా అలాగే డైరెక్ట్ గా పుట్టారు. .. అంతేకాని కోతి నుండి మానవులు పరిణామం చెందలేదని కచ్చితంగా చెప్పుకోవచ్చు.


విష్ణుమూర్తి మత్శ్యావతారం ధరించి సోమకాసురుని వధించి వేదములను రక్షించారు. అని  ఒక కధను పెద్దలు తెలిపారు.

ప్రళయం వచ్చేముందు విష్ణుమూర్తి మత్శ్యావతారం ధరించి భూమిపైని విత్తనాలు, పశుపక్ష్యాదులు, ఒక పడవలో దాచి ఆ పడవను తాను లాగి కాపాడారని ...... మరల సృష్టి ప్రారంభమయినప్పుడు పడవలోని బీజములతో మరల కొత్త సృష్టి ప్రారంభమయిందని  ఇంకొక కధ కూడా పెద్దలు తెలిపారు.

ఇక కూర్మావతార సందర్భంలో...... దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికే సందర్భంలో విష్ణుమూర్తి కూర్మావతరం ధరించి దేవతలకు సహాయపడటం జరిగింది.

నాకు ఏం సందేహం వచ్చిందంటే ....దేవదానవులు , వాసుకి మొదలైనవారు కశ్ప్యపుల వారికి సంతానం అంటారు కదా ! మరి కశ్యపుల వారి సంతానమైన దేవదానవులు, వాసుకి మొదలగు సర్పజాతులు వరాహస్వామి భూమిని రక్షించిన తరువాత జన్మించారా ? లేక ముందే జన్మించారా ? దేవదానవులు ,వాసుకి మొదలైన వారు కూర్మావతార సమయంలోనే ఎలా ఉన్నారు ? వగైరా సందేహాలు వచ్చాయి.

విశ్వంలో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయట. భూమి ప్రళయంలో మునిగిపోయినా కూడా ఇతర బ్రహ్మాండాలలోని జీవులు అలాగే ఉంటాయట. ఆదిపరాశక్తి అయిన పరమాత్మ ఉండే మణిద్వీపంలో అన్ని బ్రహ్మాండాలలోని దేవతలు తమతమ రూపాలతో ఎప్పుడూ ఉంటారట. క్షీరసాగరమధనంలో పాల్గొన్న దేవతలు
ఇతర బ్రహ్మాండాలలోని దేవదానవులు, సర్పజాతులూ ఏమో ? అని అనిపించింది. యిలా ఎన్నో ఆలోచనలు వచ్చాయి.
...........................

* బ్రహ్మ దేవుడు తన మానసపుత్రులను సృష్టించటం అనే సంఘటన భూమిపై కాకుండా సత్యలోకంలోనో , మరేలోకంలోనో జరిగింది..... అలాగే కశ్యపుడు సంతానాన్ని పొందటం ఏ లోకంలో జరిగిందో తెలియదు. తరువాత కశ్యపులవారి సంతానమైన దేవతలు స్వర్గలోకంలో, దైత్యులు పాతాళలోకంలో, మానవులు, పశుపక్ష్యాదులు భూలోకంలో నివాసం ఏర్పరుచుకున్నారని మనం భావించవచ్చు..

* నరసింహస్వామి వారు పరిణామ క్రమంలో చెప్పినట్లు మనిషిజంతువు నుంచి పరిణామం చెందిన దానికి ఉదాహరణ కాదు అని గట్టిగా చెప్పవచ్చు.

.........................................

* ఈ పైన చెప్పిన ఆలోచనలు తరువాత నాకు ఇలా అనిపించింది.....

మత్శ్యావతారం............


మత్శ్యావతారం
వరాహస్వామి భూమిని సముద్రం నుంచి పైకి తీయటానికి ముందు జరిగిన సంఘటన కాబట్టి........మత్శ్యం పరిణామక్రమంలో నీటిలో నివసించిన జీవికి ఉదాహరణ కాదు.

కూర్మావతారం ..... అవతారం
కూడా భూమిని సముద్రం నుంచి పైకి తీయటానికి ముందు జరిగిన సంఘటన ......కాబట్టి కూర్మావతారం నీటిపై ,నేలపై జీవించే పరిణామక్రమానికి ఉదాహరణ కాదు.

వరాహావతారం..... ఇప్పుడు భూమి సముద్రం నుంచీ పైకి తీయబడింది కాబట్టి ...

* ఈ అవతారం తరువాతే భూమిపై జీవం వృద్ధి జరిగింది అనిపిస్తుంది. .


* కశ్యపుడు అదితి యొక్క ...సంతానమైన దేవతలకు స్వర్గలోకం నివాసంగా నిర్ణయించబడింది. దితి సంతానమైన దైత్యులకు పాతాళాదిలోకాలు నివాసంగా నిర్ణయించబడ్డాయి.

( హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు మొదలైనవారు పాతాళంలోనే ఉండేవారట. అయితే వీళ్ళలో కొందరు
అప్పుడప్పుడు స్వర్గలోకపు వాళ్ళతోనూ, భూలోకపు వాళ్ళతోనూ యుద్ధాలు చేస్తుంటారు.)

*
కశ్యపుని వారసులైన మానవులకు , పశుపక్ష్యాదులు, మొదలైన వాటికి మాత్రం భూమి నివాసంగా నిర్ణయించబడింది. అప్పటినుంచీ మానవులు, పశుపక్ష్యాదులు మొదలైనవి భూమిపై అభివృద్ధి చెందాయి.

అయితే ఈ మానవులు, పశుపక్ష్యాదులు మొదలైన జీవులు అన్నీ ఒకేసారి జన్మించాయా ? లేక ఒకదాని తరువాత ఒకటి క్రమంగా వృద్ధి చెందాయా ? అన్నది తెలియదు. కశ్యపుని సంతానమైన పశుపక్ష్యాదులు ఏ క్రమంలో జన్మించాయని గ్రంధాలలో ఉందో నాకు తెలియదు. అందుకని నరసింహస్వామి వారి అవతారం కచ్చితంగా మానవుడు జంతురూపం నుంచీ మనిషిగా మారే జీవికి ఉదాహరణ కాదు అనుకోవచ్చు.

ఇక వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం వంటి వాటి విషయంలో సందేహాలు రావు.
..............................

* విష్ణుపురాణంలో సృష్టిక్రమం గురించి విపులంగా వర్ణించబడిందని విన్నాను. నేను విష్ణుపురాణం చదవలేదండి. మా ఇంట్లో మరీ ఎక్కువ గ్రంధాలు లేవు.

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కాణిపాకం క్షేత్ర మాహాత్మ్యం , శ్రీ దేవీ భాగవతము. శ్రీపాదశ్రీవల్లభచరితామృతము, ఒక యోగి ఆత్మ కధ, భగవద్గీత
, శ్రీ అన్నవరం క్షేత్రం స్థల పురాణము , శ్రీ అరుణాచల మాహాత్మ్యము, శ్రీశైల చరిత్రము, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ... ఇలా ఇంకా కొన్ని ఉన్నాయండి. ఈ గ్రంధాలలోని విషయాలలో నాకు అర్ధమయింది సముద్రంలో నీటిబొట్టంత.

* ఈ టపాలో దశావతారముల గురించి వ్రాసిన వాటిలో కొన్ని విషయాలు నా ఊహ మాత్రమే.అవి ఎంతవరకూ నిజమో భగవంతునికే తెలియాలి.

వ్రాసిన వాటిలో పొరపాట్లు ఉన్నచో దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.




Monday, December 26, 2011

మనిషి కోతి నుంచి పరిణామం చెందటం........

 
సార్ Rao S Lakkaraju గారి బ్లాగులో పరిణామక్రమం గురించిన విషయాలు చదివాక నాకు కొన్ని సందేహాలు వచ్చాయండి.
 
జీవులలో పరిణామక్రమం గురించి డార్విన్ చెప్పినది నిజమే కావచ్చు. కానీ మనిషి కోతినుంచి పరిణామం చెందాడని ఎందుకు అనుకున్నారు శాస్త్రవేత్తలు ? అలా పరిణామం చెందినట్లయితే ఆ పరిణామం అతి నెమ్మదిగా జరిగింది కాబట్టి ఆ పరిణామక్రమాన్ని అనుసరించి వివిధ ఆకారాల్లో శిలాజాలు పెద్దమొత్తంలో లభించాలికదా ! ( అలా లభించలేదట )

ఒకవేళ శిలాజాలు లభించినా అవి మనిషివేనని ఏమిటి నమ్మకం ? మనిషికి దగ్గరి పోలికలున్న చింపాంజీలవి కావని ఏమిటి గ్యారంటి ? లోకంలో ఎన్నో పక్షులు, జంతువులు ఉన్నాయి. అవన్నీ ఏ పరిణామక్రమము లేకుండా డైరెక్ట్ గా పుట్టినప్పుడు సృష్టిలో గొప్పజీవి అనుకునే మనిషి మాత్రం కోతినుండి పరిణామం ఎందుకు చెందుతాడు ? ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి.



నేను నెట్లో కొన్ని వ్యాసాలు చదివితే నాకు అర్ధమయినంతలో ఏమనిపించిందంటే కోతినుంచి మనిషి పరిణామం చెందిన విషయంలో కూడా శాస్త్రవేత్తలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. కొందరు శాస్త్రవేత్తలు కూడా మనిషి కోతినుండి పరిణామం చెందలేదు అని గట్టిగా అంటున్నారట.

 కోతి నుండి మనిషి పరిణామం చెందినట్లు పెద్దమొత్తంలో శిలాజాలు దొరకలేదట. అతి తక్కువ శిలాజాల.. భాగాలు మాత్రం దొరికాయట.ఇది ఆశ్చర్యం కదా !

(ఆ శిలాజాలు మనిషివో ? చింపాంజీలవో ఎవరికీ తెలుసు? ) వీటన్నిటి బట్టి చూస్తే మనిషి కోతి నుండి పరిణామం చెందలేదని అనుకోవచ్చు. ఏది నిజమో ? ఏది కాదో ? పురాణాలలో మనిషి కోతి నుండి పరిణామం చెందినట్లు చెప్పబడలేదు. ( నాకు తెలిసినంతవరకు )
 
దశావతారాలను కొందరు పరిణామక్రమములో వర్ణించారు. అవి చదివి నేనూ అలాగే బ్లాగులో వ్రాశాను. కానీ ఇప్పుడేమనిపిస్తుందంటే, దశావతారములు పరిణామక్రమాన్ని సూచించవచ్చు.

కానీ, దశావతారాలలో పరిణామక్రమం రెండు విధాలుగా భావించవచ్చు.......

1. ఎలాగంటే ... మత్స్యావతారం ( నీటిలో జీవించే జీవి, ) కూర్మావతారం ( నీటిలోనూ లోనూ, నేలపైనా జీవించే జీవి, ) వరాహావతారం ( ఎక్కువగా నేలపైన జీవించే జీవి, ) నరసింహావతారాన్ని కొందరు ( సగం సింహం కాబట్టి మనిషిగా పరిణామం చెందుతున్నట్లుగా వర్ణించారు ? ) . ( కానీ ఇక్కడ నాకు సందేహం వచ్చింది. ) వామనావతారం ( పూర్తి మనిషిగా పరిణామం చెందటం, ) ఇక మిగతా అవతారాలు ( మానవ నాగరికత యొక్క పరిణామక్రమాన్ని వివరిస్తుందని ) కొందరు చెప్పారు. ఇది ఒక రకం భావన.....

2...రెండవ రకపు భావన ప్రకారం... నరసింహావతారం సందర్భంలో ప్రహ్లాదుడు వాళ్ళు సగం జంతువు, సగం మనిషి ఆకారాలలో వర్ణించబడలేదు కదా ! వాళ్ళు అసురజాతికి చెందిన వారు అనుకుంటా ? 


 అలా చూస్తే....
ఇక్కడ మనం ఏం అర్ధం చేసుకోవచ్చంటే ఈ అవతారాలు జీవుల పరిణామక్రమాన్ని సూచించటమంటే మత్స్యం నుంచి కూర్మం .... కూర్మం నుంచీ వరాహం పరిణామం చెందాయని అర్ధం కాదు.


అంటే మొదట మత్స్యావతారం ( నీటి లో జీవించే జీవి ) కూర్మావతారం ( నీరు మరియు నేలపై జీవించే జీవి ) వరాహావతారం ( ఎక్కువగా నేలపై జీవించేజీవి ) నరసింహావతారం ( మనిషి యొక్క ఆటవిక దశలోని జీవులు అంటే.. హిరణ్యకశిపుని వంటివారి జాతి యొక్క ఆటవికతను సంహరించే అవతారం ) వామనావతారం ( మనిషి నాగరికత పెరుగుతున్న దశ ) రామావతారం ( క్రమంగా రాజ్యాధికారం మరింత నాగరికత పెరగటం ) ఇలా కల్కి అవతారం వచ్చేటప్పటికి ప్రళయం వచ్చి సృష్టి అంతం అయ్యి మరల యుగారంభం ఇలా............అనిపించింది. ....
దీనిని బట్టి నాకు ఇలా సందేహం వచ్చింది .......

* కొందరు భావించినట్లు నరసింహస్వామి వారు మనిషి జంతువు నుంచి పరిణామం చెందినదానికి ఉదాహరణ కాకపోవచ్చు. . ........ నరసింహావతారం ( మనిషి యొక్క ఆటవిక దశలోని జీవులు అంటే.. హిరణ్యకశిపుని వంటివారి జాతి యొక్క ఆటవికతను సంహరించే అవతారం కావచ్చు. ) ఎందుకంటే అప్పటికే ప్రహ్లాదుడు వంటి ( శరీరం కల ) వారు ఉన్నారు కదా ! ఇంకా ప్రహ్లాదుని కాలంలో నరనారాయణులు తపస్సు చేసినట్లుగా కూడా చెప్పబడింది.

*..ఇలా ...... దశావతారాలు .. ఒక జీవ నాగరికత యొక్క పరిణామక్రమాన్ని సూచిస్తున్నాయి .....అంతేకానీ .....ఒక జీవి ఇంకొక జీవి గా పరిణామం చెందింది అని అర్ధం కాదు .


 దీనిని బట్టి చూస్తే మనిషి జంతువుల నుండి పరిణామం చెందలేదు. మనిషిమనిషిగానే దైవం చేత సృష్టించబడ్డారని అర్ధం చేసుకోవచ్చు.

నేను నా అభిప్రాయాలను మరింత స్పష్టంగా చెప్పలేకపోయాను అనిపిస్తోంది. వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని కోరుకుంటున్నాను.



Sunday, December 25, 2011

క్రిస్ మస్ శుభాకాంక్షలండి.

క్రిస్ మస్ శుభాకాంక్షలండి.
ఆలస్యంగా చెబుతున్నందుకు సారీనండి.

ఈ రోజు క్రిస్ మస్ గురించి చదివిన ఒక వ్యాసంలోని కొన్ని వాక్యాలు...


ఇతరులు మీ పట్ల చేసిన తప్పులను సరిదిద్దండి. అప్పుడు దేవుడు మీ తప్పులను క్షమిస్తాడు. ఇది క్రీస్తు సమస్త మానవాళికి అందించిన దివ్యమైన ఉపదేశం. అని..

.చక్కగా చెప్పారు కదండి.



Friday, December 23, 2011

ఈరోజుల్లో ఆర్ధికమాంద్యం, నిరుద్యోగం, పేదరికం, వంటి వాటికి ఎన్నో........

 
నేడు రైతు దినోత్సవమట. మొన్న మేము షాప్ లో పెసలు కొంటే ఒక . కిలో 90 రూపాయలు. అందులో సగం ధర అయినా రైతుకు చెల్లించరేమో ? వాటి రేట్లు చూసి పండించే రైతుకు, కొనే వినియోగదారులకూ కళ్ళు తిరుగుతున్నాయి. మరి మధ్యలో జరుగుతున్న మాయాజాలం ఏమిటో మనకు అర్ధం కాదు.


పేదవారు పేదవారిగానే ఉండిపోతున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. దైవం జీవుల అవసరాల కోసం గాలినీ, నీటినీ, పంటలను, ఖనిజాల వంటి సహజ వనరులను సృష్టించి ఇచ్చినా కూడా సంపద కొందరి చేతుల్లోనే ఉండటం , పధకాల అమలులో సరైన ప్రణాళిక లేకపోవటం, అమలు చేసే కొందరిలో చిత్తశుద్ధి లోపం వంటి కొన్ని కారణాల వల్ల ప్రపంచంలో పేదరికం తగ్గటం లేదు.


ఈ సమస్యలు ఇలా ఉన్నంతకాలం ఎన్ని పరిశ్రమలు పెట్టినా, ఏం చేసినా వాతావరణకాలుష్యం, పెరిగిపోవటం, సహజవనరులు తరిగిపోవటం తప్ప పేదరికం తగ్గదు.


ఇప్పుడు చూస్తున్నాము కదా ! కరెంట్ కోత. బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి. పెట్రో, సహజవాయు నిల్వలు కూడా కొంతకాలానికి అయిపోతాయంట. అందుకే అణువిద్యుత్ అవసరం అంటున్నారు. అణుశక్తి కనిపెట్టిన తరువాత కొన్ని దేశాలు తమ దేశ రక్షణకు ఉపయోగించుకున్నాయి. దేశరక్షణ వంటి విషయాల్లో మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనమూ రక్షణ ఏర్పాట్లు గట్టిగా చేసుకోవాలి.


కానీ అణువిద్యుత్ తయారీ విషయంలో మాత్రం అలాంటి తప్పనిసరి అవసరం లేదు. అణువిద్యుత్ కన్నా మనం సౌరశక్తి వంటి మార్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అణువిద్యుత్ విషయంలో వెనుకంజ వేస్తుంటే మనవాళ్ళు ఎందుకు ఇంత మక్కువ చూపిస్తున్నారో మరి. .అంతా దురదృష్టం.


విద్యుత్ ఉంటే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వచ్చి పేదరికం పోతుంది అని వారు అంటుంటారు.


కానీ, పేదరికం పోగొట్టాలంటే ..........సంపద కొందరి వద్ద మాత్రమే కాకుండా అందరికీ చెందేలా గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పుడే పేదరికం పోతుంది.

అదీకాక పరిశ్రమలు నెలకొల్పాలన్నా విద్యుత్ ఒక్కటి ఉంటే సరిపోదు కదా ! వస్తువులను తయారుచేయటానికి ఇనుము, అల్యూమినియం వంటి ఎన్నో ఖనిజాలు అవసరమవుతాయి.


పరిశ్రమలు బాగా నెలకొల్పి బాగా వస్తువులు తయారు చేసేకొద్దీ ఖనిజనిల్వలు తగ్గిపోతాయి. అప్పుడు పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు ఎక్కడినుంచీ తెస్తారు ?


ఇలాగే ఉపాధి అవకాశాల కోసం వస్తువులను ఉత్పత్తి చేసుకుంటూ పోతే ఇంకో 50 ఏళ్ళకు ముడిసరుకు కూడా లభ్యం కానంతగా ఖనిజసంపద తగ్గిపోతుంది. . ( ఎంత రీసైక్లింగ్ చేసినా కూడా )


ఇదంతా ఆలోచించే కొన్ని దేశాలవాళ్ళు ముందు జాగ్రత్తగా తమ దేశాలలోని ఖనిజాలను తవ్వటం ఆపేసి గనులను మూసేసారట. ( భవిష్యత్తు అవసరాల కోసం. )


మరి కొందరు వనరుల కోసం బోలెడు డబ్బు ఖర్చుపెట్టి ఇతరగ్రహాలపై కూడా వెతుకుతున్నారు.

ఇతరగ్రహాలపైన వనరులను ఉపయోగించి తయారు చేసే వస్తువుల ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందా ? ఇతర గ్రహాల పైకి సామాన్యులు వెళ్ళగలరా ? కోట్లాది డబ్బు వ్యయం చేసి ఇతరగ్రహాలను ఎందుకు వెతుకుతున్నారో అర్ధంకాదు.


అందుకే వస్తూత్పత్తి రంగం ద్వారా ఉపాధి అవకాశాలు అనే కాన్సెప్ట్ ను కొద్దిగా తగ్గించుకుని ఇతర రంగాల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుకోవాలి.

ఇంకా నిరుద్యోగం తగ్గాలంటే యంత్రాల వినియోగం కొద్దిగానైనా తగ్గించాలి. చేతివృత్తులను ప్రోత్సహించాలి.

పూర్వం ఆడవాళ్ళు అంతగా ఉద్యోగాలు చేసేవారు కాదు. ఇల్లు చక్కదిద్దుకోవటం, ఇంట్లోనే కూరగాయలు పెంపకం, పాడి, కుట్లు అల్లికలు వంటివి చేస్తూ కుటుంబానికి సాయంగా ఉండేవారు.


ఈ రోజుల్లో మరి ఆకాశంలో సగం అంటూ అన్ని ఉద్యోగాలకూ మహిళలు పోటీపడుతున్నారు. బాగానే ఉంది. కానీ ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ అందరికీ అన్ని ఉద్యోగాలు ఎక్కడినుంచీ వస్తాయి ?


ఈ రోజుల్లో నిరుద్యోగం బాగా పెరిగిపోవటానికి ఇది కూడా ఒక కారణం అనిపిస్తుంది. ( ఇది చదివి చాలామంది నన్ను తిట్టుకుంటారు లెండి. ) ఈ విషయంలో మా ఇంట్లో వాళ్ళతో కూడా నాకు వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి. వైద్యం, అధ్యాపక వృత్తి .. వంటి కొన్ని రంగాలలో ఆడవాళ్ళు పనిచేయటం అవసరమే.


కానీ, ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ అందరికీ అన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వమైనా ఎవరు మాత్రం ఎక్కడి నుంచీ సృష్టించగలరు ? ఉద్యోగాలు ఆడవాళ్ళు చెయ్యాలా ? లేక మగవాళ్ళా ? అన్నది కాదు ఇప్పుడు చర్చ. అందరికీ అన్ని ఉద్యోగాలు ఎక్కడి నుంచీ సృష్టించగలరు ? అన్నది సమస్య.


ఇలా ఈరోజుల్లో ఆర్ధికమాంద్యం, నిరుద్యోగం, పేదరికం, వంటి వాటికి ఎన్నో కారణాలున్నాయి.

అన్నింటికీ ప్రధాన కారణం సమాజంలో నైతికవిలువలకు ప్రాధాన్యత తగ్గిపోవటం, అత్యాశ , కోరికలు పెరిగిపోవటం మొదలైనవి..

ఇప్పటి కరెంట్ కోతకే ఇలా ఉంటే , కొంతకాలానికి సహజవనరులన్నీ అయిపోతే మన పరిస్థితి ఏమిటి ? అందుకే ఇప్పటినుంచే యంత్రాలను కొద్దిగా ప్రక్కన పెట్టి మళ్ళీ మన పనులను మనమే చేసుకోవటానికి అలవాటుపడటం మంచిది..


Wednesday, December 21, 2011

పసుపు, వేప, వంటివి తరతరాలనుంచి వాడుతున్నా కూడా బాక్టీరియా వాటిని తట్టుకుని బలపడటం జరగలేదు. ..........


కొంతకాలంక్రిందట చాలామంది ఏమైనా అనారోగ్యం వస్తే ఆయుర్వేద మందులే వాడేవారు.

ఎలాంటి జబ్బు కైనా ప్రకృతిలోనే రోగనివారణ చేసే ఔషధాలు ఉంటాయట.

రోజుల్లో ఎవరికైనా అజీర్ణం వల్ల కడుపునొప్పి వస్తే వాము, కొద్దిగా ఉప్పు కలిపి తినటం జరిగేది.

వాముకు మనమేమీ సూచనలు ఇవ్వనవసరంలేకుండానే అదే లోపలికి వెళ్ళి దానికదే పనిచేసి రోగాన్ని తగ్గించేది.


రోజుల్లో కొన్ని మందులు లోపలికి వెళ్ళి ఎలా పనిచేయాలో సూచనలు ఇచ్చి పనిచేయించే విధంగా నాటి వైద్యరంగం ఉంది.

పూర్వం ఏమో .... వాము అనేకాదు చాలావరకూ మందులు వాటంతట అవే పనిచేసి రోగాలను తగ్గించేవి.

అంటే వాటికి అలా జబ్బులను తగ్గించే గుణం ఉందన్నమాట. జబ్బుకు తగ్గ మందును వాడుకుంటే చాలు ... రోగాలు నయమయేవి.

నాటి వారికి అలా జబ్బుకు మందు సరిగ్గా పనిచేస్తుందో పూర్తిగా తెలియదు కదా !

ఇప్పుడు మనం ప్రాచీన విజ్ఞానాన్ని నిర్లక్షం చేయటం వల్ల విజ్ఞానం చాలా వరకూ మనకు తెలియకుండా పోయింది.
.....................

ప్పుడేమో యాంటిబయాటిక్స్ విపరీతంగా వాడకూడదు అంటున్నారు.

అతిగా యాంటిబయాటిక్స్ వాడితే రోగకారక క్రిములు యాంటిబయాటిక్స్ ను తట్టుకునే శక్తిని సంపాదించి మరింత మొండిగా తయారవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు కదా !


* ప్రకృతిసిద్ధంగా లభించే పదార్ధాలకూ ..... మానవులు తయారుచేసే పదార్ధాలకు తేడా ఇలాగే ఉంటుంది మరి.

మనమందరమూ ఎన్నో తరాలనుంచి పసుపు, వేప, వంటివి వాడుతున్నాము.

పసుపు, వేప, వంటివి తరతరాలనుంచి వాడుతున్నా కూడా
రోగకారక బాక్టీరియా వాటిని తట్టుకుని బలపడే శక్తిని పొందలేదు.

మానవులు కనిపెట్టిన యాంటిబయాటిక్స్ విషయంలో బాక్టీరియా కొద్దిగా గెలుపును సాధించే దిశగా వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది.

పాత రోగాలకు మందులు కనుగొంటుంటే కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి.

వీటన్నింటికీ కారణం ప్రకృతికి దూరమవుతున్న నాటి జీవనవిధానమేనేమో అనిపిస్తుంది. .
..................

* ఆధునికులు కొందరు ఏమంటారంటే వేడి, వాతం లాంటివేమీ లేవు అంతా ట్రాష్ అంటారు.

ఆవకాయ పచ్చడి వరసగా కొన్ని రోజులు తినిచూస్తే వేడి చేయటం నిజమో కాదో తెలుస్తుంది.

జున్ను కొంచెం ఎక్కువ మోతాదులో ఒక వారం రోజులు తిని చూడండి. కాళ్ళు. కీళ్ళు, నడుము పట్టేసి వాతం అనేది ఉందో లేదో తెలుస్తుంది.


పూర్వులు చెప్పిన ప్రతి విషయాన్ని చాదస్తం, మూఢనమ్మకం అనటం రోజుల్లో ఒక ఫేషన్ అయిపోయింది.

పెద్దలు చెప్పిన విషయాలను సరిగ్గా పరిశీలించకుండానే వ్యతిరేకించటం కూడా ఆధునిక మూఢత్వం అని చెప్పుకోవచ్చు. ( పరిశీలించినా మనకు తెలియకపోవచ్చు కూడా ).

..................
నాటి శాస్త్రవేత్తలు కనుగొన్న చాలా విషయాల్లో ... కొన్ని విషయాలు తప్పు అని
కొంతకాలం తరువాత తెలుస్తోంది.


వాళ్ళు ఒక్కోసారి ఒక్కోరకంగా చెబుతుంటారు.

ఉదా.. నూనె అస్సలు వాడకూడదు . వాడితే కొలెస్ట్రాల్ బాగా పెరిగి పోయి చాలా ప్రమాదం అని కనుగొన్నాం. అంటారు.

అయ్యబాబోయ్ ! అని చెప్పి మనం నూనె డబ్బాలు నున్నగా తోమి బోర్లించిన తరువాత ...మళ్ళీ ఏమంటారంటే ....


అబ్బే, నూనె బొత్తిగా మానేస్తే మోకాలి చిప్పలు అరిగిపోయి జనాలకు ఇక నడవలేని పరిస్థితి వచ్చినా రావచ్చు. చర్మం ఎండిపోనూవచ్చు. అని మళ్ళీ పరిశోధనల్లో తేలింది అంటారు. .

అంతేకాక ముందుముందు ఇంకా ఏం కొత్తగా కనుగొంటామో కూడా .... ఇప్పుడే చెప్పలేం అంటారు.

ఇక ఏం చెయ్యాలో ? ఏం చెయ్యకూడదో ? తెలియక సామాన్యజనాలము అయోమయంలో పడిపోతాము .

ఇలాంటివన్నీ చూశాక నాకు ఏమనిపించిందంటే ... మన పూర్వులు తరతరాల నుంచి మనకు అందించిన ఆహారపు అలవాట్లను పాటించటం మంచిది అనిపించింది.

అయితే పూర్వం వాళ్ళు బాగా కష్టపడి పనిచేసేవారు . కాబట్టి ఎక్కువగా ? నూనె పదార్ధాలు తిన్నా కూడా వారికి చక్కగా అరిగిపోయేది.

ఇప్పటివాళ్ళలా ఎండిపోయికాకుండా, వారి శరీరం మిసమిసలాడుతూ ఉండేది.

మరి మనకు పెద్దగా శారీరిక శ్రమ లేదు కదా !
ఎక్కువగా నూనె పదార్ధాలు తింటే ఏమవుతుందో ?

అందుకని మధ్యేమార్గంగా మనము ఎవరికి తగ్గట్టుగా వారు నూనె పదార్ధాలు వాడుకుంటే మంచిది. .
.......................

పసుపు , వేప వంటివి కూడా ఎంతలో వాడుకోవాలో అంతలోనే వాడుకోవాలి. ఏదైనా అతి పనికిరాదు కదా !

* ఈనాడు మనం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనిక మందులు, వాతావరణ కాలుష్యం వల్ల .కూడా పసుపు, వేప వంటి వాటిల్లో కూడా వాటి సహజగుణాలు క్షీణించే ప్రమాదముంది.

.............,
* ఇవన్నీ గమనిస్తే , మనిషి ప్రకృతితో పోటీపడటం, ప్రకృతిని సవాల్ చేయటం ....... వంటి చేష్టలు మాని ప్రకృతితో సామరస్యంగా సహజీవనం చేస్తేనే మనిషితో సహా అన్ని జీవులకు మనుగడ ఉంటుంది.
............

రోజుల్లో వైద్యరంగంలో రకరకాల చిత్రమైన పద్ధతులు వస్తున్నాయి.

పూర్వం చరకుడు, శుశ్రుతుడు వంటి వారి కాలంలోనే శస్త్రచికిత్సలు జరిగినట్లు పెద్దలు గ్రంధాలలో తెలియజేసారు.


పూర్వం ఎన్నో పెద్దపెద్ద యుద్ధాలు జరిగాయి. యుద్ధాలలో గాయపడిన వారికి గొప్ప వైద్యవిధానాల ద్వారా నయం చేసినట్లుగా కూడా గ్రంధాలలో చెప్పబడింది.


పూర్వులకు తెలిసినట్లే .... మనకు కూడా రోగానికి మందో సరిగ్గా తెలిసేవరకూ చిత్రమైన ఆధునిక వైద్యవిధానాలూ , తద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో తిప్పలు తప్పవు.


కాన్సర్ జబ్బుకు కూడా ప్రకృతిలో మంచి మందు ఉండే ఉంటుంది. మందును ఎవరైనా తెలుసుకుంటే బాగుండు. .

* అయితే అసలు జబ్బులూ రాకుండానే మంచి జీవన విధానం , పొల్యూషన్ లేని వాతావరణం ఏర్పరుచుకుంటే మరీ మంచిది. ...

 

Monday, December 19, 2011

ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా ...


ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.

తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేసే దొంగ స్వాములు కొందరి గురించి వింటూనే ఉన్నాము.

ఇలాంటి వారివల్ల ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడని పరిస్థితి ఏర్పడింది.

హేతువాదుల వంటి వారి వల్ల ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అందువల్ల మనం వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

కొందరు స్వార్ధం వల్ల మరి కొందరు తెలిసీతెలియనితనం వల్ల సమాజంలో కొన్ని మూఢాచారాలను వ్యాపింపచేశారు.

మేధావుల్లో కూడా కొందరు ఎలా ఉంటారంటే వారు మంచివారే కానీ తాము నమ్మిందే నిజం అని పిడివాదం చేస్తుంటారు.


ఇలాంటివారు ప్రాచీన కాలంలోనూ, ఈ కాలంలోనూ, భవిష్యత్తులో కూడా ఉంటారు.

ఉదా.......మాకు తెలిసిన ఒక ( అల్లోపతీ ) డాక్టర్ ఉన్నారు. వారు మంచి వ్యక్తే.

కానీ వారు ఏమంటారంటే హోమియో మందులు ఏం పనిచేస్తాయి ? అవి వట్టి పంచదార బిళ్ళలు. అంటారు.

కానీ ,మాకు హోమియో బాగా పని చేసింది. ఆ విషయం చెప్పినా వారు ఒప్పుకోరు.

మీ అనారోగ్యం కాకతాళీయంగా తగ్గింది. హోమియో వల్ల కాదు అని పిడి వాదం చేస్తారు.

ఆయుర్వేదం, హోమియో, అల్లోపతి ఏ వైద్యమన్నా మాకు గౌరవమే.

ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఇలా పిడివాదం చేసే వారిలో మేధావులు కూడా ఉంటారు అని. .

( హోమియో వైద్యాన్ని కనుగొన్నది విదేశీయులే .... సమాజానికి ఉపయోగపడేది ఎవరు కనిపెట్టినా వారు స్వదేశీయులైనా విదేశీయులైనా వారిని గౌరవించాలి. )

సరే ఆ విషయం అలా ఉంచితే ఆధ్యాత్మిక రంగంలో కూడా పిడివాదులు ఉంటారు. తెలిసీతెలియనివారూ ఉంటారు. ఇలాంటి వారి వల్ల కూడా కొన్ని మూఢ నమ్మకాలు ప్రచారంలోకి వస్తాయి.

ఇలాంటి వారందరి వల్ల దైవం , పూజలు అంటే ఒకలాంటి భయం కలిగే పరిస్థితులు వచ్చాయి.

ఈ రోజుల్లో ప్రేమభక్తితో కన్నా భయంతో పూజలను చేసేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.

అసలు దైవం అంటే ఎందుకు భయపడటం ?

ఈ రోజుల్లో పూజలలో ఆడంబరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పూజకు మూలకారణమైన దైవానికి ,ప్రేమభక్తికి తక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు అనిపిస్తోంది. .

పూర్వపుకాలం వాళ్ళకు ఎంతో ఓపిక , శారీరిక మానసిక దృఢత్వం ఉండేవి. వాళ్ళు పూజలు విధివిధానంగా భక్తిగా చేసుకునేవారు.

ఈ రోజుల్లో మనుషులకు అంతటి ఓపిక ఎక్కడిది ? ఇవన్నీ ఊహించే కాబోలు పూర్వులు .కలికాలంలో నామస్మరణను మించినది లేదు. అని చెప్పటం జరిగింది.

అయితే ఓపిక ఉన్నవాళ్ళు వాళ్ళ ఓపిక ప్రకారం పూజలు చేసుకోవచ్చు.

కానీ కొందరు పూజ చేసేటప్పుడు భక్తి కన్నా పూజలో ఎక్కడ పొరపాట్లు వస్తాయో ? వస్తే ఏమవుతుందో ? అనే భయంతో పూజలు చేస్తూ ఉంటారు.

దైవం అంటే మనకు కొద్దిగా భయం ఉండవచ్చు . కానీ ఆ భయం దైవానికే దూరం అయ్యేలా ఉండకూడదు కదా !

ఒక చంటిబిడ్డ తన తల్లితండ్రుల దగ్గరకు ఏ భయం లేకుండా ఎంత స్వతంత్రంగా వెళ్తుందో ..... భక్తులు భగవంతుని అంతే స్వతంత్రంగా ఆరాధించాలి.

అంతే కానీ భయంతో ఆరాధించటం ఎందుకు ?

లలితాసహస్ర నామాలలో " సుఖారాధ్యా " అన్న నామం ఎంత హాయిగా అనిపిస్తుందో కదా !

కష్టంలోనూ, సుఖం లోనూ అందరికి తోడునీడ దైవమే.

ఒక్కోసారి మనసు బాధతో ఉన్నప్పుడు నేనున్నానని గుర్తు వచ్చేది దైవం మాత్రమే. భక్తి భయపడే స్థాయికి రాకూడదు.

ఒక ఆకును కానీ, కొద్దిగా నీటిని కానీ, కొద్దిగా పువ్వులను కానీ ప్రేమతో సమర్పిస్తే చాలు అని భగవానుడే చెప్పటం జరిగింది. ఏమీ సమర్పించకపోయినా దైవం ఏమీ అనుకోరు.

మన అందరికీ హితులు, స్నేహితులు, జన్మజన్మల ఆత్మ బంధువు, ఆత్మ, పరమాత్మ అన్నీ దైవమే.

దైవం ఎంత గొప్ప అయినా మనలో ఆత్మగా అత్యంత సన్నిహితుడు .

తల్లిదండ్రులు ఎంత గొప్ప వారైనా పిల్లలకు ఆత్మీయులే కదా ! . రామకృష్ణపరమహంస చెప్పేవారట. దేవునికి భయపడటం ఎందుకు ? అని.

మనకు ఎవరైనా విసుగుతో పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టిన దానికన్నా .....ప్రేమతో పెట్టిన కొద్దిగా పదార్ధాలే బాగుంటాయి.

* అలాగే భగవంతుని కూడా విసుగుతో, భయంతో బోలెడు సేపు పూజ చెయ్యటం కన్నా ..... ప్రేమ భక్తితో మీకు వీలు కుదిరినంత సేపే పూజ చెయ్యండి అని నా అభిప్రాయం .

ఒకప్పుడు నేను కూడా తక్కువసేపు పూజ చేస్తే దేవునికి కోపం వస్తుందేమోననే భయంతో ఎక్కువసేపు పూజ చెయ్యటం జరిగేది.

పనులు మాని ఎక్కువసేపు అలా పూజ దగ్గర కూర్చున్నప్పుడు నాకు కూడా అయ్యో ! పనులేమీ అవలేదు కదా ! అని మనసు పీకుతూ ఉండేది....

ఈ గందరగోళంతో ఏం చెయ్యాలో ? ఏం చెయ్యకూడదో ? అర్ధం కాక విషయం మా అమ్మ మరియు నాన్నగారి వద్ద చెప్పి బాధ పడ్డాను.

అప్పుడు వారు ఏమన్నారంటే నువ్వు అంతసేపు పూజ వద్ద కూర్చుంటే పనులెలా జరుగుతాయి ? ఇంట్లో వారికి విసుగు వచ్చే అవకాశం ఉంది.

అందుకని నీ పనులు చేసుకుంటూనే కుదిరినప్పుడు దైవనామస్మరణ చేసుకుంటూ ఉండు. ఆన్నారు.

ఈ సలహా నాకు నచ్చింది. వీలున్నంత వరకూ పాటిస్తున్నాను.

ఆధునిక విజ్ఞానం అయినా ..ఆధ్యాత్మికత అయినా స్వార్ధ ప్రయోజనాలకు వాడకూడదు.

వ్రాసిన విషయాల్లో పొరపాట్లు ఉంటే దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. ఎవరైనా తెలిసీతెలియక తప్పులు చేసినా .... దైవం వారిని ఒకవేళ శిక్షించవలసి వస్తే అది కూడా వారి మంచికే అవుతుంది.

దైవం కోరుకునేది . అందరూ పరమపదాన్ని పొంది ఎప్పటికీ పరమానందంగా ఉండాలనే.....

Friday, December 16, 2011

కొన్ని ఆలోచించవలసిన విషయాలు....



కొందరు ఏమంటారంటే ఈ రోజుల్లో కూడా ఇంకా దేవుడు, దెయ్యం వంటి చాదస్తాలు ఏమిటి ? అంటారు . వాళ్ళలా ఎందుకంటారో అర్ధం కాదు .

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దైవం శాశ్వతం.

ఇక ప్రాచీన కాలమయినా ....ఆధునిక కాలమయినా మార్పు ఏముంది ? ప్రాచీనులు భోజనం చేసినట్లే మనమూ చేస్తున్నాము.. వారు నిద్ర పోయినట్లే మనమూను. వారిలాగే అహంకార, మమకారాలు మనకూ ఉన్నాయి.


ప్రాచీనకాలం నాటి విజ్ఞానాన్ని తక్కువగా చూస్తూ .... ఇప్పటికాలపు విజ్ఞానం వల్ల అన్నీ లాభాలే అంటున్నారు కొందరు., ఈ నాటి విజ్ఞానంలో కొన్ని లాభాలతో పాటు పొరపాట్లు కూడా జరుగుతున్నాయి.


రాకెట్లను అంతరిక్షంలోకి పంపటం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉండవచ్చు అంటున్నారు కొందరు. . రాకెట్లు తిరిగి భూమికి వచ్చేటప్పుడు అంతరిక్షం నుంచి కొత్తరకం సూక్ష్మజీవులు కూడా భూమికి వచ్చే అవకాశముందట. వాటి వల్ల భూమిపై కొత్తరకం జబ్బులు వ్యాపించే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలిందట.


యాంటిబయాటిక్స్ కనుగొనటం వల్ల వ్యాధులు బాగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా ఇప్పుడు మళ్ళీ తేలుతున్నదేమిటంటే, యాంటిబయాటిక్స్ ను విపరీతంగా వాడటం వల్ల వ్యాధికారక బాక్టీరియా దానికి అలవాటుపడి యాంటిబయాటిక్స్ కు కూడా లొంగని విధంగా శక్తిని సాధిస్తున్నట్లుగా పరిశోధనల్లో తేలిందట.


ఇలా ఏ మందులకూ లొంగని రోగాల వల్ల ప్రజలకు మరిన్ని కష్టాలు వచ్చిపడే అవకాశం ఉందనీ, అందువల్ల యాంటిబయాటిక్స్ ప్రతి చిన్న రోగానికీ విపరీతంగా వాడకూడదనీ వైద్యులు చెబుతున్నారు.


ఎన్నో ఉపయోగాలున్నాయని అందరూ భావించిన ప్లాస్టిక్ ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సమస్యగా తయారయ్యింది. ప్లాస్టిక్ నుంచి పెట్రోల్, గ్యాస్ తయారుచెయ్యవచ్చు అంటున్నారు. ఇది కొంతలో కొంత శుభ పరిణామమే.


అయితే ఈ పెట్రోల్ వాడకం ద్వారా వాతావరణం కలుషితం కాదని ప్రస్తుతానికి చెబుతున్నారు ..కానీ కలుషితం అవుతుందా ? కాదా ? ఓజోన్ పొర దెబ్బ తింటుందా ? లేదా ? అన్నది కాలమే తేల్చాలి.


ఈ మధ్య టీవీ చానల్ లో ఒక వార్త వచ్చింది. ఏమంటే కొందరు శాస్త్రవేత్తలు ఒక పదార్ధం కనిపెట్టారట. దానితో చేసిన వస్త్రం కప్పుకుంటే మనిషి ఎదుటి వారికి కనపడరట.

ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ విన్నాక ఆశ్చర్యంగా అనిపించింది.

ఈ వస్త్రం పోలీసు వారికి ఒక వరం . అని ఆ శాస్త్రవేత్తలు భావిస్తున్నారట. అయితే ఈ వార్త విన్న ప్రజలు మాత్రం బెంబేలు పడిపోతున్నారట.

పోలీసుల సంగతి అటుంచితే ....... నేరస్తులకు ఇది ఒక వరంలా ఉపయోగపడుతుందనీ, ఇటువంటివి ఆవిష్కరించవద్దు మహాప్రభో ! అని ప్రజలు శాస్త్రవేత్తలను వేడుకుంటూన్నారని వార్తా సారాంశం.


ఇలాంటివి ఏమీ లేకపోయినా నేరస్తులు అందినమటుకు అందినట్లు దోచుకుపోతున్న ఈ రోజుల్లో .... ఇలాంటివి అందుబాటులోకి వస్తే ఇక అంతే సంగతులు. అని ప్రజల ఘోష. ( పట్టించుకునేదెవరు ? )

పోలీసులు, దొంగలు ఇద్దరూ కూడా ఈ వస్త్రాన్ని ఉపయోగిస్తే కధ మళ్ళీ మొదటికొస్తుంది.


శాస్త్రవేత్తలు ఏమంటారంటే ,మేము కనిపెట్టిన విజ్ఞానాన్ని ప్రపంచ క్షేమం కొరకు మాత్రమే ఉపయోగిస్తాము. అంటారు.

అందరూ వారిలా మంచిగానే ఆలోచిస్తే ప్రపంచంలో ఇన్ని అన్యాయాలు ఎందుకు జరుగుతాయి ? అన్నది అసలు విషయం.


ఇలాంటివాటిని నెగటివ్ గా ఎలా ఉపయోగించాలి ? అని ఆలోచించేవారు కూడా కొందరు ఉంటారనేది అందరూ ఆలోచించవలసిన విషయం.

ఇవన్నీ ఎవరినీ నొప్పించటానికి వ్రాయలేదండి. దయచేసి అపార్ధం చేసుకోవద్దని కోరుకుంటున్నాను..


* ప్రాచీన కాలంలో కూడా కొందరికి ఇలా మాయమయ్యే శక్తులు ఉండేవని చెబుతారు. అయితే గొప్ప తపస్సులు వంటివి చేసిన వారికి మాత్రమే ఇలాంటి శక్తులు అందుబాటులో ఉండేవనీ, అందరికీ అందుబాటులో ఉండేవి కాదని చెబుతారు.


* శాస్త్రవేత్తలు లోకానికి ఎన్నో ఉపయోగకరమైన ఆవిష్కరణలను కూడా అందించారు. అందుకు మనము వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.


Wednesday, December 14, 2011

శాస్త్రీయ నిరూపణ.... టెక్నాలజీ.



నేను ఆధునిక శాస్త్రవిజ్ఞానానికి వ్యతిరేకిని కాదు. అయితే విజ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవాలి అన్నది నా అభిప్రాయం.

కొందరు ఏమంటారంటే శాస్త్రీయంగా నిరూపణ అయితేనే ఏ విషయాన్నయినా నమ్ముతాము అంటారు.

ఆధునిక శాస్త్ర విషయాలు కొన్ని , ఒకసారి నిరూపణ అయిందని భావించాక కొంతకాలానికి ఆ విషయం పొరపాటు అని తేలుతోంది.

ఇలా పదేపదే మార్పులుచేర్పులు జరుగుతున్నప్పుడు శాస్త్రబద్ధంగా నిరూపించటం అనేది ఎప్పటికి జరుగుతుంది ?

అంతిమంగా ఏ విషయమైనా ఇదీ సత్యమని తేలినప్పుడే కదా ! అది నిజమని నిరూపణ అయ్యేది.

ఒకసారి సత్యం అని నిరూపణ అయ్యాక కొంతకాలానికి మళ్ళీ అది పొరపాటని మళ్ళీ కొత్త సత్యం కనుక్కుంటే ఇక ఏది శాస్త్రీయమని నమ్మాలి ?

అందరూ తెలియని వాళ్ళే అయినప్పుడు ఏది తప్పో ? ఏది ఒప్పో ? ఎవరు నిర్ణయిస్తారు ?

హేతువాదులు చెప్పే శాస్త్రీయత అంటే ఏమిటి ? ఏదైనా అంతిమంగా నిర్ధారణ అయినప్పుడే గదా నమ్ముతారు.

ఎప్పటికప్పుడు మారుతూ ఉండే విషయం .శాస్త్రీయంగా నిరూపణ అయింది అని ఎలా చెప్పగలరు ?

అలా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటూ, నిరూపణ నిరంతరాయంగా జరుగుతున్నప్పుడు దాన్ని ఎలా నమ్మాలి ?

........................

కొందరు నాస్తికులు ఏమంటారంటే , ...........ఆస్తికులు కూడా ఈ నాటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కదా ! అంటారు. ..

మరి దైవం లేరనే నాస్తికులు కూడా ఆ దైవం ప్రసాదించే గాలిని పీల్చే బ్రతుకుతున్నారు.

వాళ్ళు తయారుచేసే అనేక వస్తువులు కూడా దైవసృష్టిలోని పదార్ధాలతో తయారుచేయబడినవే.

విమానాలు తయారుచేయటానికి ముందే పక్షులు గాలిలో ఎగురుతున్నాయి. నౌకలు తయారుచేయబడటానికి ముందే చేపలు నీటిలో ఈదుతున్నాయి.

సృష్టిలోని టెక్నాలజీని చూసి ఎంతో నేర్చుకుంటూ కూడా కొందరు ..... దైవం లేరు అంటారు. ఇది అన్యాయం.

ఈ నాటి టెక్నాలజీ లేకపోయినా ప్రాచీన కాలం నుంచీ ఆచారవ్యవహారాలు, పురాణేతిహాసాలు, ఇంకా ఎన్నో ప్రాచీన గ్రంధాలు ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి. ఇక ముందూ కొనసాగుతాయి..

..............

కొందరు ఏమంటారంటే , మన దేశంలోని ప్రజల ఆలోచనాధోరణి వల్ల దేశం ఎంతో వెనకబడిపోయింది. ఇతరదేశాలు టెక్నికల్ గా ఎంతో అభివృద్ధిని సాధించాయి అంటారు.

ఆ దేశాలు మొదట అలా అభివృద్ధిని సాధించినట్లు కనిపించినా ఇప్పుడు చూడండి. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిన దేశాలు అనుకున్న దేశాలు ఆర్ధికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్నాయి.

మరి వారికి పారిశ్రామికాభివృద్ధి జరిగీ కూడా ఆర్ధికమాంద్యం ఎందుకువచ్చింది ?
.........

అభివృద్ధి చెందిన టెక్నాలజీతో గొప్పగా కట్టిన కట్టడాలను చూసినప్పుడు గొప్పగానే అనిపిస్తుంది.

అబ్బో ! మనుషులు ఎంత ఎదిగిపోయారు కొండల్ని కూడా పిండి చేయగలుగుతున్నారు అనిపిస్తుంది.

కానీ, అలా కట్టడానికి వెనుక ఎంత ఇనుము, ఎంత ఇసుక, ఎంత కంకర ఇలా ఎన్ని సహజవనరులు వాడారో కూడా తెలుసుకుంటే.......

కట్టడాలనే కాదు ఈ రోజుల్లో మనం వాడుతున్న వస్తువుల్లో చాలా మనకు అనవసరమైనవే.

ప్రాధమిక అవసరాలైన ఆహారం, వైద్యం, రక్షణ, విద్య, వసతి.........ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం మాని విలాసవంతమైన వస్తువుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నాము. అందువల్ల పేదరికం అలాగే ఉండిపోతూంది.

. మన పూర్వులు ఇలాగే విచ్చలవిడిగా సహజవనరులను వాడి ఉంటే , ఇప్పుడు మనకు ఇవేమీ ఉండేవి కాదు.

ఇలా అన్ని సహజవనరులను విపరీతంగా వాడేస్తే మనం మళ్ళీ ఇనుప గనులను, సృష్టించగలమా ? పిండి చేసిన కొండలను తిరిగి సృష్టించగలమా ?

కోరికలకు అంతెక్కడ ? మనిషి కోరికలను పెంచుకుంటూ పోతే భూమి లాంటి పది గ్రహాలలోని సహజవనరులైనా సరే సరిపోవు.

రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకొని అయినా మనం మన అలవాట్లను మార్చుకోవాలి.

ఎంతో ఖర్చు పెట్టి, గొప్ప టెక్నాలజీతో కట్టడాలు కట్టినా భూకంపాలు వంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కట్టడాలు పడిపోకపోయినా కొద్దిగా బలహీనమైనా అంత పెట్టుబడీ వృధానే కదా !

ప్రకృతి ముందు మనిషి ఎంత ?

* దైవం అంటూ ఎవరూ లేరు..... మనిషే గొప్ప . అని ఎవరైనా భావించటం హనుమంతుని ముందు కుప్పిగంతులు వెయ్యటంలా హాస్యాస్పదం...


Monday, December 12, 2011

గత శుక్రవారం మేము కొందరం ........

* గత శుక్రవారం మేము కొందరం కలిసి ఒక ఊరిలోని అనఘాదేవీ సమేత దత్తాత్రేయస్వామి వారి దేవాలయానికి వెళ్ళామండి.


* దేవాలయంలో ఇతర దేవుళ్ళ ఉపాలయాలు కూడా ఉన్నాయి.

దైవ దర్శనం చేసుకున్నాము . దేవాలయంలో అన్నదానం జరుగుతుంటే మేమూ అక్కడే భోజనాలు చేశాము.

తరువాత మా ఫ్రెండ్ ఒకామె మమ్మల్ని అక్కడకు కొంచెం దూరంలో ఉన్న వాళ్ళ అత్తగారింటికి తీసుకువెళ్ళింది.


* ఆ ఇల్లు పాతకాలం మోడల్ ఇల్లు. కానీ చాలా గదులున్నాయి. ఒక గదిలో కిటికీలు కూడా లేవు. అయినా గదంతా తెల్లగా వెలుతురుగా ఉంది.

మేము వెళ్ళినప్పుడు కరెంట్ లేకపోయినా , ఈ వెలుతురు ఎక్కడినుంచీ వస్తోందబ్బా ! అని చూస్తే పైన వెంటిలేటర్ లాంటిది కనిపించింది.


* ఆ అద్దంలోనుంచి సూర్యరశ్మి గదంతా పరుచుకుంది. మరి అద్దం తీరో ఏమో వెలుతురు వెన్నెలలా తెల్లగా ఉంది.


* ఒక గ్రిల్ పెట్టి ( రక్షణకు ) పైన అద్దం పెట్టారు. ఆ అద్దానికి అవతలి వైపు నుంచీ ఎవరైనా చూసినా కూడా గదిలోని వారు కనపడరట. అద్దం అంత మందంగా ఉంటుందట.

* ఇదంతా చూశాక పూర్వకాలం వాళ్ళు ఎంత తెలివి గల వాళ్ళో అనిపించింది.

ఈ రోజుల్లో కూడా కొత్తగా మళ్ళీ ఇలా సూర్యరశ్మి వచ్చేటట్లు ఇళ్ళు, ఆఫీసులు కట్టడం మొదలుపెడుతున్నారట.

* ఆ విధంగా విద్యుత్ ఆదా అవుతుందని. ఇంకా ఈ మధ్య ఒక వార్త వచ్చింది.

రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ వెలుగుల్లో ఉంటున్నవారికి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని కనిపెట్టారట శాస్త్రవేత్తలు.


* అలా విద్యుత్ వెలుగులోనే బతుకుతున్న వారి బయోలాజికల్ క్లాక్ దెబ్బతింటుందట.

* ఇంకా నేను ఒక దగ్గర చదివిందేమిటంటే , పూర్వం కట్టడాలను ఇప్పటిలా సిమెంట్ తో కాకుండా అందుకు బదులుగా సున్నం, బెండకాయ జిగురు, బెల్లము, ఇంకా అనేక పదార్ధాలు కలిపి ఉపయోగించేవారట.


పురాతనమైన కట్టడాలు కొన్ని ... ఇప్పటి వాటికన్నా పటిష్టంగా ఉండటం మనం చూస్తూనే ఉన్నాము. పురాతన దేవాలయాలు ఎన్నో ఏళ్ళయినా పటిష్టంగా ఉంటున్నాయి.


* ఆ విధంగా ప్రాచీనులు పర్యావరణానికి హాని లేకుండా పద్ధతిగా జీవించారు. మరి మనమో ! బొగ్గు నిలువల్ని విపరీతంగా తవ్వేసి విద్యుత్ గా మార్చి ........ఎంత అభివృద్ధి చెందామో ? అని మురిసిపోతున్నాము.


ప్రకృతిలో ఇలా బొగ్గు తయారవ్వాలంటే వేల సంవత్సరాల కాలం పడుతుందట. ఇక అణువిద్యుత్ గురించి అందరికీ తెలిసిందే.

* ఇంకా , అహా ! ఇప్పటివాళ్ళకెంత విజ్ఞానం తెలుసో పాతకాలం వాళ్ళకు ఏమీ తెలియదు ... పల్లెటూరి గబ్బిలాయిలు. అనుకుంటున్నారు.


డిల్లీలో కుతుబ్ మీనార్ వద్ద ఒక ఉక్కు స్తంభం ఉందట. అది ఎన్నో ఏళ్ళనుంచీ ఉందట. వానకు తడిచినా కూడా తుప్పు పట్టదట.

* అది ఏ విధమైన మెటల్ తో చేశారో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియటం లేదంట.

ఇలా ఎన్నో మనకు తెలియని విషయాలున్నాయి. ఇవన్నీ చూస్తే ఇప్పటి వాళ్ళకే అన్నీ తెలుసు. పాతకాలం వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవటం భ్రమ మాత్రమే.

నేను వార్తాపత్రికలు ఎక్కువగా చదువుతాను. కానీ ఇప్పుడు సరిగ్గా చదవటానికి సమయం సరిపోవటం లేదండి.

* నిన్న ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్ బాగుంది. శీర్షిక పేరు........" కొత్త బూచాళ్ళు...భద్రతకు సవాళ్ళు " ........4 వ పేజీలో ఉంది. ....వీలుకుదిరితే తప్పక చదవండి....



Saturday, December 10, 2011

రేపు తెలుగు బ్లాగుల దినోత్సవము సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.





రేపు
తెలుగు బ్లాగుల దినోత్సవము సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.


తెలుగు బ్లాగులోకంలో నా బ్లాగును కూడా ప్రోత్సహిస్తున్న అందరికీ కృతజ్ఞతలండి. నేను బ్లాగ్ వ్రాస్తానని ఎప్పుడూ ఊహించలేదు. దైవానికి అనేక కృతజ్ఞతలు..




Friday, December 9, 2011

కొన్ని విషయాలు, ఇంకా ......ఆధునిక సైన్స్ ను మాత్రం పూర్తిగా ఎందుకు ,ఎలా నమ్మాలి ?

 

*నిన్న తిరువణ్ణామలైలో కార్తీకమహాదీపోత్సవం టీవీలో చూస్తుంటే మేము అక్కడకు వెళ్ళినప్పటి సంగతులు గుర్తు వచ్చాయి.

ఆ ఉత్సవం, ఇంకా పున్నమి వెన్నెలలో చేసే గిరిప్రదక్షిణ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి .

............................

ఇక, కొందరు ఏమంటారంటే ..
విద్యుత్ ఉంటే చాలు ఇక బ్రహ్మాండం బద్దలైపోయేంత అభివృద్ధి జరిగిపోతుందంటూ ఊదరగొట్టేస్తుంటారు
.

ఇప్పుడు అందరు విద్యుత్
విద్యుత్ అంటూ వెంపర్లాడి పోతున్నారు.

అప్పుడు సోలార్ ఎనర్జీ వల్ల విద్యుత్తును పొంద వచ్చు కదా ! సోలార్ ఎనర్జీనే తక్కువ ఖర్చుతో ఎలా పొందాలో పరిశోధనలు చెయ్యాలి గానీ ..ప్రమాద కరమైన...?


అణుకేంద్రాలనుండి విడుదలయ్యే వ్యర్ధాలను ఏం చేస్తారో ? ఈ వ్యర్ధాలు కొన్నిసార్లు సముద్రాలలో కూడా కలిసే అవకాశం ఉందట.రేడియేషన్ వల్ల ప్రపంచానికంతా దీర్ఘకాలంలో ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు.

ఇలా ఎంతో రిస్క్ ఉన్న వీటిని మేధావులు కూడా ప్రోత్సహించటం దురదృష్టకరం.


* అయినా ,పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ఒక్కటి ఉంటే సరిపోదు కదా ! ఎన్నో సహజవనరులు వాడుకోవలసి ఉంటుంది. ఇలా అన్నీ వనరులనూ వాడేసి కొత్త వస్తువులు తయారుచేయటమేనా మనిషి జీవితధ్యేయం ?

పోనీ ప్రపంచం ఏమైపోయినా పట్టించుకోకుండా కొత్తకొత్త వస్తువులు సృష్టిస్తే అప్పుడు మనుషులు ఆనందంగా ఉంటారని ఏమిటి గ్యారంటీ ?


ఇవన్నీ లేకపోయినా మన పూర్వులు హాయిగా వెన్నెల్లో విందుభోజనాలు చేసి కూడా ఎంతో సంతోషంగా జీవించారు.
ప్పటివాళ్ళు ప్రకృతికి దూరమై ఏసి గదులు తప్ప వెన్నెల అంటే కూడా ఇప్పుడు చాలామందికి తెలియదు.

ప్రపంచం అసలు ఎటు పోతున్నదో అర్ధం కావటంలేదు
.
......................

ఇక ,ఆధునిక విజ్ఞానం విషయానికి వస్తే..........
.
నాకు ఆధునిక విజ్ఞానం అన్నా గౌరవమే. ఒక రకంగా చూస్తే ఈనాటి పరిశోధనల వల్ల కూడా ప్రాచీన విజ్ఞానం యొక్క గొప్పదనం అందరికీ తెలుస్తోంది.

* ఆధునిక సైన్స్ ను కూడా పూర్తిగా ఎందుకు ,ఎలా నమ్మాలి?  ఆధునిక విజ్ఞానం విషయంలో కూడా ఒకసారి నిరూపణ అయిన విషయాలే కొంతకాలానికి పొరపాటుగా ఋజువయిన సంఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాము.

ఈ మధ్యే " కాంతి యొక్క వేగం " విషయంలో .... ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

* శాస్త్రవేత్తలు అంటే నాకు గౌరవమే. నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. పొరపాట్లు ఎవరికైనా వస్తాయి.

* అయితే శాస్త్రవేత్తల మధ్య కూడా సిద్ధాంత రాద్ధాంతాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరు అవునన్న దానిని ఇంకొకరు కాదంటూ ఉంటారు.

ఆధునిక ఆవిష్కరణల వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి....... కొన్ని విపరీత ఆవిష్కరణల వల్ల ప్రమాదాలూ కలుగుతున్నాయి.


రేడియేషన్ తో ట్రీట్ మెంట్ వల్ల వైద్యరంగంలో కాన్సర్ వంటి వ్యాధులు కొంతవరకూ తగ్గుతున్నాయి అంటున్నారు కానీ, నాకు అనిపిస్తుంది ఈ రకమైన ట్రీట్ మెంట్స్ వల్ల 100 మందికి వ్యాధి తగ్గితే , ఈ రేడియేషన్ వ్యర్ధాలు గాలిలో, నీటిలో, భూమిలో కలవటం వల్ల 1000 మందికి కొత్తగా వచ్చే అవకాశమూ ఉంది అనిపిస్తుంది..

 
  అణుశక్తిని విద్యుత్ రంగంలోను, వైద్యరంగంలోను వాడుతున్నారు. అయితే, తద్వారా వచ్చే రేడియేషన్ సమస్యలు ఉన్నాయి..అణువ్యర్ధాల విషయంలోనూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. .విద్యుత్ మరియు  వైద్యానికి అణుశక్తి కాకుండా ఎన్నో విధానాలున్నాయి.అవి వాడుకోవచ్చు.

కొన్ని ప్రయోజనాల కొరకు.. పెద్దప్రమాదాలు ఉన్నదానిని పట్టుకోవటం ఎంతవరకు సరైనదో ? తెలియటం లేదు.

  
ఇంకా ప్లాస్టిక్ వంటి విషయాల్లో మొదట అద్భుతంగా చెప్పుకున్న విషయాలే కాలం గడిచాక ఇప్పుడు.... వాటివల్ల కలిగే కొన్ని నష్టాలను అనుభవిస్తూనే ఉన్నాము.

ఇలా చాలా ఉంటాయి. నేను ఎవరినీ తప్పుపట్టడం లేదు. పొరపాట్లు ఎవరికైనా వస్తాయి.

*అయితే , ప్రతిదానికీ దైవాన్ని ప్రాచీన గ్రంధాలనూ విమర్శించటం తప్పు అన్నదే నా అభిప్రాయమండి.


ప్రాచీనులకు కూడా ఇప్పటి కన్నా మెరుగైన విజ్ఞానం తెలుసేమో ? కొన్ని కారణాలవల్ల ఆ నాగరికత కాలగర్భంలో కలిసిపోయిందేమో ? అనిపిస్తుంది..
................

అణురియాక్టర్లు ప్రమాదానికి గురయినప్పుడు సీల్ చేసి వాటిని మూసివేస్తారంటారు. కానీ మామూలుగా పనిచేసే రోజుల్లో కూడా వ్యర్ధపదార్ధాలు వస్తాయట. మరి రోజూ వ్యర్ధాలుగా వచ్చే వాటిని ఏం చేస్తారన్నది ? నాకు
తెలియదండి.

ఈ పేరా వ్యాఖ్యలు చూసాక వ్రాసానండి.


Wednesday, December 7, 2011

ఈ విధంగా భావించవచ్చేమో .........



శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం చాలా గొప్పది.

శ్రీమహావిష్ణువు శ్రీవామనావతారంలో మొదట చిన్నరూపంతో కనిపించినా క్రమంగా విశ్వరూపాన్ని పొంది భూమి నుంచి అంతరిక్షం వరకూ పెరిగిన విషయం తెలిసిందే.

గీతను బోధించే సందర్భంలో శ్రీకృష్ణుల వారు అర్జునునికి విశ్వరూపాన్ని చూపిస్తారు. ఆ రూపాన్ని దర్శించిన తరువాత అర్జునుని ప్రార్ధనమేరకు తిరిగి మునుపటి రూపాన్నే ధరిస్తారు.

అలాగే నరసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించిన తరువాత నరసింహస్వామి వారు కూడా విశ్వరూపాన్ని ప్రదర్శించారేమో , ప్రహ్లాదులు ప్రార్ధించగా మరల పూర్వపు రూపాన్ని ధరించి వారిని అనుగ్రహించారేమో ? అనిపిస్తుంది.

( ఈ ఆలోచన సరైనదో కాదో నాకు తెలియదు. పొరపాట్లు ఉంటే దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను. )

ప్రాచీనులకు మనకన్నా ఎక్కువగా విజ్ఞానం తెలుసు అనీ , ప్రాచీన గ్రంధాలను చదివి , పైపైన ఆలోచించి అపార్ధం చేసుకోకూడదు అనీ అనిపిస్తుంది.


అప్పటివారు కొందరు కుండలలో పిండాలను భద్రపరిచి పెంచినట్లు నేను ఒక దగ్గర చదివాను. ఆ విధానం ఇప్పటి టెస్ట్ ట్యూబు బేబీ పద్ధతి లాంటిది అనిపిస్తుంది కదా !

ఇలా ఇప్పటికే చాలా విషయాల్లో , ఈ నాటి శాస్త్రవిజ్ఞానం ద్వారా ప్రాచీన గ్రంధాలలోని విషయాలు ఆచరణ సాధ్యమేనని నిరూపించబడ్డాయి.

ఈ రోజుల్లో సంతానం లేని కొందరు తల్లిదండ్రులు స్పెర్మ్ బ్యాంకుల సహాయంతో సంతానాన్ని పొందుతున్నారు. అలా పుట్టిన బిడ్డలకు వీర్యదాత ఎవరో గ్రహీతకు కూడా తెలియనివ్వరట. ఈ విధంగా స్త్రీపురుషుల సాన్నిహిత్యం లేకుండానే సంతానాన్ని పొందటం సాధ్యమే.. అని కూడా ఇప్పుడు ఋజువయ్యింది కదా !


( సృష్టిలో కొన్ని మొక్కలలో కూడా పరపరాగసంపర్కం , ఫలదీకరణం అవసరం లేకుండానే వంశాభివృద్ధి జరిగే పద్ధతి ఉంది. ఉదా....ఒక మొక్క
యొక్క ,. కొమ్మను విరిచి నేలలో పాతితే కొత్త మొక్కగా పెరుగుతుంది. )


ప్రాచీనగ్రంధాలలో..... అనివార్యకారణాలవల్ల , తప్పనిసరి పరిస్థితులలో , ఇతరపద్ధతులలో సంతానాన్ని పొందిన కొందరు వ్యక్తుల కధలు ఉంటాయి. ఈనాటి వారు కొందరు ఆ కధలను అపార్ధం చేసుకుంటారు.


నా అభిప్రాయం ఏమంటే , .........ఆ కధలలోని వ్యక్తులు , స్త్రీపురుషుల సాన్నిహిత్యం అనేది లేకుండా , పైన మనం చెప్పుకున్నటువంటి వైజ్ఞానిక పద్ధతుల ద్వారా గానీ .... లేక ....... తపశ్శక్తి, యోగశక్తితో గానీ సంతానాన్ని పొంది ఉండవచ్చు కదా అనిపిస్తుంది.

ఏమైనా ఆనాటి వాళ్ళకి మనకన్నా మెరుగైన ( సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేని ) శాస్త్రవిజ్ఞానం తెలుసేమో అనిపిస్తుంది.


" శ్రీ దేవీ భాగవతము ", " శ్రీ పాద శ్రీవల్లభ  సంపూర్ణ చరితామృతము " వంటి గ్రంధములలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. నా బోటివాళ్ళకు ఆ గ్రంధములలోని కొన్ని విషయాలు అస్సలు అర్ధం కావు. కొన్ని విషయాలు అర్ధం అయినట్లుగా అనిపిస్తాయి.


కొన్ని ప్రాచీన గ్రంధములలోని కొన్ని విషయములు పైకి ఒక విధంగా అర్ధం స్ఫురిస్తూ , లోతుగా ఆలోచిస్తే వేరొక అర్ధం కూడా స్ఫురించేలా
ఉంటాయట.
 


 కొన్ని విషయాలు చదివినకొద్దీ ఎప్పటికప్పుడు కొత్త అర్ధాలు స్ఫురిస్తూ కూడా ఉంటాయట. అంచేత వాటిని చదివి మనకు తోచినట్లుగా అపార్ధం చేసుకోకూడదు.

వ్రాసిన విషయాల్లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.




Saturday, December 3, 2011

మితిమీరిన పారిశ్రామీకరణవల్ల నిరుద్యోగం , ఉద్యోగాలు పోవటం , ఇంకా పర్యావరణానికి హాని.......

 
 
అసలు అభివృద్ధి అంటే పరిశ్రమలు విపరీతంగా పెడితే అభివృద్ధి ఉన్నట్లా ?
 పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందటం అంటే సహజవనరులను విపరీతంగా వినియోగించటం. సహజవనరులు ఏర్పడాలంటే ఎన్నో వేల సంవత్సరాల కాలం పడుతుందట. సహజవనరులు అన్నీ మన అంతులేని కోరికల కోసం వాడేసుకుని రాబోయే తరాలకు ఖాళీ చిప్ప చేతికిస్తామా ? ( పొల్యూట్ అయిపోయిన ప్రపంచంతో సహా ).

* ప్రజల పేదరికం పోవాలంటే సంపద అందరికి సమానంగా అందటం ముఖ్యం. అంతేకానీ పరిశ్రమలు విపరీతంగా స్థాపించటం వల్ల అభివృద్ధి జరగదు.

ఉన్న సంపదంతా కొందరు బడావాళ్ళు అందినంతవరకూ దోచేస్తుంటే ఇక పేదరికం ఎలా పోతుంది ?

పారిశ్రామీకరణ వల్ల కొంతకాలం బాగానే ఉన్నట్లు కనిపించినా అది బలుపు కాదు వాపు అని ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతటా ఆర్ధికమాంద్యం సమస్య చూస్తూనేఉన్నాము కదా !

పారిశ్రామీకరణ తప్పుకాదుకానీ , ఆధునికవిజ్ఞానాన్ని ఎంతలో వాడుకుంటే మంచిదో అంతలోనే వాడుకోవాలి. అతి పనికిరాదు.... యంత్రాలే అన్ని పనులు చేసేస్తే ఇక మనుషులకి మిగిలేది
నిరుద్యోగమే కదా!

.............


ఇది పాతటపానే. కానీ మళ్ళీ వేయాలనిపించింది.
........................
ఈ రోజుల్లో నిరుద్యోగం , ఉన్న ఉద్యోగాలు పోవటం.... ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మితిమీరిన పారిశ్రామీకరణ వల్ల కూడా నిరుద్యోగసమస్య వస్తోందని నా అభిప్రాయమండి.

పనులన్నీ
యంత్రములే చేసేయ్యటం వల్ల మనకి చెయ్యటానికి ఇక పనులు , ఉద్యోగాలు ఎలా వస్తాయి ?


1. పాతకాలంలో ఇప్పటిలా ఇన్ని యంత్రాలు ఉండేవి కావు. ఉదా..వాళ్ళు ఒక వస్తువును తయారుచేయాలంటే ఒక వారం రోజులు సమయం తీసుకునేవారనుకుందాము. దీనివల్ల ఆ వారమంతా రోజూ చేతి నిండా పని ఉండేది. ఇలా చెయ్యటానికి ఎప్పుడూ పని ఉంటుంది...


అయితే ఇలా నెమ్మదిగా ఎక్కువ వస్తువులు తయారు చెయ్యలేము కాబట్టి భూమి పైన ఎక్కువ చెత్త వస్తువులు పేరుకుపోకుండా పర్యావరణం శుభ్రంగా ఉంటుంది.

2. ఈ రోజుల్లో అదే వస్తువును యంత్రాల సహాయంతో ఒక గంట సమయంలోనే ఒక వంద తయారుచేస్తున్నారు. దానివల్ల ఏమి జరుగుతుందంటే .. పని త్వరగా అయిపోయి ఇక చేయటానికి పని ఉండదు . ( నిరుద్యోగం. )

ఇంకా , ఇలా గుట్టలుగా వస్తువులను ఉత్పత్తి చేయటం వల్ల ఖనిజనిల్వలు ఖాళీ అయిపోవటం , భూమి పైన గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వస్తువులతో ఎన్నో సమస్యలు.

.కంపెనీలు ఇలా గుట్టలుగా వస్తువులు తయారు చేస్తాయి . ఇలా గుట్టలుగా వస్తువులను తయారుచేసిన తర్వాత వాటిని ఎవరైనా కొంటేనే వారికి లాభాలు వచ్చి ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలరు. ఎవరూ కొనకపోతే నష్టాలు వచ్చి జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను తీసివేస్తారు.

అలాగని ఎవరు మాత్రం ఎంతకని వస్తువులు కొంటారు ? మనకు అప్పటికే ఇంటినిండా వస్తువులు ఉంటాయి, ఎన్నని కొంటాము ? కొత్తవి కొనేకొద్దీ ఇల్లంతా గజిబిజి .

మా ఇల్లు ఇలాగే చూసినవన్నీ కొని, అలా కొన్నవాటితో కొంచెం గందరగోళంగా ఉంటుంది. వాటిని పారవెయ్యలేము.

పారవేసినా అవి ఎక్కడో ఒకచోట భూమిపైనే చెత్తలా ఉంటాయి గానీ మాయమయ్యేవి తక్కువ . అందుకని ఇప్పుడు ఎంతో అవసరమయితే తప్ప , కొత్తవి కొనటం మానేసామండి.

ఎవరికయినా కొంతకాలానికి ఇలాగే విరక్తి వస్తుంది. అంటే దీనిని బట్టి మనకి ఏమి తెలుస్తుందంటే

1. వస్తువులను ఎవరూ కొనకపోతే , కంపెనీలకు నష్టం వచ్చి అందులోని వారికి ఉద్యోగాలు పోతాయి.

2. వస్తువులను కొంటే కంపెనీలకు లాభాలు వచ్చి ఉద్యోగాలు ఉంటాయి. కానీ భూమి ,పర్యావరణం మట్టికొట్టుకుపోతాయి.


3.అందుకే నాకు ఏమనిపిస్తుందంటేనండి ,పారిశ్రామీకరణ పూర్తిగా తప్పని అనటం లేదు. దానివల్ల కొన్ని లాభాల ఉన్నాయి. అయితే , మనకి కావలసినంత అంటే , మనిషి చేయలేని కష్టమయిన పనులకు యంత్రములను వాడుకోవాలి .

4. గుట్టలుగా వస్తువులను తయారుచేయటం మానాలి.

5. చేతివృత్తులను ప్రోత్సహించాలి.

6. అంతగా వస్తువులు తయారుచేయటం అవసరం లేని ...... అర్ధ శాస్త్రం , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , పర్యాటకం , ఆటలు , సంగీతం, వినోదం ఇలాంటివాటితో ఆర్ధికాభివృద్ధిని సాధించటానికి ప్రయత్నించాలి.

ఈ వినోదం లాంటివి మితిమీరి ప్రజలు తప్పుదారిన వెళ్ళకుండా , వారిలో సోమరితనం పెరగకుండా చూడాలి .

దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివి తగ్గుతాయి. అన్నిటికన్నా కొత్త వస్తువులు కొనాలన్న మోజు , ఇలా ... మన కోరికలను కొంచెము తగ్గించుకోవాలి..

దైవభక్తి , ఇలాంటి వాటి విషయంలో తప్ప ..ప్రతి పనికీ ఒక పరిధి ( లిమిట్ ) ఉంటుంది. ఉదా..ఆరోగ్యానికి మంచిది కదా అని విటమిన్ టాబ్లెట్స్ విపరీతంగా వేసుకుంటే అనారోగ్యం కలుగుతుంది.

అలాగే పెద్దలు చెప్పినట్లు , దేనినయినా ఎంతవరకో అంతవరకే వాడుకోవాలి.. యంత్రములను వీలయినంత తగ్గించటం వల్ల అందరికీ పని దొరికే అవకాశం ఉంది. పర్యావరణం బాగుంటుంది.

* ఇంకా , మనము ఒళ్ళు వంచి పనులు చేసుకోవటం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది.